మంత్రి పొంగులేటికి టీపీసీసీ చీఫ్ వార్నింగ్
Publish Date:Jun 17, 2025

Advertisement
రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన నంబర్ టు అనుకుంటారు.. అన్ని శాఖలు తనవే అనుకుంటారు.. హైదరాబాద్ లో ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో ఉంటారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందా అంటే అదీ లేదు. కాని ఆయన సఖల శాఖలపై ప్రకటనలు చేస్తారు. కేసీఆర్, కేటీఆర్ లపై ఒంటికాలిపై లేస్తారు.. ఆయన ఎవరో మీకు ఈ పాటికే అర్ధం అయిఉంటుంది ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి . సాధారణంగా ప్రభుత్వ వ్యవహారాలు మీడియాకు చెప్పాల్సి వస్తే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, పార్టీకి సంబంధించిన విషయాలైతే పీసీసీ ప్రెసిడెంట్ వివరిస్తారు. కాని ఇక్కడ మాత్రం అన్నీ శీనన్నే అదేనండీ పొంగులేటి శ్రీనివాసరెడ్డే చూసుకుంటున్నారు. గతంలో మూసీ అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం అంటూ మీడియాను వెంటబెట్టుకుని సియోల్ పర్యటనకు వెళ్లారు.. అక్కడికి వెళ్లిన విషయం వదిలేసి మా బృందం రాష్ట్రానికి తిరిగి వచ్చేలోగా రాజకీయంగా పెద్ద బాంబు పేలుతుందని సంచలన ప్రకటన చేశారు. అంటే బీఆర్ఎస్ ముఖ్య నాయకుడిని అరెస్ట్ చేస్తామనే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. కాని ఇప్పటి వరకు అటువంటిది ఏమీ జరగలేదు.
ఇలా అనేక విషయాల్లో తనకు తోచిన రీతిలో ప్రకటనలు చేస్తారు.. ప్రభుత్వ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు కూడా తానే వెల్లడిస్తారు.. స్థానిక సంస్థల ఎన్నికలపై విధానపరమైన నిర్ణయం క్యాబినెట్ లో తీసుకున్నాకే ప్రకటించాల్సి ఉంది.. ఇంత ముఖ్యమైన విషయంపై తాజాగా మీడియాకు వెల్లడించారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఒక క్యాబినెట్ మంత్రికి పీసీసీ ప్రెసిడెంట్ వార్నింగ్ ఇవ్వడం బహుశా ఇటీవల కాలంలో జరిగిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా పొంగులేటి తన వైఖరిని మార్చుకుంటారో లేదో వేచిచూడాల్సిందే…
http://www.teluguone.com/news/content/tpcc-chief-warning-to-minister-ponguleti-srinivasa-reddy-39-200126.html












