మునుగోడులో మా విజయం వామపక్షాల చలవే.. అంగీకరించిన టీఆర్ఎస్

Publish Date:Nov 8, 2022

Advertisement

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు వామపక్షాల చలవే అని టీఆర్ఎస్ అంగీకరించింది.   కమ్యూనిస్టుల వల్లే తాము గెలిచామని మునుగోడు ఎలక్షన్‌కు ఇంచార్జ్‌గా వ్యవహరించిన మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిని బట్టే మునుగోడు విజయం బలుపు కాదన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ అంగీకరించినట్లైంది. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సహకరించినందుకు వామపక్షాలకు కృతజ్ణతలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి నేరుగా వారి కార్యాలయానికి వెళ్లి మరీ ధన్యవాదాలు చెప్పి వచ్చారు.

వామపక్షాలు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలిపాయనీ, స్వయంగా ప్రచారంలోనూ పాల్గొన్నాయనీ జగదీశ్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. బీజేపీ కుట్రలను  ఎదుర్కోవాలనే వ్యూహంలో భాగంగానే వామపక్షాలు తమకు అండగా నిలిచాయని చెప్పారు. ఒక విధంగా మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి క్రెడిట్ మొత్తం వామపక్షాలకు ఇచ్చేసినట్లు టీఆర్ఎస్ తీరును బట్టి తెలుస్తోంది. ప్రజలతోనే మా పొత్తు, పార్టీలతో కాదు అంటూ ఇంత కాలం చెబుతూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత.. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయం వెన్నాడటంతో వామపక్షాలను శరణు జొచ్చారు. గతంలో కమ్యూనిస్టులా వారెక్కడున్నారు అంటూ ఎద్దేవా చేసిన కేసీఆర్.. ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ పొత్తు పెట్టుకున్నారని విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాల ఓటు పది వేల వరకూ ఉంటుందని అంచనా. సరిగ్గా వామపక్షాల ఓట్లే టీఆర్ఎస్ కు మెజారిటీ తీసుకువచ్చాయని చెప్పవచ్చు.

ఆ ఓట్లే కనుక టీఆర్ఎస్ కు రాకుండా ఉంటే మునుగోడులో విజయం అందని ద్రాక్షగానే మిగిలి ఉండేదన్న విషయం అర్ధం కావడంతోనే కేసీఆర్ మంత్రిని సీపీఎం కార్యాలయానికి పంపి మరీ ధన్యవాదాలు చెప్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీ కాక.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు మద్దతుగా ఏ పార్టీ ముందుకు రాని పరిస్థితుల్లో కేసీఆర్ పూర్తిగా వామపక్షాల మీదే ఆధారపడ్డారనీ, బీజేపీ వ్యతిరేక విధానాలకు ఒక సిద్ధాంతం పునాదిగా వామపక్షాలను తోడు తెచ్చుకున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అందుకే కమ్యూనిస్టులా వాళ్లెక్కడ ఉన్నారన్న ఆయన ఇప్పుడు వారినే కోరి దగ్గరకు చేర్చుకున్నారంటున్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులో భాగంగా వారికి ఎన్ని సీట్లిస్తారు? అసలు ఇస్తారా అన్న ప్రశ్నలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.    పైగా జాతీయ రాజకీయాల్లోనూ కమ్యూనిస్టుల మద్దతు కేసీఆర్ కు అవసరమాయే. అందుకే ప్రజలతోనే పొత్తన్న కేసీఆర్ ఇప్పుడు పొత్తులు ఉంటేనే ప్రజల వద్దకు అంటున్నారని సెటైర్లు పేలుతున్నాయి. 

By
en-us Political News

  
బుల్లితెర ప్రేక్షకులను నవ్వించే జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడంపై ఢిల్లీకి చెందిన చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది.
తాళి కట్టిన 24 గంటల్లోనే బిడ్డకు జన్మ..అసలు కథేంటి.?
సర్వదర్శనానికి 8 గంటల సమయం.!
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.