ఆర్టీసీ సమ్మె పై ఈ నెల ఇరవై తొమ్మిదిన కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది?

Publish Date:Oct 22, 2019

Advertisement

 

సెప్టెంబర్ నెల వేతనాలు అందుతాయని ఆశపడ్డ కార్మికులకు ఆర్టీసీ సంస్థ మొండి చెయ్యి చూపించింది ప్రభుత్వం. జీతాలకు నిధులు లేవని ఆర్టీసీ యాజమాన్యం చెప్పడం పై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. అటు సమ్మె విషయంలో ప్రభుత్వం తీరు పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించడానికి సరిపడ నిధులు లేవని సంస్థ ఇన్ చార్జి ఎండీ సునీల్ శర్మ హై కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కార్మికుల జీతాలకు రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు అవసరమని ప్రస్తుతం సంస్థ ఖాతాలో సుమారు ఏడు పాయింట్ ఐదు కోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ప్రతి నెలా కార్మికుల జీతాల కోసం ప్రభుత్వం అందించే సహాయం కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. ఆదాయ వనరులు లేక పోవడంతో జీతభత్యాల కోసమే పీఎఫ్ సీసీఎస్ నిధులు వినియోగించుకున్నట్టు తెలిపారు. కార్మికులు సెప్టెంబర్ నెల జీతాల కోసం ఎన్ఎంయూ ప్రధాన కార్యదర్శికి హనుమంతు మరొకరు హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ వ్యాఖ్యలపై విచారణ జరిగింది.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది.ఆర్టీసీ ఆదాయం రోజుకు పది కోట్లని పండుగ రోజుల్లో పదమూడు కోట్లుంటుందని ఏఏజీ రామచంద్ర రావు వాదించారు. కార్మికులు సరిగ్గా దసరా పండుగకు ముందు సమ్మెకు దిగడంతో నూట ఇరవై ఐదు కోట్ల నష్టం వచ్చిందన్నారు.ఆర్టీసీ వార్షిక వ్యయం ఐదు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లు కాగా ఆదాయం నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు అని ప్రస్తుతం ఆర్టీసీ ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్ల నష్టాల్లో ఉందని వినిపించారు. ఏటా పన్నెండు వందల కోట్ల నష్టాలు వస్తున్నాయన్నారు. రాబడి లో యాభై ఎనిమిది శాతం జీతాలకే వినియోగిస్తున్నారని, రెండు వేల పదిహేనులో నలభై నాలుగు శాతం ఫిట్ మెంట్ తో సంస్థ పై తొమ్మిది వందల కోట్లు, రెండు వేల పదిహెడులో పదహారు శాతం తో రెండు వందల కోట్ల భారం పడిందని రామచంద్రారావు వాదించారు.అయితే కార్మికుల వేతనాలకు సంబంధించి కోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమాచారం ఇస్తుందని పిటిషనర్ల తరపు లాయర్ వాదనలు వినిపించారు.ఆర్టీసీ అధికారులకు వంద కోట్ల మేర వేతనాలు చెల్లించిందని కార్మికులకు ఇవ్వాల్సింది నూట నలభై కోట్ల అన్నారు. కార్మికులు సమ్మె చేస్తున్న డెబ్బై శాతానికి పైగా బస్సులనూ తిప్పుతున్నామని  తెలిపారు. ఈ లెక్కన సమ్మె కాలంలో తాత్కాలిక డ్రైవర్ లు కండక్టర్ ల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో ఎక్కడా చెప్పలేదని అన్నారు. అటు ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళ సాయిని కలిశారు చర్చలకు ఆహ్వా నించడం అద్దె బస్సులను తీసుకునే విషయం పై ప్రభుత్వం తో మాట్లాడుతానని ఆర్టీసీ కార్మికులు భయపడొద్దని ఆమె భరోసా ఇచ్చారు కార్మిక యూనియన్ లను చర్చల కు ఆహ్వానించి సమ్మెను విరమింప చేయాలని హై కోర్టు సూచించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

కోర్టు కాపీ అంత లేదన్న సాకుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అన్నారు కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు అద్దె బస్సు లను తీసుకోవడానికి వీల్లేదని ఇరవై ఐదు శాతాని కి మించి తీసుకోవద్దని నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వం లాకౌట్ గా ప్రకటిస్తుందన్న వార్తలు వెలువడుతున్నాయి. అలా ప్రకటించటానికి సీఎం ఎవరని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు ఆస్తి అని దీనిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఒక వెయ్యి ముప్పై ఐదు అద్దె బస్సుల కోసం టెండర్ లు పిలవడం ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచనలో భాగమేనని ఆరోపించారు.అటు పిటిషన్ పై విచారణ వాయిదా పడటంతో జీతాల కోసం కార్మికు లు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల ఇరవై తొమ్మిది న కోర్టు ఏం చెబుతుందా అని అందరిలో ఆసక్తి నెలకొంది.

 

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.