రూల్ ఈజ్ రూల్.. కొడుక్కి ఫైన్ వేసిన సీఐ

Publish Date:May 13, 2021

Advertisement

రూల్ ఈజ్ రూల్  రూల్ ఫర్ ఆల్.. చట్టం ముందు అందరూ సమానులే.. అది ఎప్పుడో విన్న మాట అని అనుకుంటున్నారా..? అయినా ఎప్పుడు ఎవరు ఆ ఆర్టికల్ ని ఫాలో అవుతున్నదని అనుకుంటున్నారా..? అలా అనుకుంటే అదే పొరపాటే. అలా చట్టాన్ని ఫాలో అయ్యేవాళ్లు, ఆ చట్టాన్ని అమలు చేసేవాళ్ళు ఇంకా లేకపోలేదు. అక్కడక్కడా మానవత్వం మనుషులు బతికి ఉన్నట్లు, ఇలా చట్టానికి గౌరవించేవాళ్ళు కూడా ఉన్నారు. నమ్మడం లేదు కదా..! అయితే మీరే చూడండి. 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడికి కఠినమైన కర్ఫ్యూ అమలవుతోంది. ప్రతి రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి ప్రజలు రోడ్లపై తిరగకుండా ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. కర్ఫ్యూ సమయంలో ఎవరైనా బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కేవలం అత్యవసర వాహనాలు, వైద్య సేవల నిమిత్తం వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. అయినా సరే కొందరు చిన్నచిన్న పనులపై బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది సిల్లీ రీజన్స్  చెప్పి రోడ్లపై జులాయిగా తిరిగేస్తున్నారు. వీరిలో కొందరు కరోనా పేషెంట్లు కూడా ఉంటున్నారు. ఇదిలా ఉంటే కర్ఫ్యూ సమయంలో తమ పలుకుబడి ఉపయోగించి బయటతిరిగేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖుల పిల్లలు రూల్స్ పాటించకుండా బయట తిరగడం పోలీసుల తనిఖీల్లో తమ కుటుంబ సభ్యులు, ఇతర ప్రముఖుల పేర్లు చెపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వారిపట్న పోలీసులు ఉదారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి.

ఐతే ఓ పోలీస్ అధికారి మాత్రం కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్న తన సొంత కుమారుడికి ఫైన్ వేశారు. బయటతిరిగితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరులో కర్ఫ్యూ సందర్భంగా జనం రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలమనేరు సీఐ జయరామయ్య కూడా రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ బయట తిరుగుతున్న ఓ కుర్రాడిని సీఐ జయరామయ్య వద్దకు తీసుకొచ్చారు. తీరా చూస్తే ఆ అబ్బాయి... సీఐ జయరామయ్య కుమారుడు, బీటెక్ స్టూడెంట్ రాహుల్. ఇది తెలిసిన కానిస్టేబుల్ సారీ సర్.. మీ అబ్బాయి అని తెలియక తీసుకొచ్చా అని బదులిచ్చాడు.

దీనిపై స్పందించిన సీఐ జయరామయ్య.. చట్టం ముందు అందరూ సమానమేనని.. కర్ఫ్యూ సమయంలో బయట తిరుగుతున్నందుకు రూ.125 జరిమానా విధించారు. బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన మన అనే బేధం లేదని.. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఇంట్లోనే ఉండాలని ఆయన అన్నారు. ఈ రోజుల్లో కొందరు ప్రముఖులు తమ పిల్లలు తప్పులు చేసినా చూసీచూడనట్లు వదిలేస్తుంటారు. అంతేకాదు వారిని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ సీఐ జయరామయ్య మాత్రం.. చట్టంముందు అందరూ ఒకటేనని నిరూపించారని పలువురు అభినందిస్తున్నారు. కర్ఫ్యూ అమలులో ఉండగా ప్రజలు బయటకురాకుండా కరోనాను అరికట్టాలని పిలుపునిస్తున్నారు.  

 సీఐ జయరామయ్య చేసిన పనికి డిపార్ట్మెంట్ లో అందరూ షాక్ అయ్యారు. స్థానికులు సైతం ఎస్ఐ జయరామయ్య ని జై అంటున్నారు. నిజంగా గ్రేట్ కాదా.. అలా అందరూ ఉండలేరూ.. ఆకాశం లో చుక్క తెగిపడేట్లు ఎక్కడో అక్కడ అక్కడ కొందరు మాత్రమే సిన్సియర్ గా ఉంటారు. 

      
       

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.