హెచ్1బి వీసాలపై మూడేళ్లు నిషేధం.. అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల బిల్లు

Publish Date:Apr 24, 2026

Advertisement

అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలు కనే భారతీయ ఐటీ నిపుణులకు భారీ షాక్. తగిలింది. అమెరికా ప్రతినిధుల సభలో   "ఎండ్ హెచ్-1బీ వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2026" పేరుతో రిపబ్లికన్ పార్టీ సభ్యుడు ఎలీ క్రేన్ ప్రవేశపెట్టిన బిల్లు.. ప్రస్తుత వీసా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా కొత్త వీసాల జారీపై మూడేళ్ల పాటు పూర్తిస్థాయిలో నిషేధం విధించాలన్న ప్రతిపాదన  ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏటా అందుబాటులో ఉన్న 65,000 హెచ్-1బీ వీసాల సంఖ్యను   25,000కు కుదించాలని బిల్లే పేర్కొంది.  అంతేకాకుండా..  ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతిని రద్దు చేసి, కేవలం అత్యధిక వేతనం పొందే నిపుణులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. హెచ్-1బీ వీసా పొందాలంటే కనీస వార్షిక వేతనం 2 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 1.66 కోట్ల రూపాయలు ఉండాలన్న  నిబంధన విదేశీయులకు పెద్ద అడ్డంకిగా మారనుంది.

ఉద్యోగులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ బిల్లు చేదువార్త మోసుకొచ్చింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, పిల్లలకు ఇచ్చే డిపెండెంట్ వీసాలను పూర్తిగా నిషేధించాలని, అలాగే వీసాదారులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోకుండా అడ్డుకోవాలని  కూడా బిల్లులో ఎలీక్రేన్ ప్రతిపాదించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపయోగపడే  ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ ) ప్రోగ్రామ్‌ను కూడా రద్దు చేయాలని ఆయనా బిల్లులో ప్రతిపాదించారు.  

అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను విదేశీయులు తక్కువ వేతనాలకే తన్నుకుపోతున్నారన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు కోరుతున్నట్లు ఎలీ క్రేన్ స్పష్టం చేశారు. భారీ కార్పొరేట్ సంస్థల లాభాల కంటే స్వదేశీ పౌరుల ప్రయోజనాలే ముఖ్యమని రిపబ్లికన్ సభ్యులు వాదిస్తున్నారు. విదేశీయుల స్థానంలో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత దక్కాలన్నది వారి ప్రధాన డిమాండ్. 

By
en-us Political News

  
టెక్ రంగానికి ప్రాణాధారమైన హెచ్-1బీ వీసాల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఏడాదిలో వీసాల జారీ 25 శాతం తగ్గడమే కాకుండా.. పిటిషన్లపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధించడం వల్ల కంపెనీల దరఖాస్తులు ఏకంగా 87 శాతం పడిపోయాయి. దీనివల్ల ప్రతిభామంతులైన భారతీయ యువతకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు దక్కడం గగనంగా మారుతోంది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
డొనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన ప్రవాస విధానాలు మరింత కఠినతరమయ్యాయి. అమెరికా ఫర్ అమెరికన్స్ ఓన్లీ అనే రాజకీయ నినాదం, వాస్తవానికి వలస వ్యతిరేక భావజాలానికి అధికారిక ముద్ర వేసినట్లుగా అనేక విశ్లేషకులు అంటున్నారు.
ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు ఆర్థిక సహాయం ప్రకటించారు.
రాజమహేంద్రవరం వేదికగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
గతంలో విలీన ప్రక్రియ ప్రారంభమైనా, అది పూర్తిస్థాయిలో అంటే సివిల్ సర్వీస్ క్యాడర్‌తో సమానంగా.. జరగలేదని భావిస్తున్నారు కార్మికులు. ఆర్టీసీ సిబ్బందిని పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
ఏపీ సి ఐ డి తన విచారణ లో భారీ స్థాయిలో అక్ర మాలు జరిగినట్లు నిర్ధారించడంతో ఈడీ చర్యలు మరింత వేగం పుంజుకు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు హైదరా బాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్70లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో నగరం లోని మరికొందరు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా అధికారులు రికార్డులు, డిజిటల్ పరిక రాలు, ఆర్థిక లావాదే వీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇండియాలోనూ రోబోల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తమిళనాడులోని కాంచీపురంలో దేశంలోనే మొట్టమొదటి డార్క్‌ ఫ్యాక్టరీని పాలిమాటెక్అ నే సంస్థ ప్రారంభించింది.
గత మార్చిలో భారత్ రష్యా నుండి రోజుకు సుమారు 2.25 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది, ఇది ఇప్పటివరకు నమోదైన గరిష్ట స్థాయి. ఈ నెలలో ఏప్రిల్ మాసంలో కూడా రోజుకు 2.1 మిలియన్ బ్యారెళ్ల సరఫరా కొనసాగుతుందని అంచనా. ప్రస్తుతం భారత మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 50 శాతానికి చేరుకుంది. తక్కువ ధరకు లభిస్తున్న ఈ చమురు.. దేశ ఇంధన బిల్లు భారాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.
భారత్, రష్యా నౌకలకు రక్షణ నష్టపరిహార కవరేజీ ఇవ్వగల ఆమోదిత బీమా సంస్థల సంఖ్యను 11కి పెంచింది. వీటిలో గాజ్ప్రోమ్ ఇన్సూరెన్స్, రోస్గోస్స్ట్రాఖ్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయి.ఈ ఇన్సూరెన్స్ కవరేజి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ చెల్లుబాటు అవుతుంది. అలాగే బ్యాలెన్స్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ చెల్లుబాటు ఈ ఏడాది ఆగస్టు 19 వరకూ ఉ:టుంది. సోగ్లాసీ, స్బేర్బ్యాంక్ ఇన్సూరెన్స్, ఉగోరియా, ఏఎస్టికె ఇన్సూరెన్స ల కవరేజీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకూ, అలాగే.. విఎస్కె, సోగాజ్, అల్ఫాస్ట్రాఖోవానియే, ఇంగోస్స్ట్రాఖ్ ల కవరేజీ కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పొడిగించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెమూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే తమ సహచర కార్మికుడు మరణించాడని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌గౌడ్ మృతితో కార్మికుల నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా కొందరు కార్మికులు నిరసనగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు.
ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ 22, డెవాల్డ్ బ్రెవిస్ 21 పరుగులు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.