LATEST NEWS
  జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలతోతెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్  పలువురు జనసేన నాయకులు సమావేశం అయ్యారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటామని వారు తెలిపారు. జూబ్లీ  బైపోల్‌కు ఇంకా ఆరు రోజులే ఉండటంతో ప్రచారం ఊపు అందుకుంది. కమలం పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగ ప్రచారం చేస్తున్నారు. లంకల దీపక్ రెడ్డి తరపున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి బీజేపీకి ఓటు వేయాలంటూ ఆయన ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ మద్దతు ప్రకటించడంతో కమలం పార్టీలో నూతన జోష్ వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటింది. బీఆర్ఎస్ తరుఫున గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బరిలోకి దిగగా..2025, నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా.. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు ఫలితం వెలువడనుంది. ఎన్నికకు మరో 6 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. 
ఇటీవలే రేవంత్ కేబిరెట్ లో బెర్త్ లభించిన మహ్మద్ అజారుద్దీన్ కు మైనారిటీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు దక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి నుంచీ అజారుద్దీన్ కు హోంశాఖ కేటాయిస్తారంటూ ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆ శాఖ ముఖ్యమంత్రి అధీనంలో ఉండటమే. దీంతో కొంత మేర ఒత్తిడి తొలగించుకునేందుకు ముఖ్యమంత్రి హోంశాఖను అజారుద్దీన్ కు కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణుల నుంచీ, ప్రభుత్వ వర్గాల నుంచీ ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖను తన వద్దే అట్టేపెట్టుకున్నారు. అజారుద్దీన్ కు ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ శాఖలు అప్పగించారు. 
మాట్లాడింది నేనే.. కంటెంట్ నాది కాదు.. పోలీసుల విచారణలో శ్యామల వైసీపీలో అధినేత నుంచి అధికార ప్రతినిథి వరకూ అందరూ స్క్రిప్ట్ రీడర్లే తప్ప.. వారి వద్ద ఒరిజినల్ కంటెంట్ లేదన్న సెటైర్లు పేలుతున్నాయి.  ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. అందులో ఏముంది? ఆ ఉన్నదాంట్లో వాస్తవమేంటి? అన్న విషయంతో వైసీపీ నేతలకు ఎలాంటి సంబంధం ఉండదని అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ స్క్రిప్ట్ లేకండా సొంతంగా ప్రసంగం చేయడం ఇప్పటి వరకూ ఎవరూచూడలేదు. అధికారంలో ఉన్నప్పుడూ అదే పరిస్థితి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా పరిస్థితుల్లో ఎటువంటి మార్పూ లేదు.  స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేని తన బలహీనత బయటపడకూడదని ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్కటంటే ఒక్కసారి కూడా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడింది లేదు. ఇక బహిరంగ సభలో అయితే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేయడమే చూశాం. అది కూడా గడగడా కాదు.. తడబడుతూ, నట్టుతూ నిమిషనిమిషానికీ ముందున్న పేపర్లు చూసుకుంటూ చదవడమే. అయితే బహిరంగ సభల్లో ఆయనకు ఉన్న వెసులుబాటు ఏంటంటే.. మీడియా ప్రతినిథులు ప్రశ్నలు వేయరు. వేయలేరు. దాంతో ఆయన చదవాల్సిది చదివేసి వెళ్లిపోయేవారు. ఇక అధికారం కోల్పోయిన తరువాత మీడియా సమావేశాలు ఏర్పాటు చేయక తప్పని సరిపరిస్థితి.  అప్పూడూ అంతే తాను చదవాల్సింది  చదివేసి ప్రశ్నల వేసే అవకాశం విలేకరులకు ఇవ్వకుండా ప్రెస్ మీట్ ముగించేస్తున్నారు.  ఇప్పుడు అధకారం కోల్పోయిన తరువాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తాను మట్లాడాల్సింది మాట్లాడేసి.. అదే ఫైనల్ అన్నట్లుగా ముగించేయడం తెలిసిందే. ఒక సందర్భంలో తాను మాట్లాడుతుంటే మధ్యలో ప్రశ్నలు వేయవద్దు ఫ్లో దెబ్బతింటుందంటూ మీడియాపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.  మొత్తంగా జగన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం అన్న సంగతి కొత్తేం కాదు. అందరికీ తెలిసిన సంగతే. అందుకే జగన్ ప్రసంగాలలో విషయం అంటే అతిశయం, ఆడంబరం ఎక్కువగా ఉంటాయి. అందుకు కారణం ఆయన ప్రసంగంలో విషయం ఏమిటన్నది ఆయనకే పెద్దగా తెలియకపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    అందుకే తరచుగా  జగన్  స్క్రిప్ట్ రీడింగ్ ప్రసంగాలన్నీ బూమరాంగ్ అవ్యడమో నవ్వుల పాలు కావడమో  జరుగుతుంటాయంటారు.  ఇప్పుడు తాజాగా తేలిన విషయమేంటంటే.. జగన్ పార్టీలో కీలక పదవులు, పొజిషన్ లలో ఉన్న చాలా మంది పరిస్థితీ అదేనని. వైసీపీ  ప్రసంగీకులలో చాలా మంది ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి తమ భుజాలు తామే చరిచేసుకుంటారని ఆ పార్టీ అధికార ప్రతినిథి తేటతెల్లం చేశారు.  అదెలాగంటే.. ఇటీవల కర్నూలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై వైసీపీ అధికార ప్రతినిథి విమర్శలు గుప్పించేశారు. ఆ బస్సు డ్రైవర్, అతడి సహాయకుడూ కూడా బెల్టు షాపులో తప్పతాడి బస్సెక్కారనీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం హయాంలో బెల్టు షాపులు తామరతంపరగా వెలిశాయనీ, అదే కర్నూలు బస్సు దుర్ఘటనకు కారణమని ఆరోపణలు చేశారు.  