సీఎంపై ఫిర్యాదు.. హోదా యోధులెవరు?.. లవర్స్‌లేని పార్కులు.. టాప్‌న్యూస్@1pm
Publish Date:Feb 14, 2022
Advertisement
1. ప్రధాని మోదీ నిస్సిగ్గుగా బిశ్వ శర్మ ను సమర్ధిస్తున్నారని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. అసోం సీఎంపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బిశ్వ శర్మ వ్యాఖ్యలతో దేశంలోని మాతృమూర్తులకు అవమానం జరిగిందని.. వెంటనే అసోం సీఎంపై క్రిమినల్ కేసులు పెట్టి నోటీస్‌లు పంపాలని డిమాండ్ చేశారు. 2. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. స్టాలిన్, కేసీఆర్, మమతలు కేంద్రంపై పోరాడుతున్నారని.. జగన్ మాత్రం ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. ప్రత్యేక హోదాపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలకు టీడీపీ సిద్ధంగా ఉందని ఎంపీ రామ్మోహన్ స్పష్టం చేశారు. 3. విజయవాడలో టిడ్కొ ఎండి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతలు గద్దె రామ్మోహన్, బోండా ఉమ, నాగులు మీరా భేటీ అయ్యారు. ఒక రూపాయి కట్టకుండా జగన్ ఇల్లు కట్టిస్తా అని ఇచ్చిన హామీ ఏమైందని బోండా ఉమ ప్రశ్నించారు. మూడేళ్ళ కాలంలో జగన్ సర్కార్ ఒక ఇల్లు కట్టలేదన్నారు. టీడీపీ హయాంలో కట్టిన ఇల్లు పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు. టిడ్కొ కార్యాలయం చుట్టూ టీడీపీ నేతలు, పేదలు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. 4. ఏపీలో ఉపాధి హామీ ఉపాధి నిధుల దుర్వినియోగంపై బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంలో దేశం మొత్తం మీద 4.21 లక్షల కేసులు నమోదు కాగా.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో 1.20 లక్షలు ఉండడం దౌర్భాగ్యమన్నారు. ఆ డబ్బు ఏవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. 5. ప్రజలకు ఉత్తమ సేవలు అందేలా పోలీసుల పనితీరు ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్ సూచించారు. సామాన్య ప్రజలకు సేవలు అందడంపై పోలీసులు దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్‌గా మారిందని అన్నారు. గ్రామీణ సచివాలయ మహిళ పోలీస్ వ్యవస్థ బలంగా ఉందన్నారు. సచివాలయ మహిళ పోలీస్ వ్యవస్థ వలన గ్రామాల్లో మహిళలకు భద్రత పెరిగిందన్నారు డీజీపీ. 6. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరింత లోతుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. పూర్తి వివరాలు, ఆధారాల కోసం ఈడీ ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. 2017లో టాలీవుడ్ స్టార్స్‌తో పాటు మొత్తం 41 మంది కాల్ డేటా రికార్డింగ్స్‌ను ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. అయితే, కోర్టుకు ఎక్సైజ్ శాఖ సమర్పించిన వాంగ్మూలాల కాపీలు మాత్రమే తమకు అందాయని.. అందులో కాల్ రికార్డింగ్స్ లేవని ఈడీ చెబుతోంది. 7. శంషాబాద్‌లో దారి దోపిడీ ముఠా హల్ చల్ చేసింది. లిఫ్ట్ అడిగిన ప్రయాణికులను కారులో ఎక్కించుకొని.. కత్తులతో దాడి చేసింది. అంతలోనే కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొంది. ప్రయాణికునికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో ఇద్దరు అరెస్ట్ కాగా.. మరొకరు పరారయ్యారు. 8. వాలంటైన్స్ డే రోజున ప్రేమికులు లేక పార్కులు బోసిపోయాయి. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తల హడావుడికి బెదిరి లవర్స్ ఎవరూ పార్కుల వైపు చూడట్లేదు. ప్రేమికులకు పెళ్లిళ్లు చేయబోమని భజరంగ్ దళ్ స్పష్టం చేసింది. ప్రేమికులు కనిపిస్తే పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు ప్రేమికుల చేత నివాళులు అర్పింపచేస్తామని తెలిపింది. అయినా, ఎందుకైనా మంచిదని పోలీసులు పార్కుల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. 9. హనుమంతుడు తిరుమలలో పుట్టలేదని, అదంతా అభూత కల్పనని గోవిందానంద సరస్వతి స్వామి మరోసారి స్పష్టం చేశారు. అయోధ్యలోని పూజారి, పురావస్తు శాఖ, కేంద్ర సాంస్కృతిక శాఖ కూడా ఇదే విషయం తెలిపిందని చెప్పారు. కిస్కిందలోని పంపా తీరంలో హనుమంతుడు పుట్టాడని అందరు అంగీకరించారన్నారు. హనుమంతుడి తండ్రీ రాక్షసుడని టీటీడీ చెబుతోందని, ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ దైవ ద్రోహం చేస్తోందని గోవిందానంద సరస్వతి మండిపడ్డారు. 10. ఇస్రో చేపట్టిన వాహననౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 విజయవంతమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. పలు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వి సి-52 మిషన్ సక్సెస్‌పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/top-news-1pm-25-131746.html





