Publish Date:Feb 21, 2026
టారిఫ్‌ల విషయంలో సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు తగ్గలేదు. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీంకోర్డు చెప్పిన గంటల వ్యవధిలోనే ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. తీర్పు వచ్చిన గంటల్లోనే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకాలు విధించిన ఆయన.. తాజాగా వాటిని 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఆ మేరకు సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. సుప్రీంకోర్డు తీర్పు క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత ఈ సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అవి తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మున్ముందూ చట్టబద్దమైన టారిఫ్‌లు అమలు చేస్తామన్నారు. గతంలో తీసుకున్న దానికంటే ఎక్కువ టారిఫ్‌లు విధించేందుకు సాధ్యమైన చర్యలన్నీ తీసుకుంటామని పేర్కొన్న ఆయన.. తాజాగా వాటిని 15 శాతానికి పెంచడం చర్చనీయాంశంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trump-imposes-15percent-tarriffs-36-214476.html
పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.
తాడిపత్రిలో సీఎం చంద్రబాబు క్షేత్ర పర్యటన… రైతులతో ముఖాముఖి
2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది.
తండ్రి కొడుకులను లాకప్‌లో చంపిన కేసులో అసలేం జరిగింది?
అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి కుమారుడుకి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజధానిలోని అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటైన ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం సంచలన ఘటన చోటుచేసుకుంది.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.