కమలం గూటికి కొండా: కేటీఆర్ కు క్షమాపణ అందుకేనా.?

Publish Date:Oct 29, 2026

Advertisement

మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 

అప్పట్లో  రాజకీయ పరిణామాలు, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే   వాతావరణంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్న కొండా సురేఖ  కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కించపరచాలనే ఉద్దేశం గానీ, ఆయన కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయాలని కానీ తాను ఎన్నడూ భావించలేదని వివరణ ఇచ్చారు.   ఆ వ్యాఖ్యల వల్ల కేటీఆర్ కు కలిగిన మనస్తాపానికి చింతిస్తున్నాని పేర్కొన్న ఆమె  ఈ వివాదానికి పూర్తిగా ముగింపు పలకాలనే సదుద్దేశంతోనే  క్షమాపణలు చెబుతూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

కాగా కొండా సురేఖను రేవంత్ తన కేబినెట్ నుంచి తొలగించిన తరువాత ఇప్పుడు కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  సరైన కారణాలు వెల్లడించకుండా, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి తొలగించడాన్ని ఆమె అప్పట్లోనే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.  బీసీ మహిళగా తనకు జరుగుతున్న అన్యాయంపై ఆమె బహిరంగంగానే  నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కొండా సురేఖ కేటీఆర్ కు క్షమాపణ చెప్పడం, ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం పొలిటికల్ గా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె బీఆర్ఎస్ గూటికి చేరడానికి రెడీ అయ్యారన్న చర్చ జోరందుకుంది. ఈ చర్చకు కొండా సురేఖ భర్త కొండా మురళితో కలిసి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.   


[Konda Surekha Apologizes to KTR, Telangana Politics, Konda Surekha Murali, BRS Reentry Rumors, Telugu One]

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.