దీంతో బస్సు ప్రమాద ఘటనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ.. పోలీసులు శ్యామల సహా 27 మందిపై కేసు  నమోదు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా వైసీపీ అధికార ప్రతినిథి శ్యామలను సోమవారం (నవంబర్ 3) విచారణకు పిలిచారు. ఆ విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్యామల సమాథానం చెప్పడంలో తడబడ్డారని తెలిసింది. మరీ ముఖ్యంగా డ్రైవర్ తాగి బస్సు నడిపారనడానికి ఆధారాలేంటి అన్న ప్రశ్నకు శ్యామల సమాధానం చెప్పలేక తెల్లముఖం వేశారని తెలిసింది. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణాలేమిటన్నది తనకు తెలియదనీ.. వైసీపీ అధికార ప్రతినిథిగా పార్టీ తనకు ఇచ్చిన స్క్రిప్ట్ ను తాను చదివాననీ అంగీకరించేసినట్లు సమాచారం.   అయితే విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ శ్యామల ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు విచారణలకు పిలిచినా భయపడేది లేదని చెప్పుకొచ్చారనుకోండి అది వేరే సంగతి.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అభివృద్ధి సందడి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా తరలివస్తున్నాయి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు దిగ్గజ సంస్థలు తరలివస్తున్నాయి. అయితే అదే సమయంలో  ప్రతిపక్షహోదా కూడా లేని వైసీపీ రాజకీయాలు చేస్తున్నది. పెట్టుబడులను అడ్డుకునే విధంగా రాజకీయవిమర్శలకు తెగబడుతోంది. ఈ తరుణంలోనే రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రతిపాదన చేశారు. రాజకీయాలకు ఇంకా చాలా చాలా సమయం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి దోహదపడండి అంటూ వైసీపీకి పిలుపునిచ్చారు.   రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ ఏర్పాటైన 16 నెలలలో  రాష్ట్రానికి  పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. సోమవారం (నవంబర్ 3) మీడియాతో మాట్లాడిన ఆయన ఈ పెట్టుబడులలో అర్సేల్లర్ మిల్లర్ లక్షా ఐదువేల కోట్ల రూపాయలు, గూగుల్ 87 వేల కోట్ల రూపాయలు, అలాగే బీపీసీఎల్ లక్ష కోట్ల రూపాయలు, ఎన్టీపీసీ లక్షా పాతిక వేల కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకం ఏర్పడేలా ఈ పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం కరెక్టు కాదని ఆయన వైసీపీకి సూచించారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేద్దామనీ, ప్రస్తుతం సమష్టిగా రాష్ట్రప్రగతికి కృషి చేద్దామనీ లోకేష్ పిలుపునిచ్చారు. మేమే కాదు, మీరు కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చునని,  రాష్ట్ర అభివృద్ధి అనేది సమష్టిగా చేయాల్సిన పని అనీ హితవు పలికారు.  పెట్టుబడులకు వైసీపీ నాయకులు ఎవరినైనా సిఫార్సులు చేస్తే ఆమోదిస్తామన్నారు.   అదే సమయంలో వైసీపీపై విమర్శలూ గుప్పించారు.  విశాఖకు వచ్చిన గూగుల్ డేటా కేంద్రంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ జనంలో లేని పోని భయాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.  డేటా కేంద్రం ఏర్పాటుతో రేడియేషన్ పెరిగి చెట్టు పెరగవంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు సత్యదూరాలన్న ఆయన  అన్నీ ఆలోచించే సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు.  దేశానికి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా కేంద్రమేనన్న లోకేష్.. దీనివల్ల భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనీ,  విశాఖ రూపురేకలు కూడా ప్రపంచ స్థాయికి పెరుగుతాయన్నారు.  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందని, దీనికి సీఎం చంద్రబాబు విజనే కారణమని లోకేష్ వివరించారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పంచాయతీని పరిష్కరించేందుకు తెలుగుదేశం అధిష్ఠానం సమాయత్తమౌంది. ఇరువురినీ మంగళవారం (నవంబర్ 4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాల్సిందిగా తాఖీదులు జారీ చేసింది. ఇరువురినీ వేర్వేరుగా క్రమశిక్షణ కమిటీ విచారించి, వారి నుంచి వివరణ తీసుకోనుంది. ఇందుకోసం ఇప్పటికే కొలికపూడి శ్రీనివాసరావు మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.   గత నెలలో వీరిరువురూ బహిరంగంగా  ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలతో మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ వీరి వ్యవహారం మీడియాలోనూ, రాజకీయవర్గాలలోనూ, సోషల్ మీడియాలోనూ రచ్చరచ్చ అవుతోంది.  ఈ నేపథ్యంలోనే వీరిరువురినీ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాల్సిందిగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు.  ఇద్దరు నేతలు ఇచ్చే వివరణ ఆధారంగా వీరిపై చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి.  దీంతోనైనా వీరిరువురి పంచాయతీకి తెరపడుతుందా? లేదా చూడాల్సి ఉంది. 
