ఆముదాలవలసలో తమ్మినేనికి అసమ్మతి పోటు!?

Publish Date:Mar 21, 2024

Advertisement

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గం ఆమదాలవలస.. ఇక్కడ ఎమ్మెల్యే గా గెలిచిన వారు క్యాబినెట్ స్థాయి పదవిని అనుభవించడం గడచిన కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది.  తెలుగుదేశంలో కూన రవికుమార్, వైసీపీలో తమ్మినేని సీతారాం కూడా ఈ కోవకు చెందిన వారే. సిక్కోలు పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిన ఆమదాలవలసలో టికెట్ కోసం ఆశపడే వారి జాబితా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ బహునాయకత్వ సమస్య టిడిపిలో లేకపోవడం ఆ పార్టీకి కలసి వస్తోంది. ఇదే తలనొప్పితో బాధపడుతున్న వైకాపా నేత, ప్రస్తుత ఆమదాలవలస ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన పేరును అధిష్టానం ప్రకటించిన తరువాత విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 
 
ఔను  బహునాయకత్వ సమస్యలు స్పీకర్ తమ్మినేని సీతారాం కు తల బొప్పి కట్టించాయి. మూడు పార్టీ ఆఫీసులు, ఆరుగురు ఆశావహులతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క స్పీకర్ నియోజకవర్గం ఆమదాలవలసలోనే తీవ్ర స్థాయిలో ఉన్న వర్గ పోరు,  ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ  అభ్యర్ధిగా స్పీకర్ తమ్మినేని పేరు ప్రకటన తరువాత ముదిరి పాకాన పడింది. 

వైసీపీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం లోనే వర్గపోరు సభాపతికి తలనొప్పిగా మారింది. గడచిన నాలుగేళ్ళగా స్పీకర్ తో విభేదించిన స్థానిక నాయకులు మూడు పార్టీ ఆఫీసులు ప్రారంభించి క్యాడర్ తో మూడు ముక్కలాట ఆడుతూనే ఉన్నారు.  స్పీకర్ తమ్మినేనితో విభేదిస్తూ.. మొన్నటి వరకూ ఈ ముగ్గురూ ఎవరికి వారుగా పార్టీ కార్యక్రమాలు  చేసుకుంటూ వచ్చేవారు.  క్యాడర్ శ్రమను స్పీకర్ గుర్తించడం లేదని వేరు కుంపటి పెట్టిన వైకాపా నేతలు ఎవరికీ వారు ఈ ఎన్నికల్లో  టికెట్ కోసం క్యాడర్ ను సైతం మూడు ముక్కలు చేసి తమ  ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

గడచిన సాధారణ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన క్షణం నుంచీ పార్టీలో స్పీకర్ తమ్మినేని వర్గపోరు ఎదుర్కుంటూనే ఉన్నారు. గెలిపించిన నేతలకు విలువ ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాలలో   గుర్తింపు ఇవ్వడం లేదని ఇద్దరు సీనియర్ వైసీపీ నేతలు స్పీకర్ కు వ్యతిరేకంగా నాలుగేళ్ల క్రితమే పార్టీలో సొంత కుంపట్లు ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా మొన్నటి వరకూ మూడు పార్టీ ఆఫీసులు ఆమదాలవలస నియోజకవర్గంలో నడుస్తూ ఉండేవి.. 

నాలుగేళ్ళుగా తమ్మినేని తీరుని బహిరంగంగానే వ్యతరేకిస్తూ.. ఈ ఎన్నికల్లో టికెట్ ను ఆశిస్తూ స్థానిక నేతలు  నేతలు సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్ లు పర్యటనలు చేస్తూ వచ్చారు... మండల స్థాయి నేతలను తమ గ్రూపులలో చేర్చుకుని  ఎవరికీ వారు తమ క్యాడర్ ను బలపరుచుకుంటూ.. క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ అధిష్టానం ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నాలు చేశారు.. అయితే చాలా నెలల హైడ్రామా తరువాత.. ఇటివల ప్రకటించిన వైకాపా అభ్యర్ధుల జాబితా లో తిరిగి  తమ్మినేని పేరునే అముదాలవలస పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో స్థానిక నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఆమదాలవలస వైసిపి నేత సువ్వారి గాంధీ.. తన క్యాడర్ తో సహా పార్టీకి రాజీనామా చేసి.. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తానని  స్పష్టం చేశారు. 

 ఆమదాలవలస లో స్పీకర్ తమ్మినేనితో విభేదించి నాలుగేళ్ల క్రితమే తన వర్గాన్ని తాను ఏర్పాటు చేసుకున్న  వైసిపి నేత సువ్వారి గాంధీ.. పార్టీలో తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.  చాలా చోట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మద్దతును కూడగట్టుకున్నారు.  తీరా ఇప్పుడు ఆమదాలవలస అభ్యర్ధిగా స్పీకర్ తమ్మినేనినే జగన్ ఖరారు చేయడంతో  ఆమదాలవలస ఫ్యాన్ పార్టీ మూడు రెక్కల దిగువ ఉన్న క్యాడర్ లో తన అనుయాయులతో కలసి సువ్వారి గాంధీ రెబల్ గా అవతారం ఎత్తారు.  ఇప్పటికే అభివృద్ధి లేదనే ఆరోపణలకు తోడు అనేక సమస్యలతో సతమతమవుతున్న స్పీకర్ తమ్మినేనికి సువ్వారి గాంధీ రూపంలో ఇప్పుడు మరో గట్టి జలక్ తగిలింది.

 

By
en-us Political News

  
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.