బ్రిట‌న్ ప్ర‌ధానిగా ట్ర‌స్‌.. రిషికి చేజారిన అవ‌కాశం

Publish Date:Sep 6, 2022

Advertisement

బ్రిట‌న్ ప్ర‌ధాని పోటీలో హోరాహోరీ పోరాడిన భార‌త్ సంత‌తికి చెందిన రిషి సునాక్ ను వెన‌క్కి నెట్టి లిజ్ ట్ర‌స్ గెలిచింది. తొలుత కన్జర్వేటివ్‌ పార్టీ టోరీ ఎంపీల మద్దతు సునాక్‌కే ఉన్నా.. క్రమంగా ట్రస్‌ పైచేయి సాధించారు. 1.72 లక్షల మంది టోరీ సభ్యులు ఆన్‌లైన్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కన్జర్వేటివ్‌ నేత ఎన్నికలో ఓట్లు వేయగా.. వాటిల్లో 654 చెల్లుబాటు కాలేదు.

మిగతా వాటిల్లో ట్రస్‌కు 81,136.. సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. భారత కాలమానం ప్రకారం సోమ వారం(ఆగ‌ష్టు 5)సాయంత్రం 5 గంటలకు టోరీ 1922 కమిటీ చైర్మన్‌ సర్‌ గ్రాహం బ్రాడీ ఎన్నికల ఫలి తాలను విడుదల చేస్తూ..లిజ్‌ ట్రస్‌ను విజేతగా ప్రకటించారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేత ప్రధానిగా బాధ్యత లు చేపట్టడం ఆనవాయితీ. మార్గరేట్‌ థాచర్‌, థెరిసా మే తర్వాత.. బ్రిటన్‌ ప్రధాని పదవిని చేజిక్కిం చుకున్న మూడో మహిళగా ట్రస్‌ రికార్డు సృష్టించనున్నారు. సోమవారం సాయంత్రమే ఆమె కేబినెట్‌ కూర్పుపై కసరత్తు ప్రారంభించారు. అయితే.. ట్రస్‌ మంత్రివర్గంలో రుషి సునాక్‌కు చోటు అనుమాన మేనని తెలుస్తోంది. 

మంగళవారం బోరిస్‌ జాన్సన్‌కు వీడ్కోలు సమావేశం జరగనుంది. ఆ వెంటనే ట్రస్‌ స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2ను కలుస్తారు. అక్కడే బ్రిటన్‌ రాణి ఆమెను ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులిస్తారు. నిజానికి బ్రిటన్‌ వెలుపల ప్రధాని నియామకం జరగడం ఇదే మొదటిసారి. బ్రిటన్‌ రాణి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈ కార్యక్రమాన్ని స్కాట్లాండ్‌లో ఏర్పాటు చేశారు. బుధవారం ఆమె కేబినెట్‌ను ప్రకటించవ‌చ్చు. ఆ తర్వాత బ్రిటన్‌ దిగువసభ-- హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ప్రధాని హోదాలో తొలి ప్రసంగం చేయనున్నారు.

రిషి సునాక్‌ ముందు నుంచి ప్రధాని రేసులో ముందంజలో ఉన్నారు. ఆయ‌న గెల‌వ‌డానికి ఆస్కారం ఉంద‌ని ప్ర‌చార‌మూ జ‌రిగింది. ఇటు భార‌తీయులు ఎంతో సంతోషించారు. కానీ ఊహించ‌నివిధంగా బోరిస్‌ జాన్సన్‌ ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం, ట్రస్‌కు మద్దతివ్వడం ప్రతికూలంగా మారాయి. ట్రస్  కూడా తన ప్రచారంలో రిషి తీసుకువచ్చిన పన్నులనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఆర్థిక మాంద్యం దిశలో బ్రిటన్‌ అడుగులు వేస్తున్న తరుణంలో రిషి సునాక్‌ ఆదాయ, ఇతర పన్నులను పెంచారు. రిషి పెంచిన పన్నులను తగ్గించడమే నా ప్రధాన లక్ష్యమంటూ ట్రస్‌ చేసిన ప్రచారం టోరీ సభ్యులను ఆకట్టు కుంది. అంతే కాదు ట్ర‌స్  ప్రచారాన్ని ప్రారంభించినప్పటి నుంచి మార్గరేట్‌ థాచర్‌ మాదిరిగా ఆహార్యం, నడవడికను మార్చుకుని అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నారు. 

బ్రిటన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న లిజ్‌ ట్రస్‌ను భారత ప్రధాని మోదీ అభినందించారు. ఇరు దేశాల మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ మరింత బలపడేలా ఆమె కృషిచేస్తారని ఆకాంక్షిం చారు. ట్రస్‌లిజ్‌.. అభినందనలు. భారత్‌-బ్రిటన్‌ బంధాన్ని మీరు మరింత బలోపేతం చేయాలని కోరుకుంటు న్నామ‌ని ట్వీట్‌ చేశారు. 

By
en-us Political News

  
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.