400 కంటెంప్ట్ కేసులప్పుడు మౌనం.. ఇప్పుడు హైడ్రాపై విమర్శలా..? : సీఎం రేవంత్

Publish Date:Jul 28, 2026

Advertisement

 

సోమేశ్ కుమార్‌పై 400 కంటెంప్ట్ కేసులప్పుడు బీఆర్‌ఎస్ మౌనం ఎందుకు..!

ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్కులను కబ్జా చేసుకున్న వారు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే, గతంలో సోమేశ్ కుమార్‌పై 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణాధికారమని, ఆ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరని సీఎం స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. హైడ్రా మంచి పనులు చేస్తోందని, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణల్లో హైడ్రా ఒకటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా అత్యుత్తమ సంస్థల్లో ఒకటని, ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే దాని బాధ్యత అని, ఆ పనిని హైడ్రా పకడ్బందీగా నిర్వహిస్తోందని చెప్పారు.

బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని, దానిపై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేశారని సీఎం విమర్శించారు. ఆ కుంట పేరు బతుకమ్మ కుంట అని, దానిపై కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాలను ఎలా చూడాలని ఆయన ప్రశ్నించారు. హైడ్రా పనిచేయకుండా అడ్డుకోవాలని చూస్తున్న కబ్జాదారులకు సహకరించవద్దని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు."హైడ్రా ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టింది.. అది పేదోళ్లదా? గండిపేట చెరువులో ఆక్రమణలను తొలగించింది.. అవి పేదోళ్లవా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్లు పేదోళ్లా?" అని సీఎం ప్రశ్నించారు.

కబ్జాదారులను కాపాడేందుకు డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైడ్రా కార్యకలాపాలపై, అది నిర్వహిస్తున్న బాధ్యతలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందని సీఎం తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదని, ప్రభుత్వ పరంగా సమీక్షిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాలను గౌరవిస్తామని, అదే సమయంలో హైడ్రా కొనసాగిస్తున్న పనులను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


CM Revanth Reddy, Somesh Kumar, 400 Contempt of Court cases, Contempt of Court, HYDRA, 
HYDRA criticism, HYDRA operations, BRS Party ,KTR, KCR
 

By
en-us Political News

  
మీ పుస్తకాల అభిరుచికి సరిపోయే సరైన నవలల కోసం వెతుకుతున్నారా? నా లైబ్రరీలోని పుస్తకాలతో ఛాట్‌జీపీటీ చేసిన అద్భుత ప్రయోగం, 30 నిమిషాల్లో అది అందించిన పర్సనలైజ్డ్ బుక్ రికమండేషన్ల రహస్యాలు ఇక్కడ చదవండి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం బంగారం ధరలు త్వరలోనే దిగివచ్చే అవకాశం ఉంది. పసిడి మార్కెట్ పరిస్థితులు, తగ్గుదలకు గల కారణాలు మరియు తాజా ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కాలిఫోర్నియాలోని 330 MW డేటా సెంటర్ కూలింగ్ కోసం 287 మిలియన్ గాలన్ల వ్యవసాయ నీటిని మళ్లించే ప్రయత్నాన్ని వాటర్ డిస్ట్రిక్ట్ అడ్డుకుంది. $10 బిలియన్ల ప్రాజెక్ట్ చుట్టూ రేగిన చట్టపరమైన పోరాటం మరియు రైతు ఆందోళనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ డైట్ అడిగి తెలుసుకుని, ఏడాదిన్నర పాటు పాటించిన సంజూ శాంసన్ ఆ తర్వాత ఎందుకు గివ్ అప్ ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
లార్డ్స్ మైదానంలో మూడో వన్డే తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి సంతకంతో కూడిన జెర్సీని ఎలా సాధించాడో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వెల్లడించారు. రోహిత్ వినయం, ప్రత్యేక సందేశంతో ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన పూర్తి కథనం చదవండి.
టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ బిగ్ యాక్షన్ తీసుకుంది. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌ల కాంట్రాక్టులను రీన్యూ చేయకపోవడానికి గల కారణాలు, కొత్త ఫీల్డింగ్ కోచ్ రేసులో ఉన్న వివరాలు తెలుసుకోండి.
అమెరికాలో 7 ఏళ్లు పూర్తి చేసుకున్న విదేశీయులకు నేరుగా గ్రీన్ కార్డు మంజూరు చేసేలా డెమొక్రాట్లు కీలక బిల్లును ప్రవేశపెట్టారు. హెచ్-1బీ వీసాదారులు, భారతీయులకు ఈ నిర్ణయం ఎలాంటి ఉపశమనం కలిగిస్తుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జేఫరీస్ తాజా నివేదిక ప్రకారం భారతీయ ఫిన్‌టెక్ రంగం ₹1.03 ట్రిలియన్ల ఆదాయంతో తొలిసారిగా లాభాల యుగంలోకి ప్రవేశించింది. వెల్త్‌టెక్ మరియు పేమెంట్స్ రంగాలు సాధించిన ఈ చారిత్రాత్మక విజయం వెనుక ఉన్న అసలు వివరాలు తెలుసుకోండి!
తాజాగా బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు..!
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి.
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని....అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.