Publish Date:Nov 19, 2019
తమ డిమాండ్ల సాధన కోసం నెలన్నరగా సమ్మె చేస్తోన్న ఆర్టీసీ కార్మికులు డిఫెన్స్ లో పడినట్లు కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ హైకోర్టు ఒక్కసారిగా సాఫ్ట్ టర్న్ తీసుకోవడంతో ఆర్టీసీ జేఏసీ కంగుతింది. ఆర్టీసీ సమ్మె విషయంలో ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు వ్యాఖ్యానించడంతో ఆర్టీసీ జేఏసీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇక, అటు ప్రభుత్వం... ఇటు యూనియన్ల మధ్య నలిగిపోతున్న ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగి నెలన్నర దాటుతోన్నా... ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షనూ లేకపోవడంతో... కార్మికుల భవిష్యత్తుపై గందోరగోళం నెలకొంది. మరోవైపు, తమ ప్రధాన డిమాండైన ఆర్టీసీ విలీనాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టినా.... ప్రభుత్వం కఠిన వైఖరి వీడకపోవడంపై కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఆర్టీసీ సమ్మె వెనుక ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలన్న కుట్ర ఉందన్న సునీల్ శర్మ అఫిడవిట్‌పై కార్మిక జేఏసీ మండిపడింది. అసలా అఫిడవిట్ రాజకీయ లీడర్ ఇచ్చినట్లుగా ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా, కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోమని ఎండీ ఎలా చెబుతారని మండిపడ్డ ఆర్టీసీ జేఏసీ... ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం కమిటీ వేస్తే.... సమ్మెపై పునరాలోచిస్తామని హైకోర్టుకు తెలిపింది. అయితే, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని మరోసారి హైకోర్టుకు తేల్చిచెప్పింది ప్రభుత్వం. ఆర్టీసీ కార్పొరేషన్ పరిస్థితి అస్సలు బాగోలేదని, సమ్మె కారణంగా మరింత నష్టం జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులతో చర్చలు జరపలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కకు-పెట్టినా... తిరిగి ఏక్షణమైనా మళ్లీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశముందని కోర్టుకు వివరించింది.
ఇక, ఎప్పటిలాగే ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని మరోసారి ప్రభుత్వం కోరగా.... సమ్మె లీగలో... ఇల్లీగలో చెప్పే అధికారం ...లేబర్ కోర్టుకు మాత్రమే ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ పరిధి దాటి సమ్మె చట్ట విరుద్ధమంటూ ఆదేశించలేమని తేల్చిచెప్పింది. మరోవైపు, ప్రభుత్వంతో చర్చలకు కమిటీ వేయాలన్న ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తికి కూడా కోర్టు నో చెప్పింది. అయితే, రెండు వారాల్లోగా సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మికశాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాజా వ్యాఖ్యలతో ఆర్టీసీ కేసు కీలక మలుపు తిరిగినట్లయ్యింది. అయితే, హైకోర్టు తాజా వ్యాఖ్యలు... ప్రభుత్వానికి కొంత సానుకూలంగా ఉండటంతో... ఆర్టీసీ కార్మిక జేఏసీ సమ్మెపై పునరాలోచనలో పడింది. అప్పటికప్పుడు సడన్ బంద్ ను వాయిదా వేసుకోవడంతోపాటు.... సమ్మె కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tsrtc-strike-updates--high-court-hearing-on-tsrtc-petition-39-91320.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.