హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసినా.. కేసుకు సంబంధించిన పలు కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానాలు ఇవ్వలేదని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయనను మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని అత్తాపూర్ పోలీసులు నిర్ణయించారు. కస్టడీలో భాగంగా పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణా రెడ్డి సమాధానం చెప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. ముఖ్యంగా కేసులో కీలకంగా మారిన ఐఫోన్ ఆచూకీ, కత్తి, మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో పరిచయం తదితర అంశాలపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అయితే విచారణలో ఆశించిన స్థాయిలో సమాచారం రాకపోవడం తో.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై రేపు ఉప్పరపల్లి కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు నిర్ణయం అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి పోలీసుల కస్టడీకి అప్పగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల పోలీస్ కస్టడీ పూర్తయిన అనంతరం ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన సమయంలో ఆయన సైబరాబాద్ సీపీ సజ్జనార్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాతపూర్వక ఫిర్యాదు అందించినట్లు తెలుస్తోంది.
Trainee IPS Uday Krishna Reddy, CP Sajjanar Encounter Threats, Upparapally Court Show Cause Notice, SVPNPA Trainee IPS Controversy, Telangana Police Legal News
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trainee-ips-uday-krishna-reddy-36-228335.html
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు
నోరు పారేసుకుంటే ఇళ్లకు వచ్చి కొడతాం....!
నెలకు రూ.1.5 లక్షల జీతం అని చెప్పి.. బీర్ షాప్ ఓనర్‌కు అమ్మేశారు..!
అదుపుతప్పి బోల్తా పడిన 100 అడుగుల లోయలో పడ్డ ప్రైవేటు బస్సు..!
నర్సంపేట మాజీ శాసనసభ్యులు, దివంగత నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండంత అండగా నిలిచారు.
అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్) ఈ ఐకానిక్ సిగ్నేచర్ బ్రిడ్జికి సంబంధించిన ఫీజిబిలిటీ, డీపీఆర్, కన్సల్టెన్సీ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టింది.
ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు, నియామక ప్రక్రియకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్న ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.
క్యాన్సర్ మందుల విపరీతమైన ధరలపై కేంద్ర ప్రభుత్వ వివరణను పార్లమెంటరీ స్థాయి సంఘం తోసిపుచ్చింది. ట్రేడ్ మార్జిన్లపై తక్షణమే పరిమితులు విధించి, ప్రాణరక్షణ ఔషధాల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల షాట్‌పుట్ F57 విభాగంలో 9.81 మీటర్ల త్రోతో పసిడి పతకం గెలిచి చరిత్ర సృష్టించిన పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ స్ఫూర్తిదాయక జీవిత కథ మరియు పోరాట విశేషాలు.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు! హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా ప్రధాన నగరాల్లో నేటి 18, 22, 24 క్యారెట్ల తులం పసిడి రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పిరమల్ ఫైనాన్స్ మరియు బైన్ క్యాపిటల్ మద్దతుగల ఇండియాఆర్‌ఎఫ్, బెలగావికి చెందిన అశోక్ ఐరన్ వర్క్స్ యూనిట్ ఫైన్ ఎడ్జ్ ఇంజనీరింగ్ లో దాదాపు ₹2,000 కోట్లతో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ బిగ్ డీల్ విశేషాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలను ఇక్కడ తెలుసుకోండి!
అమెరికా సెనెట్‌లో ఇటీవల జరిగిన ఓటింగ్ లో శాంశనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుపై చర్చ జరిగింది. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో ఈ బిల్లు 86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనెట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుఈ నెల 31న అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. లోయర్ హౌస్‌లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది.