ఏసీ లో గడపడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలివి..!

Publish Date:Apr 1, 2026

Advertisement

మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఏసీలో ఎక్కువగా గడిపేవారిలో ఊబకాయం సమస్య చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి.  ఏసీ లో గడపడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ నిజాలు తెలుసుకోవాలి...

ఊబకాయం ఎలా పెరుగుతుందంటే..

కార్యకలాపాలు లేకపోవడం..

శరీరం సౌకర్యవంతంగా చల్లగా ఉన్నప్పుడు, అది శక్తిని ఖర్చు చేయడానికి ప్రయత్నం చేయదు. రోజంతా కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల కేలరీల బర్నింగ్  గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా, కొవ్వు వేగంగా పేరుకుపోతుంది.

ఉష్టోగ్రత..

వేడి వాతావరణంలో, శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి శరీరం ఎక్కువగా శ్రమిస్తుంది, దీనివల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది. ఏసీలో ఉండటం ఈ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల జీవక్రియ రేటు తగ్గి బరువు పెరుగుతుంది.

ఆకలి..

చల్లని వాతావరణంలో శరీరానికి అదనపు శక్తి అవసరం ఏర్పడుతుంది. దీని ఫలితంగా తరచుగా ఆకలి వేయడం, విచక్షణారహితంగా జంక్ లేదా నూనె పదార్థాలను తినడం వంటివి ఊబకాయానికి దారితీస్తాయి.

చెమట, డిటాక్స్..

చెమట పట్టడం అనేది శరీరం  సహజ డిటాక్స్ ప్రక్రియ. ఎయిర్ కండిషన్డ్ గదులలో ఉండటం వల్ల చెమట తక్కువగా పడుతుంది, దీనివల్ల శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయి, బరువు పెరగడం,  ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

మనస్సు, శరీరం..

చల్లటి గాలి మనసును మొద్దుబార్చి, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. ఇది ప్రేరణపై కూడా ప్రభావం చూపి, వ్యాయామం పట్ల ఇంటరెస్ట్ లేకుండా చేస్తుంది.  సోమరితనం పెంచుతుంది.

ఇలా జాగ్రత్త పడాలి..

ప్రతి 45 నిమిషాలకు 5 నిమిషాల పాటు నడవాలి,  లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయాలి.

ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా ఉంచకూడదు, దానిని 24–26 డిగ్రీలకు పరిమితం చేయాలి.

ఇంటి పనులతో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి.

తాజా పండ్లు, సలాడ్లు,  నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

ప్రతిరోజూ వ్యాయామం కోసం కనీసం 30 నిమిషాలు కేటాయించాలి.

విశ్రాంతి ముఖ్యం, కానీ విశ్రాంతి అలవాటు వల్ల వచ్చే ఊబకాయం జీవితాంతం ఉండే ఒత్తిడిగా మారే అవకాశం ఉంటుంది.

                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు...
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు....
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం...
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు....
డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో....
వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు,  ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం,   నిరంతరం  అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 బిలియన్ల మంది ఊబకాయం (Obesity) మరియు దాని సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు...
ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం తప్పనిసరి. నేటికాలంలో ఆహారం విషయంలో చాలా సీరియస్ నెస్ వచ్చింది.  నిజానికి నేటికాలంలో పుడీస్ ఎక్కువ అయ్యారు.  నచ్చిన ఆహారం తినడంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.