ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌పై ‘తిరంగా ర్యాలీ’.. ట్రాఫిక్ ఆంక్షలు

Publish Date:Aug 13, 2026

Advertisement

 

ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌ పై నిర్వహించనున్న ‘తిరంగా ర్యాలీ’ నేపథ్యం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి చిల్డ్రన్స్ పార్క్ సమీపం లోని ఎం-47 ప్యాటన్ ట్యాంక్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ర్యాలీ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. 

సెయిలింగ్ క్లబ్ వద్ద కర్బాలా మైదాన్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌ బండ్‌కు వెళ్లే సాధారణ వాహనాలను అనుమతించారు. వాటిని సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ వైపు మళ్లించనున్నారు. అలాగే డీబీఆర్ మిల్స్ వద్ద నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను అనుమ తించకుండా గోశాల– కవాడిగూడ వైపు మళ్లి స్తారు. ఈ మళ్లింపుల కారణంగా సెయిలింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

వాహనదారులు ఈ మార్గాలను వీలైనంత వరకు నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ర్యాలీ పూర్తయిన వెంటనే ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను తొలగించి రహదారులను సాధారణ రాకపోకలకు పునరుద్ధరిస్తామని పోలీసులు తెలిపారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరా బాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.

Tiranga Rally on Tank Bund on August 14, Hyderabad Traffic Police, Sailing Club,  Telangana police, Hyderabad police, CP Sajjanar. DGP C.V. Anand 

By
en-us Political News

  
స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కమ్మటి నీటి బొట్టు కోసం నల్లమల అడవుల వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ఆ ప్రాంత ప్రజలకు కొత్తేమీ కాదు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో గోల్కొండ కోట పరిసరాల్లో శనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌ల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  
కేసీఆర్ ఉచితంగా ఇస్తే.. ఇందిరమ్మ ఇండ్లకు 6 లక్షలా..!
గతంలో ఎన్నడూ లేని విధంగా అంతర్జాతీయ మార్కెట్లో  ఇండియ్  ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎగుమతులు   పుంజుకున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జూలై నెలలో ఇండియా  దాదాపు 44.24 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో  4.22 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది.
గతంలో   ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ..   నాల్సార్‌ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.  
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది
వైసీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఎండనకా, వాననకా తమ కళ్లెదుటే మట్టి దిబ్బలుగా మిగిలిపోయిన కలల రాజధానిని చూసి మూగబోయిన గుండెలకు నేడు కొద్దిగా ఉపశమనం లభించింది.
సావర్కర్ పరువునష్టం కేసులో ఊరట..!
గోదావరి పుష్కరాలు– 2027 నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.