వైసీపీ ఎంపీల కాషాయం బాట?.. కారణమేంటంటే?

Publish Date:Jun 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం అనిపించే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే రాజకీయ పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ నుంచి త్వరలో భారీ వలసలు ఉండే అవకాశం ఉందన్న చర్చ ఏపీ రాజకీయవర్గాలలో జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీకి చెందిన  ముగ్గురు కీలక ఎంపీలు త్వరలోనే కాషాయం కండువా కప్పుకోనున్నారన్న వార్త  ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది.  గత ఎన్నికల తర్వాత ఏపీలో  అధికార పగ్గాలు చేపట్టిన తెలుగుదేశం కూటమి తిరుగులేని ఐక్యతతో ముందుకు సాగుతోంది. అయితే..  ఆ ఎన్నికలలో ఘోర పరాజయం పాలై, కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోని వైసిపి పరిస్థితి మాత్రం నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారింది.  ఇప్పుడు తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీలు బీజేపీ గూటికి చేరనన్నారన్నవార్తలు గట్టిగా వినిపిస్తుననాయి.   పార్లమెంటు ముంగిటకు రానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోనుందన్న వార్తలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

 పునర్విభజన బిల్లు  ఆమోదం పొందితే, ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా దాదాపు 80 అసెంబ్లీ స్థానాలు,  13 లోక్ సభ స్థానాలు పెరిగే  అవకాశం ఉంది.  ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గాలు పెరిగితే, భవిష్యత్ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీకిి  బలమైన అభ్యర్థుల అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోని కీలక నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని అంటున్యనారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో ఆ పార్టీ నేతలకు తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోలన మొదలైందిజ ఈ నేపథ్యంలోనే వచ్చే కొద్దిరోజులలో  వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు.  

ఈ మారుతున్న పరిణామాలను గమనించిన జనసేన పార్టీ ఇప్పటికే ప్రత్యేకంగా ఒక చేరికల కమిటీని ఏర్పాటు చేసి, వలసలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి  ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే వచ్చే రాజకీయ లబ్ధిని అందిపుచ్చుకోవడానికి ఈ ఎంపీలు కమలం గూటికి చేరడమే ఉత్తమ మార్గమని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

డీలిమిటేషన్  బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరగడం అన్నది కేవలం నంబర్స్ మాత్రమే కాదు.. అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసే కీలక పరిణామంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే..   వైసిపికి, ఆ పార్టీలో కొనసాగితే.. తమకూ రాజకీయ భవిష్యత్ లేదని భావిస్తున్న ఆ పార్టీకి చెందిన నేతలు.. పార్టీ మారడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే ముగ్గురు వైసీపీ ఎంపీలు కమలం గూటికి చేరడానికి రెడీ అయిపోయారని చెబుతున్నారు. అయితే  ఈ వలసల పర్వం ఈ ముగ్గురితో ఆగే అవకాశం లేదనీ, ముందు ముందు మరింత మంది వైసీపీయులు కూటమి పార్టీలలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.