ALSO ON TELUGUONE N E W S
  ప్రజెంట్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఉన్నారు. ఎన్టీఆర్ పేరు వింటే.. మాస్, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ గుర్తుకొస్తాయి. అలాగే మహేష్ పేరు వింటే.. క్లీన్ షేవ్ తో హ్యాండ్సమ్ లుక్ గుర్తుకొస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు సరికొత్త లుక్స్ లో కనిపిస్తున్నారు.   నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఐకానిక్ ఫిల్మ్ 'శివ' ఈ నవంబర్ 14న రీ-రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీల బైట్స్ తో కూడిన ప్రత్యేక ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్, మహేష్ లుక్స్ హాట్ టాపిక్ మారాయి.   Also Read: పవన్ కళ్యాణ్ పైనే శ్రీలీల ఆశలు..!   ఎన్టీఆర్ తన గత కొన్ని చిత్రాల్లో కండల తిరిగిన దేహంతో పవర్ ఫుల్ గా కనిపించాడు. కానీ, ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'డ్రాగన్' కోసం మాత్రం బాగా స్లిమ్ అయ్యాడు. ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో కానీ.. శివ ట్రైలర్ వీడియోలో మాత్రం ఎన్టీఆర్ చాలా బక్కగా కనిపిస్తున్నాడు. మరీ ఇంత బక్కగా అవ్వడం వల్ల ఫేస్ లో కల పోతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.   రెండున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో 28 సినిమాలు చేసిన మహేష్.. ఒక్కసారి కూడా గడ్డం, మీసాలతో కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం మొదటిసారి లుక్ మార్చేశాడు. గడ్డం, మీసంతో సరికొత్తగా కనిపిస్తున్నాడు. శివ ట్రైలర్ లోనూ ఈ కొత్త లుక్ తోనే దర్శనిమిచ్చాడు. దీంతో మహేష్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.    
King Nagarjuna's Shiva, a film that created a historic "Before Shiva and After Shiva" benchmark in Telugu and Indian cinema, is set for a grand re-release. Directed by Ram Gopal Varma, the iconic movie is returning to theaters with a meticulously upgraded 4K picture quality and Dolby Atmos sound. The recently unveiled Shiva 4K trailer is a phenomenal tribute, featuring testimonials from industry titans like Megastar Chiranjeevi, Mahesh Babu, SS Rajamouli, Prabhas, NTR, Allu Arjun, Mani Ratnam, and others. These legends share their experiences of watching the film that revolutionized technical craft in Indian cinema. The technical team has worked hard to ensure this 4K up-gradation honors the film's legacy. The enhanced visuals and precision sound make the re-release feel like a new film. Hearing Ilaiyaraaja's iconic background music layered with the upgraded audio and flashing through scenes etched in cinematic history is guaranteed to give audiences goosebumps. This definitive technical effort pays a superb and fitting tribute to the classic. Shiva 4K is set to release on November 14th, celebrating the 50th Anniversary of Annapurna Studios.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  గ్లామర్, డ్యాన్సింగ్ స్కిల్స్ తో.. స్టార్స్ పక్కన నటించే ఓ కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ శ్రీలీలలో ఉన్నాయి. అయితే కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్లతో వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. దీంతో ఇప్పుడామె తన ఆశలన్నీ పవన్ కళ్యాణ్ పైనే పెట్టుకుంది. (Sreeleela)   'పెళ్లి సందడి' వంటి హిట్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టిన శ్రీలీల.. ఆ తర్వాత 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకోవడమే కాకుండా, వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. అయితే వాటిలో 'భగవంత్ కేసరి' తప్ప మిగతా సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ముఖ్యంగా గత మూడు చిత్రాలు 'రాబిన్‌హుడ్', 'జూనియర్', 'మాస్ జాతర' దారుణమైన రిజల్ట్ చూశాయి. దీంతో ఇక శ్రీలీల పనైపోయిందా? టాలీవుడ్ లో ఆమె మెరుపులు మూన్నాళ్ళ ముచ్చటేనా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటికి సమాధానం చెప్పి, తాను స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే.. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మ్యాజిక్ చేయాలి. (Ustaad Bhagat Singh)   'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. అసలే 'గబ్బర్ సింగ్' కాంబినేషన్, దానికి తోడు ఇటీవల 'ఓజీ'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకొని పవన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. పైగా హరీష్ శంకర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు బాగానే ప్రాధాన్యం ఉంటుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' హిట్ అయ్యి, తన పాత్రకు మంచి పేరు వస్తే.. తెలుగులో శ్రీలీల టైం మళ్ళీ స్టార్ట్ అయినట్లే. చూద్దాం మరి 'ఉస్తాద్ భగత్ సింగ్'తో హిట్ అందుకుంటుందేమో.   Also Read: మరోసారి 'రాజా సాబ్' వాయిదా.. క్లారిటీ వచ్చేసింది!  
    -ఎవరు ఆ సీరియల్ నటి  -నవీన్ ఎవరు! -అరెస్ట్ చేసిన పోలీసులు      ఆమె ఒక సీరియల్ నటి. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్ లోను తన హవాని కొనసాగిస్తూ అప్రహాతీతంగా దూసుకుపోతుంది. సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉండే ఆమెకి కొన్ని రోజుల క్రితం నవీన్ అనే వ్యక్తి తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.   కానీ సదరు నటి ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చెయ్యలేదు. అప్పట్నుంచి నవీన్ అసభ్యకరమైన మెసేజెస్ ని పంపిస్తు లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. బ్లాక్ లిస్ట్ చేసినా వేరే అకౌంట్ ల ద్వారా మెసేజెస్ ని పంపిస్తు వస్తున్నాడు. దీంతో నటి ఎంతో మానసిక క్షోభ అనుభవించింది.ఇక చివరకి ఆ వేధింపులు భరించలేకబెంగుళూరు లోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదుతో నవీన్ ని గురించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసారు.    Also Read:  బిగ్ బాస్ పై మాధురి సంచలన వ్యాఖ్యలు.. హౌస్ నుంచి బయటకి వచ్చింది కదా    నటి ఎవరనే విషయాన్నీ మాత్రం పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సదరు నటి ఎవరనే చర్చ జరుగుతుంది.  
