కారుకి, కాషాయానికి మధ్య వార్ స్టార్టైనట్టేనా?

Publish Date:Jul 29, 2017

Advertisement

 

కేసీఆర్ ఈ మధ్య దిల్లీ వెళ్లి వచ్చారు. ప్రధానమైన అసెంబ్లీ సీట్ల పెంపుపై ఓ క్లియర్ ఐడియా వచ్చేసింది. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఇప్పుడప్పుడే లేదని తేలిపోయింది. కాని, ఈ పరిణామంపై మోదీతో భేటీ తరువాత కేసీఆర్ పెద్దగా అసంతృప్తి ఏం ప్రకటించలేదు. సాదాసీదాగా హైద్రాబాద్ వచ్చేశారు. కాని, తరువాతే రెండు గుర్తించదగ్గవి జరిగాయి! ఒకటి… పాతబస్తీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన రాజా సింగ్ మీద చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పేసింది! ఆయనెప్పుడో 2013లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనీ… వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్కార్ పోలీస్ లకు పర్మిషన్ ఇచ్చింది! ఇక రెండోది… ఓవైసీ ఓ కామెంట్ చేశారు! కేసీఆర్ వున్నంత వరకూ బీజేపి తెలంగాణలో అధికారం చేపట్టలేదని అర్థం వచ్చేలా మాట్లాడారు!

 

బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ మీద చర్యలు, ఓవైసీ కేసీఆర్ మీద విశ్వాసం ప్రకటించటం… ఒక దానితో ఒకటి లింక్ వున్నవి కాకపోవచ్చు! కాని, మొత్తం మీద ఒకటి మాత్రం అర్తం చేసుకోవచ్చు. ఇంత కాలం కేసీఆర్ కమలదళాన్ని టార్గెట్ చేయలేదనే చెప్పాలి. అప్పుడో ఇప్పుడో కామెంట్లు చేసినా టీఆర్ఎస్, బీజేపీల మధ్య పచ్చ గడ్డి భగ్గుమనే పరిస్థితులు రాలేదు. కాని, 2019ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వారంతా టీఆర్ఎస్, బీజేపిల నడుమ సాగుతుందా అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది. ఎందుకంటే, కేసీఆర్ సర్కార్ రాజాసింగ్ పైన చర్యలు తీసుకుంటే అది దుమారం రేపే అవకాశాలే వున్నాయి. రాజా సింగ్ కు హిందూ ఫైర్ బ్రాండ్ గా, ఓవైసీలతో పోరాడే హిందూత్వ నాయకుడిగా ఓ మోస్తరు గుర్తింపు వుంది. అది రేపో మాపో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తే మరింత పెద్దదవుతుంది. బీజేపికి కూడా ఇప్పుడు ఇలాంటి అంశమే కావాలి!

 

అసదుద్దీన్ ఓవైసీ బీజేపిని తాను ఎదుర్కొంటానని అనకుండా… కేసీఆర్ వున్నంత వరకూ అంటూ భరోసా ప్రకటించటం… ముందు ముందు వారి కో ఆపరేషన్ని చెప్పకనే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారికంగా ఎంఐఎం కార్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపి వారికి అంతకంటే కావాల్సింది ఇంకేం వుండదు. ఆ కలయికనే బూచిగా చూపి ప్రచారం హోరెత్తిస్తారు.

 

టీఆర్ఎస్, బీజేపి ఎదురెదురు తలపడితే ముందుగా అలెర్ట్ కావాల్సింది తెలంగాణ కాంగ్రెస్! ఎందుకంటే, చాలా మంది రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం టీఆర్ఎస్, కేసీఆర్ లకు జనంలో ఇంకా గట్టి ఫాలోయింగే వుంది. ఎటోచ్చి… చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు తెలంగాణలో కూడా… బీజేపి వేడి కాంగ్రెస్ కు తగలచ్చు. ఎన్నికల ముందు ఇప్పుడు గుజరాత్ లో జరుగుతోన్నట్టు ఊహించని వలసలు ఇక్కడ కూడా వుంటే  అది హస్తానికి పెద్ద ప్రమాదం. బీజేపి వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టకపోయినా… ప్రధాన ప్రతిపక్షం అయినా బోలెడు లాభం పొందినట్టే!

By
en-us Political News

  
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.