వంద డాలర్లకు చేరువైన బ్యారల్ ముడి చమురు ధర.. చమురు మంటలు ఆగేదెన్నడు?
Publish Date:Jul 23, 2026
Advertisement
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ముడి చమురు ధరలకు మంట పెట్టాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర రవాణా మార్గాల్లో అనిశ్చితి కొనసాగుతుండటం, చమురు ట్యాంకర్లపై దాడులు కారణంగా ముడి చమురు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అమెరికా ఇరాన్‌పై వరుసగా 13 రోజు కూడా వైమానిక దాడులకు పాల్పడింది. హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది. ప్రపంచ సముద్ర రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి నియంత్రణపై అమెరికా, ఇరాన్ ముఖాముఖి సైనిక ఘర్షణలకు తోడు మరో కీలకమైన సముద్ర మార్గమైన బాబ్ ఎల్-మండేబ్ సమీపంలో హౌతీలువిరుచుకుపడుతుండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఆర్థిక సంక్షోభం తప్పదని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను వెంటనే ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హౌతీలను ఇరాన్ ప్రాక్సీ గ్రూప్‌గా అభివర్ణించిన ఆయన.. హౌతీల విధ్వంసక చర్యలకు ఇరాన్‌నే బాధ్యులను చేస్తామని కుండబద్దలు కొట్టారు. దాడుల్లో దెబ్బతిన్న నౌకలకు, నష్టపోయిన సరుకులకు పరిహారంగా అమెరికా వద్ద నిలిచిపోయిన ఇరాన్ సీజ్డ్ నిధులను ఉపయోగిస్తామని ప్రకటించారు. అదలా ఉంటే.. ఈ వివాదాన్ని తక్షణమే శాంతియుతంగా, దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే అత్యవసర శాంతి చర్చల ప్రయత్నాల కోసం ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ టెహ్రాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. Strait of Hormuz tensions, Crude oil price near 100, US Iran conflict, Bab el Mandeb attack
http://www.teluguone.com/news/content/crude-oil-prices-raise-again-36-226927.html