Rashmika Mandanna has become the most sought after actress in Indian Cinema with offers flowing from Hindi, Tamil and Telugu. Her next Telugu Film, The Girlfriend, is releasing on 7th November and the movie producer Dheeraj Mogilineni chatted exclusively with TeluguOne.  He revealed shocking facts about how she had a non-stop work schedule including promotions for her new release Thamma and shoot of her Hindi film, Cocktail. Dheeraj stated that she ate her dinner in car as she could not sit down for few minutes at a dinning table to complete her meals.  He further stated that she had to fly to US for a previous commitment, and she travelled for 20 hours in Airport and still, she came back to complete her promotional shoot for The Girlfriend, without any rest. He continued to appreciate her dedication further stating that she flew to complete her Cocktail shoot after promotions.  Dheeraj further revealed interesting facts about behind the scenes stories and acting performance of Rashmika Mandanna. Deekshit Shetty, Anu Emmanuel are playing other leading roles in this movie presented by Allu Aravind on Geetha Arts. Rahul Ravindran has scripted and directed the film.    Watch full interview here for many more interesting facts: 
The trailer for 'Shambhala: A Mystical World,' the supernatural thriller starring the very talented Aadi Saikumar, has already significantly raised expectations. Produced by Rajasekhar Annabhimoju and Mahidhar Reddy under the Shining Pictures banner, the film is directed by Ugandhar Muni and features Archana Iyer, Swasika, Ravi Varma, Madhunandan, and Shiva Karthik in key roles. The trailer, recently unveiled by Darling Rebel Star Prabhas, has generated immense curiosity. Following the fantastic response, the film unit addressed the media on Tuesday. Hero Aadi Saikumar Said: "My thanks go to Dulquer for releasing our teaser, to Thaman for his support, to my friend Sundeep Kishan, and to Darling Prabhas for releasing the trailer. We are delighted to see the positive response our promotional content is receiving everywhere. We released the trailer so quickly precisely to build buzz for the film. Prabhas's fans and others are appreciating our trailer. I must thank Vamsi, Pramod, and Prasad for their cooperation. Kiran Abbavaram congratulated us after watching the trailer, and even Rana appreciated it and promised to do his part to support the film. We are also getting inquiries about a Hindi release. The media has been very supportive. Our producers made this movie without compromising anywhere, and I wish them great profits. Ugandhar Muni has crafted a magnificent film. We are releasing it on December 25th. Our movie is guaranteed to not disappoint a single person; it will captivate everyone. Audiences are only coming to theatres for good content, and I hope the media and the audience embrace and support this distinctly different content film." Director Ugandhar Muni stated: "By the grace of Lord Shiva, our 'Shambhala' is encountering only positivity. The entire Tollywood industry is stepping forward to support us. We are thrilled that Prabhas Garu released our trailer. Aadi Garu is receiving continuous praise. Sai Kumar Garu's voice-over took the trailer to the next level. This is a film meant to be watched in the theatre; it is technically brilliant, filled with amazing twists and turns. Aadi Garu was incredibly supportive from the moment I narrated the story, and it's because of him that I made this film with such confidence. Everyone on the team gave me tremendous support. Archana's character is not a regular heroine role, and every character will be memorable for the audience. The entire team poured their soul into this film. Praveen's visuals and Sricharan Pakala’s music are of the highest standard. Even as the budget increased, the producers never compromised and stood by me. Please watch and support our film on December 25th." Heroine Archana Iyer affirmed: "I am thrilled to play a significant role in a wonderful film like 'Shambhala.' My thanks to the director and producers for trusting me with such a great character. I hope everyone loved the trailer. The film will be ten times better. Aadi Garu is set for a blockbuster with this movie. Everyone, please watch the film on December 25th."   Actor Ravi Varma avowed: "The word 'Shambhala' gained prominence with the film 'Kalki,' and that has incidentally helped our film's promotions. When Ugandhar Muni narrated the story, I initially thought my character was the most important, but every role has great significance. The impact of the teaser and trailer is much greater on the big screen compared to mobile phones or TV. The director and producers made this movie without compromising anywhere. Aadi Garu gave his 100% effort to this film. Everyone must watch this movie in the theatre on December 25th." Actor Indraniel said: "'Shambhala' will be my comeback film. Thanks to the director for giving me such a good role. The trailer's impact was much stronger on the big screen than on mobile. Aadi Garu is definitely going to score a hit with this movie. Ravi Garu and Madhu Garu have acted brilliantly. Our film is releasing on December 25th. Everyone, please watch this movie in the theatre. Our film will be enjoyable for all." Actor Madhu Nandan acknowledged: “Thanks to everyone who came to the 'Shambhala' event. We worked on this film with great unity and confidence. We are consistently receiving positive responses to all our promotions. I believe we have a divine blessing, which is why the team is so unified. We are happy that Prabhas Garu released our trailer. The producers made this movie without compromising and allocated a huge budget without worrying about the market. Yugandhar Muni has shot this film brilliantly. This film will bring great success to Aadi. 'Shambhala' will captivate everyone on December 25th."
