విదేశీ నిధుల అక్రమ దందాకు.. FCRA సవరణ బిల్లుతో ముగింపు పడేనా..?

Publish Date:Aug 7, 2026

Advertisement

 

దేవాలయాల సాక్షిగా, అమాయక ప్రజల ఆవేదన నడుమ ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న ఓ నిశ్శబ్ద పోరాటం ఇది. దాతృత్వం పేరిట విదేశాల నుంచి కుండపోతగా వచ్చిపడుతున్న వేల కోట్ల రూపాయలు నిజంగా పేదల కడుపు నింపుతున్నాయా? లేక దేశ అంతర్గత భద్రతను, పల్లెల్లోని ప్రశాంతతను చిన్నభిన్నం చేస్తున్నాయా? ఈ ప్రశ్న ప్రతి సగటు భారతీయుడి గుండెను తొలిచేస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణల దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న వేళ, అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది. ఈ అంశాలపై  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు

మన దేశంలో పురాతన కాలం నుంచి దానధర్మాలు, దాతృత్వానికి కొదవలేదు. అయితే ఈ ఆత్మీయతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విదేశీ నిధుల పేరుతో వికృత క్రీడ సాగుతోందన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. విదేశాల నుంచి స్వచ్ఛంద సంస్థల (NGOs) ఖాతాల్లోకి ప్రతిఏటా దాదాపు రూ. 23,000 కోట్ల భారీ నిధులు వచ్చి చేరుతున్నాయి. నిజానికి ఈ డబ్బుతో పేద పిల్లలకు ఉచిత విద్య, అనారోగ్యంతో బాధపడేవారికి మెరుగైన వైద్యం, పల్లెల్లో తాగునీటి సదుపాయాలు అందితే ఏ సమస్యా ఉండేది కాదు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. 

రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆకలితో అల్లాడుతున్న నిరుపేదల బలహీనతలే పెట్టుబడిగా మారుతున్నాయి. ఊళ్లలో విదేశీ సొమ్ముతో నడుస్తున్న కొన్ని ముసుగు సంస్థలు.. ప్రలోభాలకు తెరలేపుతున్నాయి. మాతృ సంస్కృతికి, పుట్టిన గడ్డకు ప్రజలను దూరం చేస్తూ, మత మార్పిడులు, శాంతిభద్రతల విచ్ఛిన్నానికి ఈ సొమ్ము దుర్వినియోగమవుతోందన్న ఆవేదన గ్రామీణుల్లో వెల్లువెత్తుతోంది. తమ కష్టాలను తీరుస్తారని నమ్మి వెళితే, తమ అస్తిత్వాన్నే బలికోరుతున్నారంటూ పలువురు బాధితులు విలపిస్తున్నారు.

నిధుల దారి మళ్లింపు.. దేశ సమగ్రతకే ముప్పుకేవలం సామాజిక మార్పులకే కాదు, విదేశీ ధనం తీవ్రవాద కార్యకలాపాలకు, దేశ విచ్ఛిన్నకర శక్తులకు, చివరకు పొలిటికల్, రియల్ ఎస్టేట్ కరప్షన్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి సాధనంగా మారిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. సుమారు 16,200కు పైగా రిజిస్టర్డ్ సంస్థలకు విదేశీ నిధులు వస్తున్నప్పటికీ, అందులో అత్యధిక శాతం సంస్థలు పైసా పైసాకు తగిన లెక్కలు (అకౌంటబిలిటీ) చూపడంలో విఫలమవుతున్నాయి. ఎక్కడి నుంచి డబ్బు వస్తోంది? ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి.

చట్టం కఠినతరం కాకపోతే సామాన్యుడికి దక్కేదేంటి?విదేశీ నిధుల వినియోగాన్ని విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పర్యావరణం, సంస్కృతి, సహాయక చర్యలు, విశ్వాస ఆధారిత సంక్షేమం, శాస్త్రీయ పరిశోధనలు అనే స్పష్టమైన 9 విభాగాలకే పరిమితం చేస్తూ కేంద్రం తీసుకొస్తున్న కఠిన నిబంధనలు అత్యంత కీలకమైనవి. ఏటికేడు నిధుల లెక్కలు అడిగి, దుర్వినియోగానికి పాల్పడే వారిపై దేశద్రోహం కింద కేసులు నమోదు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 

ఏటా వచ్చే వేల కోట్ల రూపాయలు సరైన మార్గంలో ఖర్చు కాకపోతే, నిజంగా సాయం కోసం ఎదురుచూసే అనాథలు, రోగులు, నిరుపేద విద్యార్థులు శాశ్వతంగా అన్యాయానికి గురవుతారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంతో పాటు, అమాయకుల భవిష్యత్తును విదేశీ కుట్రల బారిన పడకుండా కాపాడుకోవడానికి ప్రతి పౌరుడూ ఈ నిధుల పారదర్శకతపై గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

 

 

 FCRA Amendment Bill 2026, Foreign Contribution Act Telugu, NGO Foreign Funds India, PM Modi FCRA Bill, Foreign Donations Regulation Telugu. NGO Accounts Home Ministry, PM MODI, Amit shah

By
en-us Political News

  
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
2015లోనే అప్పటి పాక్ జలవనరులు, విద్యుత్ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జాతీయ స్థాయిలో నీరు, గ్యాస్, విద్యుత్ విచ్చలవిడిగా దుబారా చేసే అలవాటు వల్లే దేశంలో తీవ్ర కొరత ఏర్పడిందని బాహాటంగా చెప్పారు. నీటి సమస్యలు పూర్తిగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని, దానికి బయటి దేశాలను బాధ్యులను చేయలేమని అన్నారు. నాటి మంత్రి వ్యాఖ్యలకు, నేటి పాక్ పాలకులు భారత్‌పై చేస్తున్న ఆరోపణలకు పొంతనే లేకపోవడం గమనార్హం.
ఒంటరిగా ఫీలవుతున్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకు వెళ్లేందుకు అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో!
మరొకవైపు, రెండు ప్రధాన టన్నెళ్ల పరిధిలో చేపడుతున్న కాంక్రీట్ సీసీ లైనింగ్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదు గ్యాంట్రీ యంత్రాల....
సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ చెల్లింపులపై ఇటీవల నెట్టింట ఊపందుకున్న ఛార్జీల ప్రచారానికి ప్రముఖ డిజిటల్ వ్యాపార దిగ్గజం ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ తెరదించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.