మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై ఉదయ్ కృష్ణారెడ్డి దాడి చేసినట్లు నిర్ధారణ..!

Publish Date:Jul 28, 2026

Advertisement

 

తాజాగా బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు..!

పోలీసుల అదుపులో ఉదయ్ కృష్ణారెడ్డి..!

ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై ఉదయ్ కృష్ణారెడ్డి దాడి చేసినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు సమాచారం. కేసు నమోదైన రోజైన జూలై 18న బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు తమ నివేదికలో కీలక అంశాలను వెల్లడించారు. బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు, చెంపపై దెబ్బల వల్ల కమిలిన గాయాలు, అలాగే ఎడమ కాలిపై గాయం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. ట్రైనీ ఐపీఎస్ అధికారి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మిర్యాలగూడ సమీపంలో మంగళవారం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నగర పోలీస్ కమీషనర్, ఈ కేసు విచారణ బాధ్యతలను పోలీసు శాఖలోని ప్రత్యేక 'ఉమెన్స్ సేఫ్టీ వింగ్' కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ కేసుపై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ స్పందిస్తూ.. చట్ట నిబంధనల ప్రకారమే సమగ్ర విచారణ జరుపుతామని వెల్లడించారు. ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్లు, సేకరించిన ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు, తనపై వస్తున్న ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా ఖండించారు. తన నానమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతోనే స్వగ్రామానికి వెళ్లానని, తాను పరారీలో లేనని తెలిపారు. 

న్యాయవ్యవస్థపై, పోలీస్ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.గ్రామీణ నేపథ్యం ఉన్న తనకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని, విచారణకు సంపూర్ణంగా సహకరిస్తానని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు .పోలీస్ శిక్షణ పొందుతున్న ఉన్నతాధికారుల స్థాయిలోనే ఇలాంటి ఆరోపణలు రావడంతో ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాధితురాలికి న్యాయం జరిగేలా ఉమెన్స్ సేఫ్టీ వింగ్ బృందం త్వరలోనే విచారణ పూర్తిచేసి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Trainee IPS Uday Krishna Reddy, SIT,  harassment case, Attapur Police, oollapalem villeage, DCP Lavanya, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand

By
en-us Political News

  
మీ పుస్తకాల అభిరుచికి సరిపోయే సరైన నవలల కోసం వెతుకుతున్నారా? నా లైబ్రరీలోని పుస్తకాలతో ఛాట్‌జీపీటీ చేసిన అద్భుత ప్రయోగం, 30 నిమిషాల్లో అది అందించిన పర్సనలైజ్డ్ బుక్ రికమండేషన్ల రహస్యాలు ఇక్కడ చదవండి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం బంగారం ధరలు త్వరలోనే దిగివచ్చే అవకాశం ఉంది. పసిడి మార్కెట్ పరిస్థితులు, తగ్గుదలకు గల కారణాలు మరియు తాజా ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కాలిఫోర్నియాలోని 330 MW డేటా సెంటర్ కూలింగ్ కోసం 287 మిలియన్ గాలన్ల వ్యవసాయ నీటిని మళ్లించే ప్రయత్నాన్ని వాటర్ డిస్ట్రిక్ట్ అడ్డుకుంది. $10 బిలియన్ల ప్రాజెక్ట్ చుట్టూ రేగిన చట్టపరమైన పోరాటం మరియు రైతు ఆందోళనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ డైట్ అడిగి తెలుసుకుని, ఏడాదిన్నర పాటు పాటించిన సంజూ శాంసన్ ఆ తర్వాత ఎందుకు గివ్ అప్ ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
లార్డ్స్ మైదానంలో మూడో వన్డే తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి సంతకంతో కూడిన జెర్సీని ఎలా సాధించాడో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వెల్లడించారు. రోహిత్ వినయం, ప్రత్యేక సందేశంతో ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన పూర్తి కథనం చదవండి.
టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ బిగ్ యాక్షన్ తీసుకుంది. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌ల కాంట్రాక్టులను రీన్యూ చేయకపోవడానికి గల కారణాలు, కొత్త ఫీల్డింగ్ కోచ్ రేసులో ఉన్న వివరాలు తెలుసుకోండి.
అమెరికాలో 7 ఏళ్లు పూర్తి చేసుకున్న విదేశీయులకు నేరుగా గ్రీన్ కార్డు మంజూరు చేసేలా డెమొక్రాట్లు కీలక బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసాదారులు, భారతీయులకు ఈ నిర్ణయం ఎలాంటి ఉపశమనం కలిగిస్తుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జేఫరీస్ తాజా నివేదిక ప్రకారం భారతీయ ఫిన్‌టెక్ రంగం ₹1.03 ట్రిలియన్ల ఆదాయంతో తొలిసారిగా లాభాల యుగంలోకి ప్రవేశించింది. వెల్త్‌టెక్ మరియు పేమెంట్స్ రంగాలు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం వెనుక ఉన్న అసలు వివరాలు తెలుసుకోండి!
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని....అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
సోమేశ్ కుమార్‌పై 400 కంటెంప్ట్ కేసులప్పుడు బీఆర్‌ఎస్ మౌనం ఎందుకు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.