రష్యా చమురు కొనుగోలుపై భారత్‌కు బిగ్ షాక్

Publish Date:Aug 8, 2026

Advertisement

అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని, ముఖ్యంగా భారత్-అమెరికా దౌత్య సంబంధాలను ప్రభావితం చేసేలా   రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై  వంద శాతం టారిఫ్ లు విధించడానికి అమెరికా సెనెట్ ఆమోదముద్ర వేసింది.  ఉక్రెయిన్‌తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఆ చర్య తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనా వంటి దేశాలకు అమెరికా నిర్ణయం నిస్పందేహంగా షాకే.  అమెరికా నిర్ణయం  ప్రపంచ ఇంధన మార్కెట్‌తో పాటు భారత్‌  వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. 

అమెరికా సెనెట్‌లో ఇటీవల జరిగిన ఓటింగ్ లో   శాంశనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026  బిల్లుపై  చర్చ జరిగింది. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో  ఈ బిల్లు  86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.   సెనెట్‌లో  ఆమోదం పొందిన ఈ బిల్లుఈ నెల  31న అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. లోయర్ హౌస్‌లో కూడా ఆ బిల్లు  ఆమోదం పొందితే..  ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో  చట్టంగా మారి అమల్లోకి వస్తుంది.

ఈ ఆంక్షల బిల్లు అమలులోకి వస్తే..  రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై  వంద శాతం సుంకాలు విధించే  అవకాశం ఉంటుంది.   దీని   ప్రభావం భారత్, చైనా, స్లొవేకియా, హంగరీ, అజర్‌బైజాన్ వంటి  దేశాలపై తీవ్రంగా ఉంటుంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే ధ్యేయంగా రష్యా రక్షణ, ఆర్థిక, ఇంధన వ్యవస్థలను ఒంటరి చేయాలనే అమెరికా ప్రణాళికలో భాగంగానే ఈ బిల్లు తీసుకువచ్చినట్లు అమెరికా చెబుతోంది.  అందులో భాగంగానే రష్యా చమురును కొనుగోలు చేస్తూ మాస్కో ఖజానాకు విదేశీ మార్పిడి నిధులను సమకూరుస్తున్న దేశాలపై భారీ టారిఫ్ లకు అమెరికా రెడీ అవుతోంది.    భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్న తరుణంలో ఈ బిల్లు ఆమోదం పొందడం  ప్రాధాన్యత  సంతరించుకుంది. 

US Tariffs on India, Russian Oil Imports, US Senate Russia Sanctions Bill 2026, Donald Trump Tariffs, India US Trade Relations, Sanctioning Russia and Iran Act

By
en-us Political News

  
పశ్చిమ బెంగాల్‌ రాజకీయంలో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించి.. కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. !
ఆషాఢ మాస బోనాల సందర్భంగా లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహం కాళి అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 5న చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన విషాదాం తమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారబోతోంది.
మహారాష్ట్రలోని పూణే జిల్లా, బారామతి ప్రాంతం మరోసారి విమాన ప్రమాదంతో ఉలిక్కిపడింది.
విజయవాడ నగరం వేదికగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
తెలంగాణ సంస్కృతికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ మాస బోనాల పండుగ హైదరాబాద్ నగరం అంతటా అత్యంత కోలాహలంగా, అంగరంగ వైభవంగా సాగుతోంది.
మెడికోపై కారు దాడి కేసు.. అది ప్రమాదం కాదు..!
సెలవుపై స్వగ్రామానికి బయల్దేరిన సైనికుడు..మిస్సింగ్‌పై అనుమానాలు..!
విద్యార్థులకు కళాత్మక తయారీ మరియు ప్రదర్శనలో శిక్షణ నిచ్చే తీరుపై మ్యూజియం నిర్వహుకులతో చర్చించారు.
భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ ఉప్పొంగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.