జగన్ పై మాటల తూటాలు.. ఓ రేంజ్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి రివెంజ్!

Publish Date:Apr 23, 2024

Advertisement

జగన్ పేరు చెప్పగానే ఎవరికైనా ఎం గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రి హోదా. తననూ తన అధికారాన్ని, తన ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయించడం, ఇంకా కోపం తగ్గకపోతే రఘురామరాజుపై జరిగినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా పోలీసులను ఆదేశించడం. కానీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ కు మాత్రం జగన్ పేరు చెప్పగానే కోడి కత్తి, గొడ్డలి గుర్తుకు వస్తాయి. ఇంతకీ ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎవరనుకుంటున్నారా...
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాపులర్ కమేడియన్ గా సినిమాలలో ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత రాజకీయాలవైపు గాలి మళ్లడంతో రాజకీయ వేత్త అవతారమెత్తి వైసీపీ గూటికి చేరి.. 2019 ఎన్నికలకు ముందు  ఆ పార్టీ క్యాంపెయినర్ గా ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నారు. రాజకీయ విమర్శకు ఉండే మర్యాద హద్దు దాటి మరీ విమర్శలు గుప్పించారు.  పార్టీ ప్రచారం అంటూ  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.  నోరున్నది ఎందుకు అంటే రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించడానికే  అన్నట్లు పృధ్వివిరుచుకు పడ్డారు. జగన్ మెప్పు పొందడానికీ, ఆయన దృష్టిలో పడటానికీ అదే మార్గం అనుకున్నారు. మొత్తం మీద పృధ్వీ ప్రచారమే పని చేసిందో..  రాష్ట్ర ప్రజల దురదృష్టమో   ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్  రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.  

సహజంగానే, పార్టీ కోసం అంతగా కష్టపడిన పృధ్విని జగనన్న తనను అందలం ఎక్కిస్తారని ఆశపడ్డారు. అయితే ఆయన ఏమి ఆశ పడ్డారో, ఏమి ఆశించారో ఏమో  తెలియదు కానీ   పృధ్వీ పడిన కష్టానికి తగినదో కాదో  మొత్తం జగన్ మాత్రం పృధ్వికి మొండి చేయి చూపించకుండా ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి  ఇచ్చారు. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందనుకోండి అది వేరే సంగతి.  

ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి  జగన్ పృధ్విని తప్పించారు.   ఎస్వీబీసీ నుంచి  గెంటేసిన తర్వాత  వైసీపీలో ఆయ న్ని పట్టించుకున్నవారు లేరు. మరో వంక నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందు చూసుకోకుండా, చిందులేసిన పాపానికి  ఇండస్ట్రీ కూడా పృధ్విని దాదాపు వదిలేసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే..  ఫృధ్వి ఎదుర్కొన్న లాంటి విమర్శలే ఎదుర్కొన్న అంబటి రాంబాబు మంత్రిగా పదోన్నతి పొంది కొనసాగుతున్నారు.  అది పక్కన పెడితే  వైసీపీ వదిలిం చేసుకున్న తరువాత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడినట్లుంది.  

ఈ ఎన్నికల ముందు ఆయన వైసీపీ లక్ష్యంగా జనసేన తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను ఓ ఆటాడేసుకుంటున్నారు.  జగన్ లక్ష్యంగా కొన్ని ఆయన సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. 

ఇటీవల జగన్ పై జరిగిన రాయిదాడి ఘటన అనంతరం పృధ్వి చేసిన వ్యాఖ్యలు వైసీపీని నవ్వుల పాలు చేశాయి.  జగన్ అంటే ఎవరికైనా కోడి కత్తి, గొడ్డలి, కత్తి గుర్తుకు వస్తాయి కానీ గులకరాళ్లు గుర్తుకురావు అంటూ సెటైర్లు వేశారు.   మొత్తం మీద జనసేన తరఫున ఫృద్వి చేస్తున్న ప్రచారానికి జనం నుంచి స్పందన అయితే వస్తున్నది. పృధ్వీయే నటించిన ఓటుతో జగన్ ను ఇంటికి పంపడం మాత్రమే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అంటూ జనసేన రిలీజ్ చేసిన టీజర్ కు కూడా విశేష స్పందన లభించింది. మొత్తం మీద పృధ్వీ జగన్ పై ఓ రేంజ్ లో రివెంజ్ తీర్చుకుం టున్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. 

By
en-us Political News

  
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
ఏపీ ఇన్‌ఛార్జ్ డీజీపీగా శంఖబ్రతా బాగ్చి నియమితులయ్యారు. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి డీజీపీని నియమించేవరకు బాగ్చి డీజీపీ
చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (మే6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
డాక్టర్ గౌతమ్ అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ వెంకట మనోజ్ఞకు భర్త. ఈ మేరకు ఆయన ఆదివారం నాడు ఒక షాకింగ్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన... ‘‘నాపేరు డాక్టర్ గౌత్. నేను సిట్టింగ్ ఎమ్మెల్యే, మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుడిని.....
కాపులందరికీ తానే ప్రతినిధినని చెప్పుకునే ముద్రగడ పద్మనాభాన్ని ఆయన కుమార్తె క్రాంతి తీసి అవతల పారేసిన విషయం తెలిసిందే
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.