సలాల్ డ్యామ్, బాగ్లిహార్ ప్రాజెక్టుల పూడిక తీత.. పాక్ కు చుక్కలే.!

Publish Date:Jul 18, 2026

Advertisement

భారత్, పాకిస్తాన్  మధ్య జల వనరుల పంపిణీకి సంబంధించిన వివాదాలు మరోసారి ముదిరిపాకాన పడ్డాయి. జమ్మూ కశ్మీర్ పరిధిలోని కీలకమైన రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులలో భారీ ఎత్తున పూడికతీత ( పనులను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. చినాబ్ నదిపై నిర్మించిన సలాల్, బాగ్లిహార్ డ్యామ్‌లలో పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఉగ్రవాద చర్యలను అణచివేయని పక్షంలో చర్చలు ఉండబోవని ఇప్పటికే స్పష్టం చేసిన భారత్..  ఇప్పుడు ఏకపక్షంగా తన సొంత భూభాగంలోని డ్యామ్‌ల పునరుద్ధరణపై దృష్టి సారించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 16న మొదలైన పూడిక తీత పనులు ఈ నెల  26 వరకు సాగనున్నాయి.

రియాసి జిల్లా పరిధిలోకి వచ్చే సలాల్ డ్యామ్, అలాగే రాంబన్ జిల్లాలో ఉన్న బాగ్లిహార్ ప్రాజెక్టులు  విద్యుదుత్పత్తిపరంగా  కీలకమైనవి. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ జలాశయాలలో టన్నుల కొద్దీ పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గింది. . ఇది  విద్యుత్ ఉత్పాదనపై  ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి పూడికతీత పనులు చేపట్టింది.   1970 నుండి ఈ డ్యామ్‌లలో ఎప్పుడూ సరైన రీతిలో పూడికతీత పనులు జరగలేదు. గతంలో భారత్ ఇటువంటి ప్రయత్నాలు చేయాలని భావించిన ప్రతిసారీ పాకిస్తాన్ అంతర్జాతీయ నియమాలను అడ్డం పెట్టుకుని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో దౌత్యపరమైన ఒడంబడికల కారణంగా స్లూయిస్ గేట్లను మూసివేయాల్సి వచ్చింది. అప్పట్లో విదేశాంగ మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ..  పాక్ ఒత్తిడికి తలొగ్గి డ్యామ్ ఎత్తును 10 మీటర్ల మేర తగ్గించారు. దీనివల్ల భారత్ నష్టపోగా, పాకిస్తాన్ లబ్ధి పొందుతూ వచ్చింది.

ప్రస్తుతం 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం  క్రితం కుదిరిన ఈ  ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది. చినాబ్   నీటిపై పాకిస్తాన్‌కు హక్కులు ఉన్నప్పటికీ, తన అంతర్గత పరిధిలో మౌలిక వసతుల నిర్వహణ చేసుకునే హక్కు భారత్‌కు ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. 

దీంతో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది. డ్యామ్‌ల నుండి తొలగించే బురద, వ్యర్థాలు నదీ ప్రవాహం ద్వారా దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించి పాక్ భూభాగంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అక్కడ ఉన్న ప్రధాన కాలువలు, హెడ్‌వర్క్స్ వ్యవస్థలు  పూడికతో నిండిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే సమయంలో ఎగువన భారీ వర్షాలు కురిస్తే పాక్‌లో వరద ముప్పుతో పాటు మౌలిక వసతులు ధ్వంసమవుతాయి.  

మరోవైపు, పూడికతీత ప్రక్రియ పూర్తయిన తర్వాత సలాల్, బాగ్లిహార్ ప్రాజెక్టులలో నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం భారీగా పెరుగుతుంది. దీనివల్ల దిగువన ఉన్న పాకిస్తాన్‌కు సహజంగానే విడుదలయ్యే నీటి పరిమాణం తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో, నీటి సమస్యతో సతమతమౌతున్న పాకిస్థాన్కు ఇది కోలుకోలేని దెబ్బగా మారుతుంది.    

Indus Waters Treaty, Salal Dam Desilting, Baglihar Project Chenab River, India Pakistan Water Dispute,

By
en-us Political News

  
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.