Publish Date:Jul 27, 2025
తిరుమల శ్రీవారి సేవలో నేడు ప్రముఖులు పాల్గోన్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, కింగ్‌డమ్ మూవీ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ ఉదయం శ్రీవారిని దర్శంచుకున్నారు. రంగానాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక, టీటీడీ పవిత్రతను కాపాడేలా, పూర్వ వైభవం వచ్చిందని ప్రజలు చెబుతున్నారని అన్నారు.ఈ క్రమంలో దైవ దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు, అన్నదానం తో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ తరుణంలో ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుని యువతకు లక్షలాది ఉద్యోగాలు రావాలని, అమరావతి పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు.
శ్రీవారి ఆశీస్సులతో గతేడాది రాయలసీమలో రిజర్వాయర్లన్ని నిండి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. హంద్రీనీవా ద్వారా 3850 క్యూసెక్కుల కృష్ణా జలాలను అడివిపల్లి రిజర్వాయర్ నింపి, హంద్రీనీవా కాలువ ద్వారా భవిష్యత్తులో తిరుపతికి తాగు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ttd-25-202850.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు