పింక్ డైమండ్ కేసు.. రమణ దీక్షితులు, విజయసాయికి చిక్కులు తప్పవా?

Publish Date:Jul 24, 2026

Advertisement

పింక్ డైమండ్  కేసు టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, వైసీపీ మాజీ నేత విజయసాయి మెడకు చుట్టుకుంటోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రతిష్ఠకు భంగం కలిగేలా పింక్ డైమండ్ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారంటూ గతంలో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ ఇప్పుడు తుది దశకు వచ్చింది.  ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది.  విషయానికి వస్తే.. 

ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ పోయిందంటూ.. టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు, అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ ను బదనాం చేయడమే లక్ష్యంగా వారిద్దరు మిన్నూమన్నూ ఏకమయ్యేలా ప్రచారం చేశారు.   పింక్ డైమండ్ పేరుతొ సాక్షాత్తు తిరుమల  వేంకటేశ్వరుడిని కూడా రాజకీయ వివాదాల్లోకి లాగారు.

తిరుమల తిరుపతి దేవస్థానంపై నిందలు వేయడంతోపాటు .. శ్రీవారి ప్రతిష్టను దిగజార్చడంతో .. టీటీడీ  రెండుకోట్ల రూపాయల ఫీజు కట్టి మరీ రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై చెరో వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత..   ఈ కేసును నీరుగార్చేందుకు చేయని ప్రయత్నం లేదు.   అసలు శ్రీవారి ఆభరణాల్లో  పింక్ డైమండ్ అనేదే లేదని, అది ఒక గులాబీ రంగు రాయి మాత్రమేనని జగన్ ప్రభుత్వమే అసెంబ్లీలో, ఉన్నత న్యాయస్థానాల్లో స్వయంగా అంగీకరించింది.  తద్వారా తాము చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని చెప్పకనే చెప్పినట్లైంది. అంతే కాకుండా..  టీటీడీ చేత ఆ కేసును వెనక్కి తీసుకుంటామంటూ..  కోర్టులో ఉపసంహరణ పిటిషన్    దాఖలు చేయించింది. అయితే.. కేసును విత్ డ్రా చేసుకోడానికి వీల్లేదనీ..  కేసులో తమను కూడా పార్టీలుగా చేర్చాలంటూ,  తెలంగాణ హిందూ జనశక్తితోపాటు, మరో న్యాయవాది పిటిషన్ వేశారు. వారికి టీటీడీతోపాటు ఈ కేసులో పార్టీలుగా ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

దీంతో ఈకేసులో రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలకు చిక్కులు తప్పని పరిస్థితి ఏర్పడింది.  తాజాగా ఇప్పుడు ఈ కేసు విచారణ తుది దశకకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి,   వెంకయ్య చౌదరి సాక్ష్యం, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది.  ఏ  ఆధారాలు లేకుండా అత్యున్నత ధార్మిక సంస్థపై, అప్పటి  సీఎంపై దుష్ప్రచారం చేసి భక్తుల నమ్మకాలను అపహాస్యం చేసినందుకు గానూ రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిలకు ఆ ఫలితం ఇప్పుడు అనుభవించక తప్పని పరిస్థితి ఎదురైందనీ, టీటీడీ పరువునష్టం దావాలో రమణదీక్షితులు, విజయసాయిలు చిక్కులు ఎదుర్కొనక తప్పదనీ, నాడు నిరాధార ఆరోపణలు చేసినందుకు   శిక్ష అనుభవించడమో, భారీ పరిహారం చెల్లించాల్సి రావడమో తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. 

Pink Diamond Controversy, Ramana Deekshithulu, Vijayasai Reddy, TTD Missing Jewels, Tirumala Venkateswara Temple

By
en-us Political News

  
నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి, తన తీర్పును ఈనెల 27కి రిజర్వ్ చేశారు.
ఢిల్లీలో ముగిసిన సీజేపీ రెండో విడత చర్చలు..!
ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణ మార్గంలో పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో సరికొత్త విప్లవం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
అసలు ఈ అంశంపై సుప్రీం కోర్టులో రిట్ పిటీషనే దాఖలు కాలేదని పేర్కొన్న ఆయన దాఖలు కాని పిటిషన్ ను విచారణకు స్వీకరించకుండా నిరాకరించడమేంటని నిలదీశారు. మీడియా అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించిందంటూ ఫైర్ అయ్యారు.
కొత్త చట్టం తెస్తున్న కేంద్ర ప్రభుత్వం..వచ్చే వారమే పార్లమెంట్‌లో బిల్లు..!
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఉదంతంపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది.
కేటీఆర్ జన్మదిన వేడుకలలో శుక్రవారం (జులై 24నపాల్గొన్న ఆయన తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారం, వదంతులు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు.
ద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.