విజయసాయి పీఆర్పీపై స్పందించిన చెవిరెడ్డి: ఆ పార్టీ వల్ల వైసీపికీ నష్టం లేదని వ్యాఖ్య.!

Publish Date:Nov 13, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు వైయస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన కీలక నేత విజయసాయి రెడ్డి, ఇప్పుడు సొంత పొలిటికల్ జర్నీ ప్రారంభించిన సంగతి విదితమే.   వైసీపీ అధినేత జగన్ కు అత్యంత నమ్మకమైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా, రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఆయన,  పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) పేరుతో నూతన రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు. వైయస్ కుటుంబ నీడ నుంచి బయటపడి, తనకంటూ ఒక స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణ పనులను వేగవంతం చేశారు.

కొత్త పార్టీ ఆవిర్భావ వేదికపై విజయసాయి రెడ్డి ఊహించిన విధంగానే వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ మత విశ్వాసాలను ప్రస్తావిస్తూ, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్డి సామాజిక వర్గ మద్దతును ఆశిస్తున్నారంటూ   ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. సాయిరెడ్డి చేసిన ఈ విమర్శలకు,  ఆయన కొత్త పార్టీకి వైసీపీ నుంచి ఎవరు, ఎలాంటి సమాధానం ఇస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.  

ఇది కూడా చదవండి: విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.?

సాయిరెడ్డి పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే ఆయన సొంత పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడారు. విజయసాయి పేరు నేరుగా  ప్రస్తావించకుండా  జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నంత కాలం కొంతమంది వ్యక్తులు తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటారని విమర్శించారు.

జగన్ కల్పించిన నమ్మకం, విశ్వసనీయత వల్లే వారికి రాజకీయ వేదిక లభించిందని, కానీ నేడు వారు పార్టీ కంటే తామే గొప్ప అని భ్రమపడుతున్నారని చెవిరెడ్డి అన్నారు.   జగన్ లేకపోతే వ్యక్తిగతంగా వారికి ఎటువంటి గుర్తింపు, విలువ లేవనే విషయాన్ని   గ్రహించలేకపోతున్నారని అన్నారు. ఇలాంటి ప్రాధాన్యత లేని, ప్రభావం చూపలేని చిన్న పార్టీల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఇసుమంతైనా ఉండదన్నారు.  

మీకునచ్చవచ్చు:  విజయసాయి కొత్త పార్టీ: వైసీపీకి జరిగే నష్ట మేంటి.. రాష్ట్ర రాజకీయాల్లో పీఆర్పీ ప్రభావమెంత.?

విజయసాయి కొత్త పార్టీ: వైసీపీ బీ టీమ్ అంటూ చర్చలు.!

[Vijaya Sai Reddy  PRP Party, Chevireddy Reaction, YCP TeluguOn]
 

By
en-us Political News

  
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.