భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి!
Publish Date:Feb 26, 2026
Advertisement
ఏ బంధం అయినా నిలబడటానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందులో భార్యాభర్తల బంధం మరీ సున్నితమైనది. కానీ ఆ బంధాన్ని ఎంత దృఢంగా మార్చుకుంటారు అనేదే ఇక్కడ ముఖ్యం. భార్యాభర్తల బంధం బలంగా మారడానికి పరస్పర అవగాహన చాలా ముఖ్యం. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితిని అయినా సులభంగా దాటవచ్చు. అయితే పరస్పర అవగాహన కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. భార్యాభర్తల మధ్య సంబంధం చాలా విలువైనది. కానీ పరస్పర అవగాహన లేకపోవడం వల్ల, ఆ సంబంధం తెగిపోయే అంచుకు చేరుకుంటుంది. బయట ఎంత మంది వ్యక్తులు ఉన్నా, జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా.. జీవితాంతం కలిసి ఉండేది భార్యాభర్తలే.. కానీ దురదృష్ట వశాత్తు చాలామంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా.. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, ఇతరుల కారణంగా గొడవ పడుతూ ఉంటారు. ఇది బంధాలను దెబ్బతీస్తుంది. పరస్పర అవగాహన పెరగాలంటే.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలి, ఒకరితో ఒకరు విశాల హృదయంతో మాట్లాడుకోవాలి. ఇలా మాట్లాడుకున్నప్పుడే ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అదే బంధం బలంగా మారడానికి సహాయపడుతుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా అపార్థం ఉంటే, కూర్చుని దాన్ని పరిష్కరించుకోవాలి. ప్రతిరోజూ ఒకరికొకరు కొంత సమయం కేటాయించుకోవాలి. ఇద్దరు ఒకరి సమస్యను ఒకరు చెప్పుకోవాలి. వాటికి తగిన పరిష్కారాన్ని ఇద్దరూ కలిసి మాట్లాడుకుని నిర్ణయించుకోవాలి. అప్పుడు ఇద్దరినీ ఎలాంటి సమస్య ఇబ్బంది పెట్టవు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరిలో ఎవరైనా తప్పు చేస్తే క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలాగే భార్యాభర్తలలో ఎవరైనా తప్పు చేసి క్షమాపణ చెప్పినప్పుడు, వారిని క్షమించడం ఎదుటి వ్యక్తి కర్తవ్యం. అప్పుడే ఇద్దరూ బాగుంటారు. బంధం బలంగా మారుతుంది. *రూపశ్రీ.
బార్యాభర్తల బంధం..
భార్యాభర్తల బంధానికి నమ్మకం పునాది అయితే.. గౌరవం అంతకు మించి బలమైనది. ఒకరినొకరు నమ్మాలి, నమ్మకం లేకపోతే ఇద్దరి మధ్య అనుమాన పూరిత ప్రవర్తన మిగులుతుంది. అంతేకాదు.. బాగస్వామితో నిజాయితీగా ఉండాలి. ఏ విషయాన్ని అయినా చర్చించాలి, చెప్పుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య బందం బలంగా మారుతుంది.
http://www.teluguone.com/news/content/tips-to-build-mutual-understanding-between-husband-and-wife-35-214687.html