  సినిమా అవకాశాల కోసం కొందరు హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలుగు నటి అనన్య నాగళ్ల కూడా ఈ సూత్రాన్ని నమ్ముతున్నట్టుగా ఉంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఆమె హాట్ టాపిక్ గా మారింది. (Ananya Nagalla)     టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు తక్కువ మందే ఉన్నారు. వారిలో అనన్య నాగళ్ల ఒకరు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య.. మల్లేశం, వకీల్‌ సాబ్, తంత్ర, పొట్టేల్‌ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.      ఎక్కువగా నటనకు ప్రాధాన్యముండే  పాత్రలు చేసే అనన్య.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ట్రీట్ తో కుర్రకారు మతి పోగొడుతుంది. ముఖ్యంగా రీసెంట్ గా రెడ్ డ్రెస్ లో ఆమె ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.      అనన్య ఈ రేంజ్ గ్లామర్ ట్రీట్ ఇవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మునుముందు సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో అలరిస్తుందేమో చూడాలి.     గతేడాది విడుదలైన 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమాలో నెగటివ్ రోల్ లో సర్ ప్రైజ్ చేసింది అనన్య నాగళ్ల.       https://www.instagram.com/p/DQgZYhAkxGV/?hl=en  
The highly-anticipated period film Kaantha, starring Dulquer Salmaan alongside Bhagyashri Borse and Samuthirakani, is ramping up excitement with its latest announcement. The movie, which has already created great intrigue with its stunning visuals and aesthetic sets recreating the golden era of cinema, is set to release its trailer on November 6. The announcement video for the trailer hints at a fierce on-screen battle between Dulquer Salmaan's superstar character and the director-producer role played by Samuthirakani. This compelling conflict is expected to be a central draw, significantly boosting curiosity for both the trailer and the film itself. Songs composed by Jhanu Chanter have already gained popularity, with the recent rap track adding intensity to the promotional material. Directed by Selvamani Selvaraj, Kaantha is a passion project jointly produced by Rana Daggubati and Dulquer Salmaan. The movie is scheduled for a grand theatrical release on November 14. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The highly anticipated film Raja Saab, starring Rebel Star Prabhas and directed by Maruthi, in the production of People Media Factory, is officially confirmed for a grand worldwide release on January 9, 2026, as a Sankranthi attraction. The makers have categorically dismissed recent social media rumours about a postponement, affirming the film will release on the announced date without any delay. Currently, VFX and post-production work is progressing rapidly, with release plans being finalized for all languages and premium formats like IMAX. To build excitement, a grand pre-release event is scheduled for the U.S. in December. The team expects the first copy of this prestigious Tollywood project to be ready by December 25. The movie makers have promised a never-seen-before horror comedy experience in theatres.  Prabhas stars opposite Malavika Mohanan, Nidhhi Agerwal, and Riddhi Kumar. Sanjay Dutt, Boman Irani, Satya, Zarina Wahab, VTV Ganesh and several others are playing prominent roles in the movie.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  'రాజా సాబ్' వాయిదా అంటూ వార్తలు  మేకర్స్ కీలక ప్రకటన   పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' మూవీ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. మారుతి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్.. నిజానికి 2025 సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ, వీఎఫ్ఎక్స్ వర్క్ తో ముడిపడిన సినిమా కావడంతో పలుసార్లు విడుదల తేదీ మారుతూ వచ్చింది. (The Raja Saab)   'ది రాజా సాబ్' మొదట 2025 ఏప్రిల్ కి వాయిదా పడింది. ఆ తర్వాత డిసెంబర్ కి, అటు నుండి 2026 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. 2026 జనవరి 9న 'రాజా సాబ్' ఖచ్చితంగా విడుదలవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ఇంకా రెండు నెలలే సమయం ఉండగా.. ఇలాంటి తరుణంలో మరోసారి 'రాజా సాబ్' వాయిదా అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక ప్రకటన చేశారు.    "ఫుల్‌ స్వింగ్‌ లో 'రాజా సాబ్‌' పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారమే జనవరి 9న 'రాజా సాబ్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది." అని తెలిపారు మేకర్స్. దీంతో, మరోసారి మూవీ వాయిదా పడిందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారనికి చెక్‌ పెట్టారు.   Also Read: ప్రభాస్ తో సంథింగ్ స్పెషల్.. మహేష్ గురించి ఆ సీక్రెట్..!   ప్రస్తుతం 'రాజా సాబ్‌' సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌, ఇతర పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పుల్‌ స్వింగ్‌ లో జరుగుతున్నాయి. డిసెంబర్‌ లో యూఎస్ లో గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరపనున్నారు. డిసెంబర్‌ 25 లోగా ఫస్ట్‌ కాపీ రెడీ చేయబోతున్నారు.    'రాజా సాబ్‌' విడుదల తేదీలో మార్పు లేదని నిర్మాతలు క్లారిటీ ఇవ్వడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
