కాంగ్రెస్ సారధ్యంలోనే కొత్త కూటమి.. థర్డ్‌కు నో ఛాన్స్..
Publish Date:Feb 14, 2022
Advertisement
దేశంలో కాంగ్రెస్ కథ ముగిసింది. హస్తం పార్టీ పనై పోయింది. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ ఇక ఎంతో దూరంలో లేదు’ ఇలా ఎవరో ఒకరు కాదు, అనేక మంది రాజకీయ పండితులు చాలా కాలంగా జోస్యం చెపుతున్నారు. చివరకు ఈ రోజుకూ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సీనియర్ నాయకులు కూడా, కాంగ్రెస్ చరిత్రకు చుక్క పెట్టేశారు. కాంగ్రెస్ చరిత్రకు తుది పలుకులు పలికారు.
నిజం.కాంగ్రెస్ వైఫల్యాల మెట్లు ఎక్కి వచ్జిన బీజేపీ, మోడీనే కాదు, కాంగ్రెస్ కడుపున పుట్టిన తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ, తాజాగా కాంగ్రెస్ పార్టీకి ప్రేమ సందేశం పంపిన తెరాస అధినేత. తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ వరకు అనేక మంది ‘మహా’ నాయకుల అందరూ ఇలాంటి వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఇప్పుడు కొంచెం ఆలస్యంగానే అయినా, కాంగ్రెస్ పార్టీని తుడిచేయలేమని, ముందు మోడీ, ఆపైన మమత, కేసేఆర్ గుర్తిచినట్లున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ వారం పది రోజుల క్రితం వరకు కాంగ్రెస్, బీజేపీలను సమానంగానే తిట్టి పోశారు. ఆ రెండు పార్టీల చేతకానితనం, అసమర్ధతల కారణంగానే దేశం ఇలా తగలడ్డదని తీవ్రంగా విమర్శించారు. ఆ రెండు పార్టీలను, ఆ రెండు దేశాల నాయకులను ఈక్వల్’గా ఎండగట్టారు. కానీ ఇప్పుడు ఆయన స్వరం మారింది. కాంగ్రెస్ పార్టీలో, నెహ్రు గాంధీ ఫామిలీలో ఆయనకి ఇప్పుడు అనేక సుగుణాలు కపిస్తున్నాయి. త్యాగాలు దర్శనమిస్తున్నాయి.
అలాగే, కాంగ్రెస్సా.. అదేక్కడుంది, తృణమూల్ కాంగ్రేస్సీ, అసలైన కాంగ్రెస్ అని క్లెయిమ్ చేసుకున్న మమతా బెనర్జీ కుడా కాంగ్రెస్ పార్టీని ఇగ్నోర్ చేసి, జాతీయ స్థాయిలో బీజేపీఫై ప్రత్యాన్మాయం ఏర్పాటు చేయడం అయ్యే పని కాదని గ్రహించారు. అందుకే ఇటు నుంచి కేసేఅర్, అటు నుంచి మమత బెనర్జీ, ఇప్పటికే కాంగ్రెస్ సారధ్యంలోని, యూపీఎ భాగస్వాములగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ద్వారా కాంగ్రెస్’కు దగరయ్యే ప్రయత్నాలు చేస్తన్నారని, అంటున్నారు.అందులో భాగంగానే మమత, స్టాలిన్, కేసేఆర్, ఉద్దవ థాకరే కాంగ్రెస్ ప్రమేయం లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్’గా ఏర్పడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, అల్టిమేట్’గా కాంగ్రెస్ సారధ్యంలోనే కొత్త ఫ్రంట్ పనిచేస్తుందని, పరిశీలకులు భావిస్తున్నారు.అంతే కాకుండా, ఈ అందరినీ ఒక తాటి పైకి తెచ్చి బీజేపే టార్గెట్’ గా రాజకీయ వ్యూహం రచిస్తున్న ప్రశాంత్ కిశోర్ కూడా కాంగ్రెస్ లేకుండా ఏర్పడే కూటమి బీజేపీని ఓడించలేదనే అభిప్రాయన్నే పలు సందర్భాలలో వ్యక్త పరిచారు. సో..కేసీఆర్ ప్రస్తుతానికి ఫెడరల్ ఫ్రంట్ అన్నా ప్రజా ఫ్రంట్ అన్నా, చివరకు కలిసేది కాంగ్రెస్ గంగాలోనే అంటున్నారు, పరిశీలకులు.
అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు, అదే విధంగా కేసేఆర్’కు ఫోన్ చేయడం, బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం ప్రస్తావన చేయడం ప్రధాన్యత సంతరించుకుంది. మరోవంక- ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటులో భాగంగా.. చర్చించేందుకు మమత బెనర్జీ త్వరలోనే హైదరాబాద్‌కు వస్తున్నారని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సైతం తన సంకేతాల కోసం ఎదురు చూస్తున్నారంటూ కేసీఆర్ చెప్పారు. త్వరలోనే తాను ఆయనను కలుసుకోబోతున్నానని పేర్కొన్నారు. కాగా, చివరకు కాంగ్రెస్ సహా, బీజేపీ యేతర పార్టీలు అన్నీ, ఒకే గొడుగు కిందకు రావడం ఖాయమని అంటున్నారు. అందుకు, ప్రశాంత్ కిశోర్ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే కేసీఆర్’ను పీకే ఉపయోగించుకుంటున్నారని, అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-front-in-congress-leadership-25-131738.html





