కొవిడ్ తో కొలువులు ఖాళీ.. ఆల్ టైమ్ గరిష్టానికి నిరుద్యోగం

Publish Date:May 13, 2021

Advertisement

కొవిడ్’తో సంబంధం లేకుండానే దేశంలో నిరుద్యోగం రేటు పతాక స్థాయికి చేరుకుంది. రేడు సంవత్సరాల ముందు 2019 లోనే, దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది. అదలా ఉంటే, మూలిగే నక్కపై తాటికాయ అన్నట్లుగా, కొవిడ్ మహమ్మారి విరుచుకు పడడంతో ఉన్న ఉద్యోగాలు పోయి, ఉద్యోగులు నిరుద్యోగులుగా మారడంతో పరిస్థితి మరింతగా విషమించింది.అలాగే, కరోనా కారణంగా ఒకదాని వెంబడి ఒకటిగా అనేక  రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడం లేదా ఇతర అక్షలు విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు మరింతగా కుంట పడ్డాయి. ఫలితంగా పట్టణ నిరుద్యోగం ఒకసారిగా  12 శాతానికి చేరింది. 

దేశంలో చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూ లేదా ఇతర ఆంక్షలు విధిస్తున్న నేపధ్యంలో ఉద్యోగ మార్కెట్’పై మ‌రింత ఒత్తిడి పెరిగింద‌ని ఆర్థిక‌వేత్త‌లు భావిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి పాటుగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడి పోతున్నాయి.  సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ)డేటా ప్రకారం, ప‌ట్ట‌ణ నిరుద్యోగం ఏప్రిల్ 25తో ముగిసిన వారంలో 9.55% నుండి మే 9 వ‌ర‌కు వారంలో 11.72 శాతానికి చేరుకుంది. ఇది ఏప్రిల్ నెల‌వారీ సగటు 9.78% కంటే దాదాపు రెండు శాతం ఎక్కువ‌.

జాతీయ స్థాయిలో మే 9తో ముగిసిన వారంలో నిరుద్యోగం రేటు 8.67 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో గ్రామీణ నిరుద్యోగం కూడా 6.37% నుండి 7.29%కి పెరిగింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జాతీయ, గ్రామీణ నిరుద్యోగం  రేట్లు కూడా ఏప్రిల్ నెల‌వారీ నిరుద్యోగ రేటు కంటే ఎక్కువగానే ఉన్నాయి.
అయితే, దేశంలో నిరుద్యోగం పెరగడానికి, కరోనా, లాక్ డౌన్ మాత్రమే కారణం కాదని, దీర్ఘకాల ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి పేరున  కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు కూడా ఉద్యోగ, ఉపాధి  రంగంపై వ్యతిరేక ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకే సారి లాక్ ద్వోన్ విధించింది. అయితే సంవత్సరం ఆరంభంలో ప్రారంభమైన సెకండ్ వేవ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో రాష్ట్రాలకు నిరనయదికారం ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితుల ఆధారంగా లాక్ డౌన్ లేదా ఆంక్షలు విధిస్తున్నాయి.  దీంతో ఆర్థిక కార్యకలాపాలు సక్రమంగా సాగక, అనేక కంపెనీలు, పరిశ్రమలు పాక్షికంగా మూత పడుతున్నాయి. నిరుద్యోగం రేటు పెరుగుతోంది. 

నిరుద్యోగం ప్రభావం ఆర్థిక వ్యవస్థ అంతటా ప్రభావం చూపుతుంది. అందుకే ఆర్థిక వ్యవస్థ ఎదుర్కుంటున్న ఆటుపోట్ల ప్రభవంతో జీడీపీ ఇతర ఆర్ధిక ప్రమాణాలు తీవ్ర వడిదుడుకులకు గురవుతున్నాయి. కార్మిక‌, ఉపాధి మార్కెట్ మ‌న మొత్తం ఆర్థిక వ్య‌వ‌స్థ  ప‌నిత‌నం తెల‌ప‌డానికి ప్ర‌త్య‌క్ష సంబంధం క‌లిగి ఉంది. అనేక బ్రోక‌రేజ్ మ‌రియు ఆర్థిక సంస్థ‌లు జీడీపీ అంచ‌నాను త‌గ్గించాయి. బ‌ల‌మైన ఆర్థిక పున‌ర్‌జ్జీవ‌నానికి భార‌త్ ఎంత త్వ‌ర‌గా ఈ వైర‌స్‌ను అరిక‌ట్ట‌గ‌ల‌దో అన్న‌దానిపై ఆధార‌ప‌డి ఉన్న‌ట్లుగా క‌న‌ప‌డుతుంద‌ని ఇండియ‌న్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌ధాన ఆర్థిక‌వేత్త సునీల్ కుమార్ సిన్హా అన్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.