దాంపత్య జీవితం అనేది ఇద్దరి మధ్య ఉండే ఒక పవిత్ర బంధం. ఇది శరీర సంబంధం మాత్రమే కాదు..  ప్రేమ, నమ్మకం, కమ్యునికేషన్,  బాధ్యత, గౌరవం అనే ఐదు స్థంభాల మీద నిలబడే సంబంధం. చాలావరకు భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం గురించి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో భార్యాభర్తల గొడవ, సమస్య మూడవ వ్యక్తికి చెప్పడం వల్ల.. ఆ మూడవ వ్యక్తి భార్యాభర్తలను కూర్చోబెట్టి, వారి మధ్య అపార్థాలు తొలగిస్తారు అని అంటుంటారు. కానీ చాలామంది మాత్రం మూడవ వ్యక్తి జోక్యం వల్ల భార్యాభర్తల బంధం విచ్ఛిన్నం అవుతుంది అంటుంటారు.  భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం గురించి.. కలిగే పర్యవసానాలు గురించి తెలుసుకుంటే..  “మూడవ వ్యక్తి జోక్యం” అంటే.. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలలో, ఎమోషన్ పరిస్థితులలో, నిర్ణయాలలో, కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు లేదా ఎవరైనా ఇతర వ్యక్తి ప్రభావం చూపించడం. అలాంటి వ్యక్తులనే థర్డ్ పర్సన్ అని అంటారు. ఈ “మూడవ వ్యక్తి” ఎప్పుడూ చెడు ఉద్దేశంతో ఉండకపోవచ్చు. కానీ సమస్య ఏమిటంటే, ఆ మూడవ వ్యక్తి దంపతుల మధ్య ఉన్న నిజమైన అభిప్రాయాలు, ఆలోచనలు, పరిస్థితులు, అనుభవాలను అర్థం చేసుకోలేరు. దాంతో వాదన పెద్దదవుతుంది, అనుమానం పెరుగుతుంది, ప్రేమ తగ్గుతుంది. మూడవ వ్యక్తి జోక్యం ఉంటే ఏమవుతుంది? భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం పాయిజన్ లా పనిచేస్తుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటంటే..  నమ్మకం దెబ్బతింటుంది.. భార్యకు లేదా భర్తకు “వారి మాట వినడం కంటే బయట వాళ్ల మాట ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు” అన్న భావన వస్తుంది. ఇది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రైవసీ ఉండదు..  దంపతుల మధ్య జరిగిన విషయాలు మూడవ వ్యక్తి వద్దకి వెళ్లడం వల్ల “ప్రైవసీ” కోల్పోతుంది. అది తర్వాత చాలా దారుణంగా మారుతుంది. ప్రతి చిన్న విషయాన్ని చెప్పుకోవడం, చర్చించడం, తప్పుగా అర్థం చేసుకోవడం వంటి  సమస్యలను పదే పదే తెస్తుంది. నిర్ణయాలు దెబ్బతింటాయి.. మూడవ వ్యక్తి అభిప్రాయం విని తీసుకున్న నిర్ణయాలు చాలా సార్లు అసలైన పరిస్థితికి దూరంగా ఉంటాయి. ఎందుకంటే మూడవ వ్యక్తికి ఎప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య, పరిస్థితి 100% అర్థం కాదు.  ఎదురు వ్యక్తులు వారి అనుభవాల పరంగా నిర్ణయాలు చెబుతారు.  కోపం, అసహనం, దూరం పెరుగుతాయి.. ప్రతి వాదనలో “వాళ్లు అలా చెప్పారు” అనే పదం వస్తే, దంపతుల మధ్య దూరం పెరుగుతుంది.  అది క్రమంగా బంధం చేదిపోవడానికి సారి తీస్తుంది.   బ్రేకప్ అయ్యే ప్రమాదం.. మూడవ వ్యక్తి ఎక్కువగా  జోక్యం చేసుకోవడం వల్ల ఒక దశలో నమ్మకం పూర్తిగా పోతుంది. ఇది విడాకులకు కూడా దారి తీస్తుంది. *రూపశ్రీ.
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
మీరు కొత్త సంవత్సరంలో తీసుకున్న దృఢ నిర్ణయాలు సంగతి ఏమిటి? వాటి సంగతే మర్చిపోయారు కదూ! ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే తప్ప గుర్తుకురావడం లేదు కదూ! మీరే కాదు, ఇలాగే చాలా మంది 'కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలనీ, వేకువజామున లేచి వ్యాయామం చేయాలనీ, లేదా నడకకు వెళ్ళాలనీ, ప్రతి రోజూ ఫలానా సమయంలో చదువుకోవాలనీ, తినడం తగ్గించాలనీ' తాము ఇలా మారాలనుకున్న విషయాలను జనవరి 1వ తేదీన సంప్రదాయంగా తీసుకునే నిర్ణయాలుగా మార్చి, ఈపాటికి మర్చిపోయే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునేవారు ఇరవైనాలుగు గంటలు గడవకముందే తమ ప్రమాణాలను తీసి గట్టున పెడతారని ఒక సర్వేలో తేలింది. మనం తీసుకునే ఇలాంటి కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మనకు ప్రయోజనాలను చేకూరుస్తాయని తెలిసినా నిర్ణయాలకు కట్టుబడి ఉండడం లేదు. మొదటి రోజున్నంత దృఢ నిశ్చయం ఆ తరువాత లేకపోవడం, అవి కేవలం ఉద్వేగభరితమైన మాటలుగానే మిగిలిపోవడం చాలామందికి నిత్యం అనుభవమే. సంకల్పబలం, క్రమశిక్షణ మాత్రమే అంతర్గత శక్తిని మేల్కొలిపి, బలహీనతల్ని జయించేలా చేయగలవు. జీవితంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే పై రెండూ సహకరించకుండా ఏదీ సాధ్యం కాదు. సంకల్పబలం : సంకల్పబలం కలిగినవాళ్ళు మానసిక బలహీనతలకు దూరంగా ఉంటారు. సోమరితనాన్నీ, వాయిదా మనస్తత్వాన్నీ ఆమడదూరంలో ఉంచుతారు. జీవితంలో తమదంటూ ప్రత్యేకశైలితో ఉంటూ విజయం వైపు పయనిస్తారు. అనవసరమైన, పనికిరాని అలవాట్లకు బానిసలు కారు. వారిలోని అంతర్గత శక్తి వారిని ఉద్వేగాలకు గురి కాకుండా మార్పునకు వ్యతిరేకధోరణిని వ్యక్తం చేయనీయ కుండా వారిని మానసికంగా బలవంతులుగా తయారుచేస్తుంది.  క్రమశిక్షణ : క్రమశిక్షణ అనేది సంకల్పబలంతో కలసి పనిచేసే మానసిక శక్తి. అనుకున్నవి సాధించే ప్రయత్నంలో భాగంగా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తినిచ్చేదే క్రమశిక్షణ. ముఖ్యంగా క్షణికసుఖాలను దూరంగా ఉంచి ఉత్తమ నిర్ణయాలను తీసుకునే శక్తిని కూడా ఇస్తుంది. ఉదాహరణకు క్రమశిక్షణ కలిగిన విద్యార్థి సంకల్పబలం తోడైతే గంటసేపు టీవీ చూసే కన్నా చదువు మీదే పెట్టే సమయం వల్ల ప్రయోజనం కలుగుతుందనీ, పొద్దున్న ఇంకా నిద్రపోవడం కన్నా వాకింగ్ చేయడం, యోగాభ్యాసం చేయడం ఉత్తమమనీ తెలుసుకుంటాడు. ప్రయోజనాలు: సంకల్పబలం, క్రమశిక్షణ తోడైతే మనిషి తన ప్రవర్తనలను, చర్యలను, ఉద్వేగాలను అదుపులో ఉంచుకునే చైతన్యస్థితిలో ఉంటాడు. అవి లేనివారు వాటికి బానిసలవుతారు. మీ విషయంలోనే ఆలోచించండి. మీరు కచ్చితంగా ఈ సారి చేయాలని నిర్ణయించుకున్న పనులు ఎన్ని వాయిదా వేసుకున్నారు? ఒక పని మొదలు పెట్టి తరువాత వదిలేసిన అనుభవాలున్నాయా? పై బలహీనతల నుంచి బయట పడి, అనుకున్న పని అనుకున్న సమయంలోనే పూర్తిచేసినప్పుడు కలిగే విజయగర్వం, మానసిక తృప్తి, తత్సబంధ ఫలితాలు అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇలా భావాల్ని అదుపులో ఉంచుకుని క్రమశిక్షణతో జీవించడమంటే జీవితాన్ని నిస్సారంగానో, నిస్తేజంగానో గడిపినట్లు అనుకుంటారు కొంతమంది. నిజానికి ఇలా జీవించడమే, అనవసర ఆలోచనలను దూరం చేసి ఉత్సాహంగా ఉండటమంటే...                                   ◆నిశ్శబ్ద.
