టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. వైసీపీలోకి తోట, మాగుంట
Publish Date:Mar 11, 2019
Advertisement
ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో నేతల జంపింగ్ లు ఊపందుకున్నాయి. ఇన్నిరోజులు.. గోడ దగ్గర నిల్చొని తమ పార్టీలోనే ఉండాలా? లేక వేరే పార్టీలోకి జంప్ చేయాలా? అని అటూ ఇటూ చూసిన నేతలు.. ఇక సమయం లేకపోవడంతో ఏదోకటి తేల్చేస్తున్నారు. ముఖ్యంగా టికెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు అధికార పార్టీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహాం ఫ్యామిలీ టీడీపీకి గుడ్ బై చెప్పింది. రెండు రోజుల్లో తోట నరసింహం ఫ్యామిలీ వైసీపీలో చేరనుంది. తోట నరసింహాం ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తనకు బదులుగా తన భార్య వాణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ను ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు. కానీ చంద్రబాబు.. జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకే టికెట్ ఫైనల్ చేశారు. ఈ తరుణంలో వాణి ఆదివారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. టికెట్ పై చంద్రబాబు నుండి స్పష్టత రాకపోవడంతో తోట నరసింహాం ఫ్యామిలీ టీడీపీకి గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది. కాకినాడ లేదా పెద్దాపురం అసెంబ్లీ స్థానాల నుండి తోట వాణి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన మంగళవారం నాడు వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైఎస్ జగన్ సుముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/thota-narasimham-family-to-join-ysrcp-39-86213.html





