టాలీవుడ్ సైలెన్స్.. కారణమేంటో తెలుసా?

Publish Date:Apr 16, 2024

Advertisement

తెలుగు సినీ పరిశ్రమకు అందిరకీ తెలిసిన కారణాలతోనే ఏపీలోని జగన్ సర్కార్ పట్ల ఒకింత అయిష్టత ఉంది. సినీమాల విడుదల, సినీమా టికెట్ల ధరల విషయంలో జగన్ సర్కార్ ఒకింత దుర్మార్గంగా వ్యవహరించిందన్న విషయంలో సినీ పరిశ్రమ జగన్ సర్కార్ విషయంలో కినుకతో ఉందనడంలో సందేహం లేదు. అయితే సినీ పరిశ్రమలో దిగ్గజాలనదగ్గ ఎవరూ కూడా బాహాటంగా జగన్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పన్నెత్తు మాట అనలేదు. పైపెచ్చు అలీ, పోసాని వంటి కమేడియన్ల మధ్యవర్తిత్వంతో టికెట్ల విషయంలో జగన్ తో బార్గెయినింగ్ కు ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. ఆ సందర్భంగా తెలుగుసినీ హీరోలకు ఒకింత అవమానం జరిగిందని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయాలను పరిశ్రమకు చెందిన ఎవరూ కూడా బాహాటంగా విమర్శించింది లేదు. 

అలాగే స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసినప్పుడు కూడా సినీ పరిశ్రమకు చెందిన ఒకరిద్దరు మినహా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వంటి వారు తప్ప చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదు. 

సరే అదలా ఉంచితే.. ఇటీవల మనమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన ఎన్నికల ప్రచార బస్సు యాత్రలో ఏపీ సీఎంపై గులకరాయి దాడి జరిగింది. ఈ దాడిలో జగన్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  అయితే టాలీవుడ్ సెలబ్రిటీలు,  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉండే తెలుగు హీరోలు, దర్శకులు ఎవరూ కూడా ఈ ఘటనపై  స్పందించలేదు. ఖండించలేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

రాష్ట్రంలో  ఎన్నికలకు కేవలం నాలుగు వారాల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి (అఫ్ కోర్స్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రే అనుకోండి)పై దాడి జరిగితే సినీ పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం. అయితే  వైఎస్ జగన్ వ్యవహరించిన విధంగా తెలుగు ఇండస్ట్రీ పట్ల ఇంత కక్ష పూరితంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఎవరూ ఇంత వరకూ లేరనీ, అందుకే జగన్ కు సంబంధించిన మంచి, చెడ్డల విషయంలో పరిశ్రమ మౌనంగానే ఉంటున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా  టిక్కెట్ల ధరల పెంపు కోసం, బెనిఫిట్ షోల కోసం పరిశ్రమలో దిగ్గజ హీరోలు తన దగ్గరకు వచ్చి వేడుకునేలా చేసుకున్న జగన్ పట్ల ఇండస్ట్రీ లో ఓ విధమైన వ్యతిరేక భావన ఉందని అంటున్నారు. అయినా ఎన్నికల ముందు జరిగిన ఈ సంఘటనను ఖండిస్తూనో, మరోలాగానో స్పందించడం కంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడడమే బెటర్ అన్నట్లుగా ఇండ తెలుగు సినీ పరిశ్రమ వ్యవహరిస్తోందని విశ్లేషిస్తున్నారు.  జగన్ పై దాడికి ఖండిచి ఆయనకు అనవసర మైలేజీ ఇవ్వడమెందుకన్నట్లుగా మౌనంగా ఉండిపోయారంటున్నారు.

జగన్ పార్టీలో ఉన్న అలీ కూడా స్పందించిన దాఖలాలు లేవు. పార్టీ టికెట్ కోసం గత ఐదేళ్లుగా కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన అలీకి చివరకు జగన్ రిక్తహస్తమే చూపడంతో ఆయన పార్టీ వ్యవహారాలకు ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు జగన్ విషయంలో స్పందించకపోవడం  వారు జగన్ పట్ల సానుకూలంగా లేరన్న సంకేతాలను పంపినట్లేనని అంటున్నారు.  

By
en-us Political News

  
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు... నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ  గల్ఫ్ జెఏసి చైర్మన్, గుగ్గిల్ల రవిగౌడ్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి
దేశంలోనే అత్యంత రిచెస్ట్ సి.ఎం.గా జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఎంపీ అభ్య‌ర్థుల్లో ధ‌న‌వంతుడు గా పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్. ఈ ఇద్ద‌రి గురించి దేశ‌వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంపాద‌న‌ను, నా సంపాద‌న‌తో పోల్చ‌వ‌ద్దు. ఆయ‌నది అక్ర‌మ సంపాద‌న అని సీబీఐ చెబుతోంది. నాది అలా కాదు. నేను ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్నా. సో.. ఆయ‌న‌తో న‌న్ను పోల్చ‌వ‌ద్దంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్.
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.తెలంగాణ  పిసిసి అధ్యక్షుడు అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కాంగ్రెస్ , బిజెపి నేతల మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణల పర్వానికి శ్రీకారం చుట్టారు. 
ఎన్నికల వేళ ప్రచారంలో పై చేయి సాధించడానికి రాజకీయ నాయకులు, పార్టీలూ రోజు కో వ్యూహంతో ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలై.. లోక్ సభ ఎన్నికలలోనైనా పుంజుకుని ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ డిస్పరేట్ గా తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఎపిలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. వైకాపా హాయంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. సహజవనరులను సైతం కొల్లగట్టడంతో ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. అధికారపార్టీ ఆగడాలకు అంతే లేకపోవడంతో చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది.  
ఎండలు మండిపోతున్నాయి. ఎండలో ఇంట్లోంచి కాలు బయటకి పెట్టాలంటే యువత కూడా భయపడిపోతున్న పరిస్థితులు.
వల్లభనేని వంశి నోటి వెంట వచ్చే మాటలన్నీ పోలింగ్ కు ముందే తన ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన తరువాత వైసీపీలోకి జంప్ చేశారు. అంతుకు ముందు ఎన్నికలలో అంటే 2014 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
గత రెండు విడతలుగా జరిగిన పోలింగ్ సరళిని చూస్తే, జనాలకు మోడీ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేద‌ని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. మొదటి విడత ఓటింగ్ చూసి షాక్ తింటే, రెండవ విడతలో జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇంకా నిరాశ పడాల్సి వస్తోంది
చేసేవన్నీ ఇల్లీగల్ పనులు.. అసలు విషయం బయటపడ్డాక నాకేమీ సంబంధం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు..
​వనపర్తి జిల్లా భూత్పూరు గ్రామానికి చెందిన రైతు శేఖర్ ఆదివారం నాడు తన పొలానికి
ఏపీ ఊడిపోయే సీఎం జగన్ మొన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టే విడుదల కార్యక్రమాన్ని సౌండ్ మ్యూట్
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకెడుతోంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ కంచుకోట బీటలు వారిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలుగుదేశం జోరు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ప్రజా నిరసన సెగ తగులుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.