  విటమిన్ డి ముందు వెనుకా  ఆలోచించకుండా వేసుకునే మ్యాజిక్ పిల్ కాదు. కొంతమంది విటమిన్-డి లోపం గురించి తెలుసుకోకుండానే విటమిన్ డి పిల్స్ వేసుకుంటూ ఉంటారు. గత కొంతకాలంగా చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. నిద్రవేళలు పాటించకపోవడం,  జీవనశైలి,  వృత్తి సమయాల కారణంగా విటమిన్-డి లోపానికి గురవుతున్నారు.  అయితే ఇప్పటి యూత్ మాత్రం ఏదైనా విటమిన్ లోపం ఏర్పడిందనే అనుమానం రాగానే ముందు వెనుకా ఆలోచించకుండా సప్లిమెంట్లు తీసుకుంటున్నారు.  అందులో భాగంగానే విటమిన్-డి పిల్స్ కూడా వాడుతుంటారు.  అయితే  ఇలా విటమిన్-డి కోసం సప్లిమెంట్లు వాడేవారు తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. పరిశోధనలు తేల్చిన కొన్ని నిజాలు తెలుసుకుంటే..   పరిశోధనల ప్రకారం ఇతర విటమిన్ల మాదిరిగా కాకుండా  సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా విటమిన్ డి ని భర్తీ చేయకూడదు. విటమిన్-డి ని మన శరీరం  తయారు చేస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే విటమిన్ డి విటమిన్ కాదు, ఒక హార్మోన్. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా విటమిన్ డి సప్లిమెంట్లను ఇచ్చే ముందు జాగ్రత్త వహించాలని అంటున్నారు. విటమిన్ డి అనేది  సోషల్ మీడియాలో ఇది ఆరోగ్య మాత్రగా ప్రచారం చేయబడుతోంది.  రెండవ ఆలోచన చేయకుండా చాలామంది  విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటారు.  సూర్యరశ్మికి గురైన తర్వాత చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అప్పుడు కాలేయం,  మూత్రపిండాలు దాని క్రియాశీల రూపంలోకి మారుస్తాయి. దీని తరువాత ఇది శరీరంలో  వివిధ కార్యకలాపాలకు  ఉపయోగించబడుతుంది. శరీరంలో విటమిన్ డి లోపం ఉందని మొదట  వైద్యుడిని సంప్రదించాలి. కండరాల బలహీనత, శరీరంలో నొప్పి లేదా లేచి కూర్చోవడంలో ఇబ్బంది ఉంటే  డాక్టర్ పరీక్షను సిఫార్సు చేస్తారు. పరీక్ష తర్వాత డాక్టర్ విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని సలహా ఇస్తే,  శరీరంలో విటమిన్ డి లోపం ఉందని తెలిస్తేనే ఈ సప్లిమెంట్లు తీసుకోవాలి. ముఖ్యంగా నవజాత శిశువులకు,  70-75 సంవత్సరాల వయసు పై బడిన వృద్దులకు విటమిన్-డి సప్లిమెంట్లు ఇవ్వవచ్చు. అంతేకానీ యూత్ వీటిని వాడటం మంచిది కాదు.                              
  బాగా గమనిస్తే ఆఫీసులలో చాలా మంది నిద్రమత్తుతో ఉంటారు. ఇలాంటి  సమస్యలతో మీరు కూడా  ఇబ్బంది పడుతుంటే దీని గురించి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు. ఇది  ఉద్యోగాలు చేస్తున్న జనాభాలో కనీసం 15శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది.  ఆఫీసులో నిద్రపోవడం కేవలం ఆఫీసులో తోటి ఉద్యోగస్తులు, బాస్ ముందు పరువు తీయడమే కాదు.. ఇది చెయ్యాల్సిన వర్క్ మీద కూడా గణనీయంగా ప్రభావం చూపిస్తుంది.  అయితే ఆఫీసు వేళల్లో నిద్రపోవడానికి కారణం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పగటిపూట లేదా ఆఫీసులో  నిద్రపోవడానికి ప్రధాన కారణం రాత్రి నిద్ర లేకపోవడమే. ప్రతి ఒక్కరికీ  6-8 గంటలు నిద్ర అవసరం. అంత సమయం నిద్రపోకపోతే, లేదా ఈ నిద్రాక్రమం అస్తవ్యస్తమైతే.. దీని కారణంగా  పగటిపూట కూడా నిద్రపోయేలా అనిపించవచ్చు. అంతే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొన్ని వ్యాధుల కారణంగా పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం లేదా ఎక్కువగా పగటి సమయంలో నిద్రపోతుండటం జరుగుతుంది. కొన్ని శారీరక  ఆరోగ్య  పరిస్థితులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు దీనికి  కారణమని భావించవచ్చు. డిప్రెషన్-ఆందోళన, స్కిజోఫ్రెనియా, లూపస్, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్,  హైపోథైరాయిడిజం మొదలైన వ్యాధుల ప్రమాదం ఇలా పగటి సమయంలో నిద్రపోవడం అనే ప్రక్రియ కారణమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇవి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. న్యూరోలాజికల్,  న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు.. నార్కోలెప్సీ వంటి నరాల సంబంధిత రుగ్మతలు  ఉన్నప్పుడు  పగటిపూట కూడా నిద్రపోవడం జరుగుతుంది. నార్కోలెప్సీలో మెదడు నిద్రమేల్కొనే చక్రాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతుంది. నార్కోలెప్సీ ఉన్నవారు అధికంగా లేదా అకాల నిద్రపోవడానికి ఇదే కారణం. ఇది కాకుండా, వృద్ధులలో డిమెన్షియా లేదా పార్కిన్సన్స్ వ్యాధుల కారణంగా,  పగటిపూట అధికంగా  నిద్రపోయే సమస్య కూడా ఏర్పడుతుంది. ఆహారంలో ఆటంకాల వల్లా..  