ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో దశలో పోలింగ్ జోరు.. పలుచోట్ల ఉద్రిక్తతలు.!

Publish Date:Nov 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో 3,880 పంచాయతీల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

ఈ విడతలో మొత్తం 3,803 సర్పంచ్ పదవులతో పాటు 29,603 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. సుమారు 83.52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 42.46 లక్షల మందికి పైగా మహిళా ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 41.05 లక్షల మంది ఉన్నారు.

ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవాలు పూర్తయ్యాయి. 1,170 సర్పంచ్ స్థానాలు, 19,655 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి. మిగిలిన స్థానాలకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల్లోనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో సాయంత్రానికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 37,019 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తోంది.

అయితే, రెండో దశ పోలింగ్ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ వర్గానికి చెందిన నేతలు పోలింగ్ కేంద్రంలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడినట్లు సమాచారం. బ్యాలెట్ బాక్సులో ఇంకు, నీళ్లు పోయడంతో పాటు పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన కారణంగా అక్కడ దాదాపు రెండున్నర గంటల పాటు పోలింగ్ నిలిచిపోయింది.

మరోవైపు, అనంతపురం జిల్లా యల్లనూరులోనూ పోలింగ్ వేళ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఏజెంట్లపై మూకుమ్మడిగా దాడి చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలింగ్ కేంద్రం ఆవరణలో రాళ్లు రువ్వడంతో పది మంది టీడీపీ కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలతో ఆయా ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అదనపు బలగాలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.మొత్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికలు గ్రామీణ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచాయి. గ్రామస్థాయి పాలనపై పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు తమ మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నించాయి. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే కౌంటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ ఫలితాలు రాష్ట్రంలోని స్థానిక రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: పెళ్లి పేరుతో మోసం: రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ.!

 

 

[ AP Panchayat Elections, Second Phase Polling, AP Panchayat Elections, Sarpanch Elections, Vote Counting, Prakasam District, Anantapur District, State Election Commission ]

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.