ఇరాన్ విషయంలో ట్రంప్ యూటర్న్

Publish Date:Jun 5, 2026

Advertisement

అంతర్జాతీయ రాజకీయాల్లో  కీలక పరిణామం సంభవించింది. నిన్నటివరకు  ఇరాన్ పై నిప్పులు చెరిగిన అగ్రరాజ్యధినేత డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు.   ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సమావేశం కావడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం  కుదిరితే, తాను ఖచ్చితంగా ఇరాన్ అత్యున్నత నేతను కలుస్తాననీ, అలా కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తాననీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్   ఈ రకమైన సానుకూల వ్యాఖ్యలు రావడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను సైతంవిస్మయానికి గురిచేస్తోంది.

ఈ మొత్తం వ్యవహారంలో కేవలం భేటీ ప్రకటన మాత్రమే కాదు, ఇరాన్ అణు విధానంపై కూడా ట్రంప్ తన   వైఖరిని  మార్చుకున్నారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఆ దేశం నుంచి పూర్తిగా తరలించాలనే నిబంధనను పక్కనబెట్టారు. ప్రస్తుతం ఆ యురేనియం అంతా భూగర్భంలో కట్టుదిట్టమైన భద్రతా నిఘాలో ఉందని, దాన్ని బయటకు తీయడానికి లేదా తరలించడానికి అమెరికా సైన్యాన్ని పంపే ఉద్దేశం తనకు ఇసుమంతైనా  లేదని ట్రంప్  చెప్పారు.

గతంలో ఇరాన్‌తో శాంతి చర్చలు జరగాలంటే యురేనియం నిల్వలను పూర్తిగా తొలగించాల్సిందేనని పదే పదే డిమాండ్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఇలా యూ-టర్న్ తీసుకోవడం ఇరాన్ పట్ల అమెరికా మార్పునకు స్పష్టమైన సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటి వరకూ ఇరాన్‌పై కఠిన ఆంక్షలు, సైనిక దాడులతో విరుచుకుపడిన ట్రంప్.. ఇప్పుడు శాంతి ఒప్పందం కోసం ఇంతగా దిగిరావడం విశేషం.  

By
en-us Political News

  
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్‌ స్టేజ్‌కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.