ప్రత్యేక రాష్ట్ర నినాదంతో కదం తొక్కిన ఐదు రాష్ట్రాల గిరిజనం.!
Publish Date:Jul 18, 2026
Advertisement
పశ్చిమ, మధ్య భారతదేశంలోని గిరిజనులు ప్రత్యేక రాష్ట్ర నినాదంతో మరోసారి ఉద్యమ బాట పట్టారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ప్రత్యేకంగా భీల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో లక్షల మంది గిరిజనులు గర్జించారు. రాజస్థాన్ బాన్స్‌వాడా జిల్లాలోని చారిత్రక మాన్‌గఢ్ ధామ్ వేదికగా గిరిజన సంఘాలు భారీ ఎ బహిరంగ సభ నిర్వహించాయి. సరిహద్దు ప్రాంతాలకు చెందిన గిరిజనులను ఒకే తాటిపైకి తెచ్చి, తమ చిరకాల స్వప్నమైన భీల్ ప్రదేశ్ ను సాకారం చేసుకోవాలన్న లక్ష్యంతో ఈ సభ జరిగింది. భీల్ ప్రదేశ్ ముక్తి మోర్చా అనే సంస్థ నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమానికి దేశంలోని ఐదు కీలక రాష్ట్రాల నుండి గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీకి చెందిన ఆదివాసీలు ఈ సభలో పాల్గొన్నారు. ఈ ప్రాంతాల్లోని గిరిజన జిల్లాలను, సరిహద్దు గ్రామాలను అన్నింటినీ ఒకే చోటికి చేర్చి, ఒక సమగ్రమైన గిరిజన రాష్ట్రంగా మార్చాలని సభలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. ఇది ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమో కాకుండా, కేవలం ఆదివాసీ సమాజ ప్రయోజనాల కోసం జరిగిందని వక్తలు స్పష్టం చేశారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న బాన్స్‌వాడా-డుంగర్‌పూర్ ఎంపీ రాజ్‌కుమార్ రోత్ గిరిజనుల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మద్దతును ప్రకటించారు. స్విట్జర్లాండ్ నుండి ఫోన్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించిన రాజ్ కుమార్ రోత్.. . దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా.. గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగానే లిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సరిహద్దు గిరిజన ప్రాంతాలను పూర్తిగా విస్మరించాయని, పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాంతాల్లో మౌలిక వసతులు కూడా కరువయ్యాయని విమర్శించారు. ఇక సభలో వక్తలు.. గిరిజన సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. దేశంలో భౌగోళికంగా గిరిజన జనాభా వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో ముక్కలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణం వల్ల గిరిజనులు అన్ని రంగాల్లో తీవ్రమైన నష్టాలను చవిచూస్తున్నారనీ, విద్య, వైద్యం, ఉపాధి వంటి కనీస అవసరాలు కూడా సరిహద్దుల్లో ఉండే నిరుపేద ఆదివాసీలకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం కాదని, తమ ఉనికిని కాపాడుకునే చారిత్రక ఉద్యమమని వారు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజన సమాజానికి చట్టబద్ధంగా కల్పించిన రిజర్వేషన్ల ఫలాలు కూడా క్షేత్రస్థాయిలో ఉన్న యువతకు చేరడం లేదని సభలో వక్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభించకపోవడం వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని ఆవేదన చెందారు. Bhil Pradesh Demand, Mangarh Dham Tribal Protest, Bharat Adivasi Party, Rajkumar Roat MPa
http://www.teluguone.com/news/content/tribals-from-five-states-demand--separate-state-36-226348.html





