జగన్ మీడియాపై టీటీడీ చైర్మన్ పరువు నష్టం దావా

Publish Date:Aug 20, 2025

Advertisement

 

టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో జగన్ మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై ఆ చానల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్‌ నోటీసులో తెలిపారు. తక్షణమే సదరు మీడియా టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో టీటీడీ చైర్మన్  మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తాను తొమ్మిది నెలల నుంచి పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

తిరుమల కొండపై అన్న ప్రసాదం సుమారు రోజుకు రెండు లక్షల మంది సేవిస్తున్నారని వివరించారు. అన్న ప్రసాదంలో వడలాంటి కొత్త పదార్థాలను చేర్చామని వెల్లడించారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో కూడా అన్న ప్రసాదం సరఫరా జరుగుతోందని తెలిపారు. తిరుపతిలో స్థానికంగా ఉన్నవాళ్లకి నెలకు ఒకసారి శ్రీవారి దర్శనం గతంలో ఉండేదని.. మళ్లీ ఆ దర్శనాన్ని తాము పునరుద్ధరించామని చెప్పుకొచ్చారు. టీటీడీలో అన్యమతస్థులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లని వేరే డిపార్ట్‌మెంట్‌కి పంపించామని.. కొంతమందికి వాలంటరీ రిటైర్ట్‌మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు బీఆర్ నాయుడు.

టీటీడీలో అన్యమతస్థులపై ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుమల కొండపైన క్యాంటీన్‌లను వైసీపీ నేతలు తీసుకొని మాఫియాలాగా చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవాణి దర్శనం సమయం మార్చామని.. ఉదయం నుంచి రాత్రి వరకు కాకుండా వెంటనే జరిగేలా చూశామని వెల్లడించారు. వీఐపీ దర్శన టైమింగ్ కూడా మార్చామని తద్వారా సామాన్యులకు దర్శనం సులువు అవుతుందని వివరించారు. అలిపిరి వద్ద భద్రత కొంత ఆలస్యం అవుతుందని.. వాటి కోసం కొత్త ఎక్విప్‌మెంట్ సమకూర్చుకుంటున్నామని చెప్పుకొచ్చారు. టీటీడీ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ల‌ను పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా టీటీడీ దేవాలయాలు ఉండాలని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నవించామని గుర్తుచేశారు బీఆర్ నాయుడు.

టీటీడీలో మత మార్పిడిని నివారించడానికి కృషి చేస్తున్నామని.. అందుకు కొత్త దేవాలయాలు నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ప్రత్యేక పుస్తకాన్ని భక్తులకు ఇస్తున్నామని వెల్లడించారు. సిమ్స్‌లో 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. శ్రీవారి ప్రసాదం నాణ్యత కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాము ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్న కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 

జగన్ మీడియా హిందూ మతం మీద దాడి చేస్తోందని ఫైర్ అయ్యారు బీఆర్ నాయుడు. జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఎప్పుడైనా తిరుపతికి వచ్చి శ్రీవారికి తలనీలాలు ఇచ్చారా..? వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిన్నారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ ధర్మం అంటే వారికి పడదని.. అందుకే దాడులు చేస్తున్నారని.. వారు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. తాము తప్పు చేస్తే చెప్పాలి కానీ ఇలా నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. 

మీరు ఎవరితో అయినా పెట్టుకోండి తనతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. తన మీద దాడి చేయండి.. కానీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారం చేయొద్దని హితవు పలికారు. వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి అవినీతి సామ్రాట్, డెకాయిట్ అని ఆరోపించారు. రూ.1600 వందల కోట్లు టెండర్లు ఇచ్చి పది శాతం పర్సెంట్ తీసుకున్నారని బీఆర్ నాయుడు విమర్శించారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.