లంచం తీసుకుంటే జనంతో సమస్య... తీసుకోను అంటే అధికారులతో తంటా...

Publish Date:Nov 19, 2019

Advertisement

 

కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకి కోపం... అన్నట్టుంది తెలంగాణలో కొందరు అధికారుల పరిస్థితి. లంచం తీసుకుంటే జనంతో సమస్య... లంచం తీసుకోను అంటే తోటి ఉద్యోగులతో ఇబ్బందులు... ఇదీ నిజాయితీపరులైన అధికారుల పరిస్థితి. తహశీల్దార్ విజయారెడ్డి మర్డర్ తర్వాత... తాను లంచం తీసుకోను అంటూ తన ఛాంబర్‌లో బోర్డు పెట్టుకున్న కరీంనగర్‌ విద్యుత్ ఉద్యోగి అశోక్‌... ఊహించనివిధంగా తోటి అధికారులు, ఉద్యోగుల నుంచే బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్... తన ఛాంబర్‌లో... నేను లంచం తీసుకోను అంటూ బోర్డు పెట్టారు. అయితే, మీడియా అండ్ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం రావడంతో.... అశోక్ కు ఊహించని విధంగా సమస్యలు మొదలయ్యాయి. తోటి ఉద్యోగులే బెదిరించడం మొదలుపెట్టారు. అశోక్ పెట్టిన బోర్డుతో ఇబ్బందిగా ఫీలవుతోన్న సహ ఉద్యోగులు.... వేధించడం ప్రారంభించారు. నీవు ఒక్కడివే నీతిమంతుడివా? నీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని అశోక్ వాపోతున్నారు. తన డిపార్ట్ మెంట్‌లో ఒకరిద్దరు మాత్రమే అభినందించారని, మిగతా వాళ్లు ఇబ్బందిగా ఫీలవుతున్నారని అశోక్ అంటున్నారు. అయితే, సహ ఉద్యోగుల నుంచే కాకుండా.... ప్రజల నుంచి కూడా పెద్దఎత్తున ఫోన్లు, మెసేజ్‌లు వస్తున్నాయన్న అశోక్‌.... ఇప్పటివరకు ఎంత తీసుకున్నావ్‌.... ఇప్పుడు బోర్డు పెడితే సరిపోతుందా అంటూ ఎగతాళి చేస్తున్నారని తెలిపారు. అయితే తాను ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నిజాయితీగానే ఉన్నానని, తన ఆస్తులపై విచారణ జరపాలని స్వయంగా ఏసీబీకి లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, తోటి ఉద్యోగుల నుంచి బెదిరింపులు, వేధింపులు ఎక్కువవడంతో.... ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. కొందరు నీ అంతు చూస్తామంటూ బెదిరించడంతోపాటు సూటిపోటి మాటలతోపాటు మానసికంగా వేధిస్తూ అవమానిస్తున్నారంటూ కంప్లైంట్ చేశారు.

తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో రెవెన్యూ ఉద్యోగులే కాదు... మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే ప్రాణభయంతో వణికిపోతోంది. లంచం కోసం విసిగిస్తే... తెగించినోళ్లు ప్రాణాలు తీసే ప్రమాదముందని జాగ్రత్త పడుతున్నారు. అయితే, ఏ వ్యవస్థలోనైనా... కేవలం జీతంపైనే ఆధారపడుతూ, నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారులూ ఉంటారు. అయితే, అలాంటి అధికారులకు తోటి ఉద్యోగుల నుంచే ఊహించనివిధంగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే, అశోక్ నిజాయితీపై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే... మరోవైపు ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఇప్పటివరకు దోచుకుని... ఇప్పుడు తాపీగా లంచం తీసుకోను అంటూ బోర్డు పెడతారా అంటూ విమర్శిస్తున్నారు. దాంతో, అభినందించే వాళ్లతో పోల్చితే.... వేధించేవాళ్లే ఎక్కువగా ఉన్నారని అశోక్ వాపోతున్నారు.
 

By
en-us Political News

  
కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
ప్రధాని న‌రేంద్ర మోదీ చేతుల మీదుగా స‌రిగ్గా ఏడాది క్రితం యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ ఢిల్లీలో చేయించారు మంత్రి నారా లోకేష్‌. అప్పటి ఫోటోను ఫ్రేమ్ చేయించి.. అందులో యువ‌గ‌ళం కాఫీ టేబుల్ బుక్ కూడా భద్రపరిచారు. ఇది సీఎం చంద్రబాబు ఇంట్లోకి వెళ్లే ముందు క‌నిపిస్తుంది. ప్రధాని మోదీ ఆ ఫొటోను చూసి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.