వేసవి వచ్చేసింది.. వడదెబ్బ, డీహైడ్రేషన్ సమస్య రాకూడదంటే ఈ డ్రింక్స్ తాగండి!
Publish Date:Mar 14, 2026
Advertisement
బేల్ షర్బత్.. పరమ శివుడి ఆరాధనలో ఉపయోగించే బిల్వ పత్రం మాత్రమే మనకు తెలుసు. కానీ బిల్వ వృక్షానికి పండ్లు కూడా కాస్తాయి. వీటినే బిల్వ పండ్లు లేదా బేల్ పండ్లు అని మారేడు కాయలు అని అంటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బాగా పండిన బిల్వ పండ్లను జ్యూస్ చేసి తాగితే శరీరం చల్లబడుతుంది. కావలసిన పదార్థాలు.. పండిన బిల్వ పండు చల్లని నీరు.. 4 గ్లాసులు బెల్లం లేదా చక్కెర.. 3 నుండి 4 స్పూన్లు నల్ల ఉప్పు.. కొద్దిగా. తయారు విధానం.. బిల్వ పండును పగలగొట్టి గుజ్జు తీయాలి. ఈ గుజ్డులో నీరు పోసి బాగా బ్లెండ్ చేయాలి. స్ట్రైయినర్ సహాయంతో వడబోయాలి. ఇందులో బెల్లం లేదా పంచదార, నల్ల ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత తాగాలి. ఆమ్ పన్నా.. వేసవి అంటే మామిడికాయలు. పచ్చి మామిడి కాయలతో చేసే ఆమ్ పన్నా రుచిగానే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. కావలసిన పదార్థాలు.. పచ్చి మామిడికాయలు.. 2 బెల్లం లేదా చక్కెర.. 3 టీస్పూన్లు వేయించిన జీలకర్ర పొడి నల్ల ఉప్పు పుదీనా.. తయారీ విధానం.. మామిడికాయలు ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి. గుజ్జులో బెల్లం లేదా చక్కెర వేయాలి. ఇందులో కాసింత పుదీనాను వేసి మిక్సీ వేసుకోవాలి. దీనికి కావలసినంత నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలిపి తాగాలి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జల్ జీరా.. జల్ జీరా పేరు వింటేనే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, శరీరానికి చలువ, గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కూడా ఇస్తుంది. కావలసిన పదార్థాలు.. జల్ జీరా పొడి నీరు పుదీనా నిమ్మరసం నల్ల ఉప్పు తయారీ విధానం.. చల్లని నీటిలో జల్ జీరా పొడి, నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా అన్నీ వేసి బాగా కలిపి తాగడమే. సత్తు జ్యూస్.. బీహార్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో సత్తును వేసవిలో తాగుతారు. ఇది చాలా శక్తివంతమైన పానీయం. కడుపును చల్లబరుస్తుంది, ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. కావలసిన పదార్థాలు.. సత్తు పొడి.. నల్ల ఉప్పు.. వేయించిన జీలకర్ర పొడి నిమ్మరసం తయారీ విధానం.. నీటిలో సత్తు పొడి, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో కాసింత నిమ్మరసం కలిపి తాగాలి. మజ్జిగ.. బారతీయులు ఎక్కువగా తాగే ఆరోగ్యకరమైన పానీయం మజ్జిగ. పెరుగు నుండి వెన్నను తీయగా మిగిలిన పానీయమే మజ్జిగ. ఈ మజ్జిగ మరింత రుచిగా ఉండటానికి ఇందులో అల్లం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, పొదీనా వేసి తాగుతారు. మజ్జిగ మరింత రుచిగా రావడానికి కరివేపాకుతో పోపు పెట్టి తాగుతారు. ఇందులో కొత్తి మీర వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది. *రూపశ్రీ.
వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు, ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం, నిరంతరం అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి. పెరుగుతున్న వేడి, వేడిగాలుల కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వేసవి కాలంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు తాగుతారు, కానీ అది శరీరాన్ని చల్లబరచదు. ఎన్ని నీళ్లు తాగినా తృప్తి కలగదు. మార్కెట్ లో పానీయాలు కొనుగోలు చేయడం, మరీ ముఖ్యంగా కూల్ డ్రింకుల కొనుగోలు వేసవిలో బాగా పెరుగుతాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి. ఈ వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని పానీయాలు తీసుకోవడం మంచిది. భారతీయులకు ఎంతో సుపరిచితమైన, ఆరోగ్యానికి మేలు చేస్తూ వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలు ఏంటో తెలుసుకుంటే..
http://www.teluguone.com/news/content/drink-these-to-prevent-heatstroke-and-dehydration-34-215501.html





