పాజిటివ్ థింకింగ్ పవర్ ఇదే..

Publish Date:Sep 13, 2023

Advertisement

సానుకూలంగా ఆలోచించడం చాలామందికి చేతకాదు. ఎంతోమంది పనులు మొదలు పెట్టడం నుండి ఒకటే అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే సానుకూలంగా ఉండటం లేదా పాజిటివ్ ఆలోచనలతో ఉండటం అనేది మనిషిని కొత్తగా ఆవిష్కరిస్తుంది. కౌరవుల సైన్యం చాలా పెద్దది మేము అస్సలు యుద్దం చెయ్యము అని పాండవులు వెనకడుగు వేసి ఉంటే మహాభారత యుద్దమనేది జరిగి ఉండేది కాదు.  నాకు కాళ్లు చేతులు చచ్చుబడిపోయాయి, ఇక నేను ఏమీ చెయ్యలేను అనుకుని ఉంటే అంతరిక్షంలో రహస్యంగా ఉన్న కృష్ణబిళాల గురించి స్టీఫెన్ హకింగ్ పరిశోధనలు చేసేవాడు కాదు. ఇలా చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు అనుమానాలతో, సందేహాలతో  అలా గొప్పగా మారలేదు. దీని వెనుక సానుకూల ఆలోచన అని చెప్పబడే పాజిటివ్ థింకింగ్ చాలా ఉంది. పాజిటివ్ థింకింగ్ గురించి, దాని గొప్పదనం గురించి, అది మనుషుల జీవితాల్లో కలిగించే మార్పుల గురించి తెలియజెప్పే ఉద్దేశంతో ప్రతి యేడు సెప్టెంబర్ 13న పాజిటివ్ థింకింగ్  డే జరుపుకుంటారు. ఈ రోజున ఏం చేయవచ్చో, దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, దీని వల్ల  కలిగే లాభాలేంటో  పూర్తీగా తెలుసుకుంటే..

పాజిటివ్ థింకింగ్..

పాజిటివ్ థింకింగ్ అనే పేరులోనే ఒకానొక సానుకూల భావన ఉంది. ఇది మనిషికి ఎలాంటి ఒత్తిడిని, ఆందోళనను కలిగించదు. చేసేపని ఏదైనా సరే పాజిటివ్ గా ఆలోచించి చేస్తే ఆ ఆలోచనతోనే సగం విజయం సాధించినట్టు. పాజిటివ్ గా ఆలోచిస్తూ మనిషి చేసే ప్రయత్నాలలో మనిషి పనితీరు పరిపూర్ణంగా ఉంటుంది. వ్యక్తి తన పూర్తీ సామర్థ్యాన్ని  పనిని పూర్తీ చేయడానికి ఉపయోగిస్తాడు. కాబట్టి చేసేపనులలో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. అయితే ఎవరో చెప్పారని కొందరు, ఆ పని వల్ల లాభం  ఉంటుంది కాబట్టి చేయడం మంచిదని మరికొందరు,  గొప్పలు చెప్పుకోవడానికి అయిష్టంగానే మరికొందరు  కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా మనసులో ఏ మూలో ఇష్ఠం ఉండదు కాబట్టి ఆ పనిని అంత సమర్థవంతంగా పూర్తీ చెయ్యలేరు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేముందు ఎలాంటి ప్రభావానికి, మరేవిధమైనా ప్రలోభాలకు లోను కాకుండా చూసుకోవాలి.

మానసిక ఆరోగ్యం..

పాజిటివ్ ఆలోచన అనేది గొప్ప ఔషదమే అనుకోవచ్చు. పెద్ద పెద్ద జబ్బులు ఉన్నవారు కూడా పాజిటివ్ థింకింగ్ కారణంగా  వాటిని చాలా సులువుగా జయించగలుగుతారు. ఎంతో మంది  మృత్యు ఒడి దాకా వెళ్లి తిరిగి బయటపడుతున్నారు అంటే అది వారి సానుకూల ఆలోచన ప్రభావమే.  మనిషిని మానసికంగా ఒత్తిడికి లోనుకాకుండా దృఢంగా ఉండేలా చేయడంలో సానుకూల ఆలోచన ఎంతో గొప్పది. పాజిటివ్ గా ఉంటూ మంచినీరు తీసుకున్నా అది గొప్ప ఔషదంలా పనిచేస్తుంది. గొప్ప ఔషదాన్ని అయినా చాలా నెగిటివ్ గా తీసుకుంటే అది అస్సలు శరీరం మీద ప్రభావం చూపించదు. ఇదీ పాజిటివ్ ఆలోచనలో ఉన్న గొప్పదనం.

సానుకూలమే విజయానికి  సోపానం..

ఎంత బాగా చదివినా సరే చాలామంది పరీక్ష హాలులో వెళ్లేసరికి అన్నీ మరచిపోయాం అంటుంటారు. మరికొంతమంది నేను చదివినవే వచ్చాయి కానీ అక్కడ సమాధానాలు గుర్తురాలేదు అంటారు. వీటన్నింటికి కారణం ఒకటే.. అదే పరీక్షలలో నేను చదివినవి రావేమో అనే నెగిటివ్ ఆలోచన. మనిషి మెదడు పదే పదే ఏ విషయాన్ని అయినా పదిసార్లు మననం చేసుకుంటే ఆ వలయంలో పడిపోతుంది. పరీక్షలు రాసేవారు ఎంత చదివినా, ఎంతబాగా సన్నద్దం అయినా మనసులో ఏ మూలో  నేను చదివినవి రావేమో నా అదృష్ణం ఎలాగుందో అనుకుంటే చివరికి ఆ అదృష్టం ప్రశ్నార్థకమే అవుతుంది.

ఇది కేవలం పరీక్షలకు మాత్రమే కాదు. ఉద్యోగం కోసమయినా, బంధాలలో అయినా, సమాజ పరమైన విషయాలు అయినా పాజిటివ్ గా ఉన్నప్పుడే సానుకూల ఫలితాలు సాధ్యమవుతాయి.

                                                        *నిశ్శబ్ద.

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.