18ఏళ్లు దాటిన పిల్లల విషయంలో ఇలా చేయకండి..!

Publish Date:Feb 17, 2026

Advertisement


తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా వారిపై నియంత్రణ కొనసాగించాలని అనుకుంటారు. వారి దృష్టిలో  18 ఏళ్లే కాదు.. పెళ్లైనా కూడా తమ పిల్లల విషయంలో నిర్ణయాలు పూర్తీగా తమవే కావాలని అనుకుంటారు.   ఇలా పిల్లల విషయంలో అతిగా నియంత్రణ చేసే తల్లిదండ్రుల మూలాన పిల్లలు ఆత్మవిశ్వాసం కలిగి ఉండరని,  వారికంటూ ప్రత్యేకత, వారి ప్రతిభ, వారి గుర్తింపు వారు పొందలేరని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..


మారుతున్న కెరీర్.. చాలెంజెస్..

నేటి ప్రపంచంలో  జీవన ప్రమాణాలు, కెరీర్ ఎంపికలు వేగంగా మారుతున్నాయి.  దీని కారణంగా 18–34 సంవత్సరాల వయస్సు గల యువకులలో 33శాతం మంది స్వతంత్రంగా ఉండలేకపోతున్నారు.  తల్లిదండ్రులతో కలిసి జీవించడం కంటే.. తల్లిదండ్రులే వారి జీవితాన్ని నిర్తేశించడం,  వారిని నియంత్రణలో ఉంచడం జరుగుతోంది.

తల్లిదండ్రులు ఇలా పిల్లల విషయంలో నియంతలుగా ఉండటం కంటే.. వారికి స్నేహితులుగా ఉండాలని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు.  దీని వల్ల పిల్లలు తమ వయసుతో పాటు.. తమ జీవితం పట్ల ఒక స్పష్టత కూడా కలిగి ఉంటారు.

నిఘా పెడితే.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది..

చాలా మంది తల్లిదండ్రులు తెలియకుండానే హెలికాప్టర్ పేరెంటింగ్‌ను ఆశ్రయిస్తారు. అంటే తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసం,  మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. హాస్టల్‌లో చదువు పూర్తి చేసుకున్న తర్వాత పిల్లలు పెద్దవారై ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇంటి ఖర్చులు, పనులు,  దాచి ఉంచవలసిన విషయాల గురించి పిల్లలతో కలిసి మాట్లాడాలని నిపుణులు చెబుతున్నారు.  ఇది పిల్లలకు జీవితంలో పరిపక్వత పెంచే దిశగా అడుగులు వేయిస్తుంది.

అవగాహన తోనే  కుటుంబ సంతోషం..

సంబంధాలలో అతిగా ఆధారపడటం  మంచిది కాదు, కానీ అన్ని రకాలుగా ఆధారపడటాలు చెడ్డవి కావు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంత వయసు పెరిగా అన్ని విషయాలలోనూ తమ మీద ఆధారపడి ఉండాలని, పిల్లలు కేవలం చదువుకుని ఉద్యోహాలు తెచ్చుకున,  తల్లిదండ్రుల ఇష్టప్రకారం  జీవితాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు.  కానీ ఇది వారి జీవితాన్ని ఏదో ఒక రోజు కష్టాలలోకి నెట్టివేయడం లేదా తల్లిదండ్రుల మీద చెడు అభిప్రాయం ఏర్పడేలా చేయడానికి దారితీస్తుంది. పెద్దవారు లేకుండా పిల్లలు ఏదీ నేర్చుకోలేరు. కానీ పెద్దవారు చెప్పినట్టు జీవితాంతం పిల్లలు ఉండాలని అనుకోవడం చాలా తప్పు.   ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన పిల్లలను ఒత్తిడి చేయకూడదు.  వారితో స్నేహంగా ఉంటూ చర్చించడం ద్వారా వారి జీవితాన్ని మంచి దిశలో నడిపించేందుకు కృషి చేయాలంతే..

                                      *రూపశ్రీ.
 

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
దేశ చరిత్రను, ప్రపంచ చరిత్రను గమనిస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు,  మరెన్నో గొప్ప  ప్రణాళికలు, వ్యూహాలు కనిపిస్తాయి.  నేటికాలంలో స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ పుణ్యమా అని ఎవరికైనా ఫోన్ చేయాలన్నా,  మెసెజ్ చేయాలన్నా..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.