బంగారం ధరలు భారీ తగ్గుదల.. ప్రధాని మోదీకి సీటీఐ కృతజ్ఞతలు.!
Publish Date:Nov 22, 2026
Advertisement
బంగారం ధరలు భారీగా పడిపోవడంపై ఢిల్లీకి చెందిన చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది. గతంలో పసిడి కొనుగోళ్ల విషయంలో ప్రధాని ఇచ్చిన సూచన వల్ల లక్షలాది మంది వ్యాపారులు, మదుపరులు పెద్ద ఆర్థిక నష్టాల నుంచి బయటపడ్డారని సీటీఐ పేర్కొంది. మార్కెట్ గణాంకాల ప్రకారం కిలో బంగారం ధర రూ. 1.90 కోట్ల స్థాయి నుంచి రూ. 1.25 కోట్లకు దిగివచ్చింది. అంటే కిలోపై ఏకంగా రూ. 65 లక్షల మేర ధర తగ్గినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. కొన్ని నెలల క్రితం అధిక ధరల వద్ద బంగారం కొనవద్దంటూ ప్రధాని చేసిన సూచనను పాటించడం వల్లే ఇప్పుడీ భారీ పతనంలో నష్టాలు తప్పాయని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు. ఆ సమయంలో గనుక భారీగా నిల్వలు కొనుగోలు చేసి ఉంటే, ఎంతోమంది ఆభరణాల వర్తకులు అప్పుల ఊబిలో కూరుకుపోయేవారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో పసిడి వ్యాపారం చేసే చిరు వర్తకులతో పాటు స్టాక్ మార్కెట్ మదుపరుల పెట్టుబడులకు కూడా ఈ జాగ్రత్త రక్షణ కల్పించిందని సీటీఐ తన లేఖలో వివరించింది. తొలుత ఆ సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా, ప్రస్తుత పరిణామాలతో వ్యాపారుల ఆలోచనలో మార్పు వచ్చిందని తెలిపింది. ఇది కూడా చదవండి: అనిరుధ్–కావ్య మారన్ రిసెప్షన్లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి.! లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, తన మాట విని ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గించడం వల్ల ధరలు తగ్గాయని, తద్వారా సామాన్యుల సొమ్ము ఆదా అయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో ధరలు తగ్గడం కుటుంబాలకు ఊరటనిచ్చే అంశమని పరిశీలకులు భావిస్తున్నారు. బంగారం, వెండి వంటి సున్నితమైన లోహాల మార్కెట్లలో ధరల హెచ్చుతగ్గులపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇస్తూ ఉండాలని సీటీఐ కోరింది. రానున్న రోజుల్లో సట్టా వ్యాపారం, నిల్వల కట్టడితో పాటు ధరల స్థిరత్వంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై వ్యాపారులు, కొనుగోలుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకు నచ్చవచ్చు: ఒకే వేదికపై సీఎం విజయ్–సంగీత.. వేర్వేరు ఎంట్రీలతో రిసెప్షన్లో హాట్ టాపిక్.! మీకు నచ్చవచ్చు: పెళ్లైన మరుసటి రోజే నవవధువు ప్రసవం..వరుడికి ఊహించని షాక్.! [ Gold prices, CTI, Prime Minister Modi, gold price fall, jewellers, Gold Prices India, Gold Import Duty Hike ]
http://www.teluguone.com/news/content/gold-prices-25-237692.html