పగటిపూట  నిద్రపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు  మధ్యాహ్నం భారీ భోజనం తీసుకోవడం దీనికి ఒక కారణం. షుగర్ అధికంగా ఉన్న  స్నాక్స్, సోడా, వైట్ బ్రెడ్, రైస్ వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా  నిద్ర బాగా వస్తుంది. దీనికి పరిష్కారం కావాలంటే తేలికపాటి ఆహరం తీసుకోవాలి.  ఆరోగ్యకరమైన. పోషకమైన ఆహారాన్ని తినడం వల్ల  శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా,  శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది  నిద్రలేమిని తగ్గిస్తుంది. నిద్రను దూరం చేయడానికి ఏమి చేయాలంటే..  ఆఫీసులో పదే పదే నిద్రపోతున్నట్లు అనిపిస్తే దాన్ని వదిలించుకోవడానికి తక్కువ మొత్తంలో కెఫిన్‌తో కూడిన పదార్థాలు తీసుకోవచ్చు. కెఫీన్  మెదడు  నాడీ వ్యవస్థలో కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. కాఫీ-టీ నిద్రను దూరం చేస్తుంది. ఇదిమాత్రమే  కాకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా  నిద్ర వస్తుంది. అందుకే పనిచేసే  స్థలం నుండి అప్పుడప్పుడు లేచి  తిరగడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది, శరీర నీరసం పోతుంది. నిద్ర కూడా నియంత్రణలో ఉంటుంది.                                                                    *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
తమలపాకుకు మన సంప్రదాయంలో, సంస్కృతిలో,  ఆహారంలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా పూజలలో తమలపాకు అగ్రస్థానంలో ఉంటుంది. ఆ తరువాత పాన్, తాంబూలంలో వాడతారు. కానీ తమలపాకు  ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. చలికాలంలో తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..  తమలపాకు చలికాలంలో తినవచ్చా? చలికాలంలో తమలపాకు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, ఎందుకంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచే స్వభావం కలిగి ఉంటుంది. . చలితో వచ్చే కఫం, దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎక్కువగా తినకూడదు. రోజుకు ఒక ఆకుకన్నా ఎక్కువ తీసుకుంటే దాని వేడి శక్తి వల్ల కడుపు మండడం, నోరు ఎండిపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఏ సమయంలో తినాలి? తమలపాకు తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యం. ఉదయం భోజనం తరువాత లేదా సాయంత్రం భోజనం తరువాత..  ఈ రెండు సమయాల్లో ఏదైనా ఒకసారి తినడం ఉత్తమం. ఎందుకంటే భోజనం తర్వాత జీర్ణక్రియను సులభం చేస్తుంది. తిన్న వెంటనే కాదు  భోజనం తర్వాత 10–15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. ఎలా తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.. తమలపాకును తినే పద్ధతిని బట్టి దాని ప్రయోజనాలు ఉంటాయి. సాధారణ పద్ధతి.. ఒక తాజా తమలపాకు తీసుకుని, దానిపై చిన్నమొత్తం ఎలకులు పొడి లేదా సొంపు వేసి మెల్లగా నమిలాలి. ఇది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది,  నోరు తాజా వాసన ఇస్తుంది. దగ్గు లేదా చలి ఉన్నప్పుడు: ఒక తమలపాకును తేలికగా మంట మీద వేడి చేసి దానిపై కొంచెం తేనె రాసి తినండి. ఇది కఫం తగ్గిస్తుంది, గొంతు నొప్పి తగ్గిస్తుంది. జీర్ణక్రియ కోసం: తమలపాకు మీద కొంచెం చింతపండు, ఉప్పు వేసి నమిలితే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తమలపాకు ఆరోగ్య ప్రయోజనాలు భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్, బరువుగా ఉండటం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేనెతో కలిపి తింటే గొంతు సమస్యలు తగ్గుతాయి.కఫం, దగ్గు నియంత్రణ అవుతుంది.  నోటి దుర్వాసన తగ్గిస్తుంది ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తుంది. చలికాలంలో వేడి శక్తి ఇస్తుంది.  శరీరానికి తాపాన్ని అందిస్తుంది. తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యునిటీ పెంచుతుంది.  చిన్న రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది   తినటంతో పాటు తమలపాకు నూనెతో మసాజ్ చేస్తే   ఉపశమనం లభిస్తుంది.  జాగ్రత్తలు.. ఎక్కువగా తింటే కడుపు మండడం లేదా నోరు ఎండిపోవడం జరుగుతుంది.  చలికాలంలో రోజుకు ఒక ఆకుకంటే ఎక్కువ కాదు. సున్నం  లేదా సుపారితో తినడం మాత్రం వద్దు.. అవి ఆరోగ్యానికి హానికరం. గర్భిణీ స్త్రీలు లేదా గుండె, రక్తపోటు సమస్యలున్నవారు తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి.                     *రూపశ్రీ.