చిరు అంతలా.. కేసీఆర్ దేశద్రోహం.. పేర్ని నా ఫ్రెండ్.. టాప్‌న్యూస్ @7pm
Publish Date:Feb 14, 2022
Advertisement
1. ఏపీకి ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా.. పలాయనవాదం ఎందుకని సీఎం జగన్‌ను చంద్రబాబు నిలదీశారు. ‘హోదా’ కోసం ఎంపీల రాజీనామాలపై నాటి మీ సవాళ్లు ఏమయ్యాయని మండిపడ్డారు. లేని సమస్యను సృష్టించి జగన్‌రెడ్డి సినీ హీరోలను అవమానించారని మండిపడ్డారు. స్వశక్తితో ఎదిగిన చిరంజీవిలాంటి వాళ్లు జగన్‌ను ప్రాధేయపడాలా? అని ప్రశ్నించారు. 2. చిత్తూరు జిల్లాలో చేపట్టిన మూడు రిజర్వాయర్ల పనులను నిలిపివేయాలని ఎన్జీటీ, ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగంగా మూడు రిజర్వాయర్ల నిర్మాణాన్ని ప్రభుత్వం అదనంగా చేపట్టగా.. వాటికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ స్పష్టం చేసింది. తాగునీరు ఎంత అవసరమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరమని అభిప్రాయపడింది. 3. సీఎం కేసీఆర్ జవాన్ల త్యాగాలను కించపరిచేలా మాట్లాడటం దేశ ద్రోహమేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ఈ మధ్య టెన్ జన్‌పథ్ స్క్రిప్ట్ ఫాలో అవుతున్నారని రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ నుంచి గాంధీభవన్‌కు మారబోతున్నారని బండి ఎద్దేవా చేశారు. కేంద్రం పేరు చెప్పి మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. 4. ఎంపీ రఘురామకృష్ణరాజుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో తదనంతర చర్యలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఎస్సీలను రఘురామ దూషించారంటూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. సీఐడీ డీజీ సునీల్‌కుమార్ బంధువు తనపై ఫిర్యాదు చేయగా.. సాక్ష్యాధారాలు లేకుండా కేసు నమోదు చేశారంటూ.. రఘురామ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 5. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని సినీ నటుడు మోహన్ బాబు స్పష్టం చేశారు. సినిమాలు, విద్యాసంస్థలు తప్ప తనకు వేరే ఎలాంటి ఆలోచనా లేదన్నారు. మంత్రి పేర్ని నానితో జరిగిన సమావేశంపై వస్తున్న విమర్శలను మోహన్ బాబు ఖండించారు. పేర్నినాని తనకు స్నేహితుడని.. సినీ పరిశ్రమతో జరిగిన సమావేశం గురించి ఎలాంటి వాకబు చేయలేదని మోహన్ బాబు అన్నారు. 6. ఏపీ ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని సీపీఐ రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుకాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోరాటానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. కేంద్రం అడుగడుగునా ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. 7. మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. కొంత గ్యాప్ తర్వాత పులివెందులలో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. విచారణకి యూసీఐఎల్ ఉద్యోగి, ఓ న్యూస్ పేపర్ ప్రతినిధి.. హాజరయ్యారు. 8. డ్రగ్స్ కేసుల్లో తెలంగాణలో నాలుగేళ్లలో 250 మందికిపైగా ప్రముఖులు పట్టుబడ్డారు. పోలీసుల చర్యలతో రిహాబిలిటేషన్ సెంటర్‌కి ప్రముఖుల క్యూ కడుతున్నారు. డి-అడిక్షన్ సెంటర్‌లో సినీ ప్రముఖులతో పాటు.. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల పిల్లలు కౌన్సిలింగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 9. ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసింది ప్రభుత్వం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కొవిడ్ నిబంధనలను ప్రతిఒక్కరు పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫీవర్ సర్వే కొనసాగనుంది. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10. విజయవాడ హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి దేవస్థానంలో కలకలం చెలరేగింది. 23 కేజీల బంగారం, 100 కేజీల వెండి అపహరణకు గురయినట్టు వార్తలు వచ్చాయి. బంగారం, వెండి మాయంపై అధికారులు అరా తీస్తున్నారు. అయితే ఈ విషయాన్ని దేవాదాయ శాఖ ధృవీకరించలేదు.. దర్యాప్తు కొనసాగుతున్నట్టు సమాచారం.
http://www.teluguone.com/news/content/top-news-7pm-25-131779.html





