మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు !!

Publish Date:Nov 12, 2021

Advertisement

సినిమా పాట హమ్ చేయడం లేదండోయ్!! మరైతే ఏంటీ?? అంటారా అది చెప్పడానికేగా ఇప్పుడు ఇక్కడ ఇలా మీ ముందు.మనం మన చుట్టూ ఉన్న చాలామంది తమ ప్రణాళికలలో రేపు ఏంటి?? రేపు ఏమి చేద్దాం,

ఆ తరువాత ప్లాన్స్ ఏమిటి??

ఇలాంటి ఆలోచనలతో మునిగిపోయి ఉంటారు. లేదూ కొంతమంది అదే రోజు గురించి పని చేస్తున్నా, ఇతర ఆలోచనలతో ఉన్నా పూర్తిస్థాయి సాటిసిఫాక్షన్ తో ఉండరు. ఎందుకిట్లా అని ఆలోచన చేసారా ఎప్పుడైనా?? దానికి సమాధానం సులువుగా చెప్పాలంటే మనిషికి ప్రస్తుతం తనదగ్గర ఉన్నదానికంటే తనదగ్గరలేని దాని గురించి, ఎక్కడో ఉన్నదని గురించి ఆసక్తి ఎక్కువ, దానిమీద అంచనాలు ఎక్కువ. ఇంకా గట్టిగా చెప్పాలంటే రేపటి గురించి ఆశ ఎక్కువ. నిజానికి మనిషిని బతికించేది ఆశ అయినపుడు ఆశపడటంలో తప్పు లేదు.

కానీ ప్రస్థుతాన్ని నిర్లక్ష్యం చేస్తూ రేపటి విషయాల గురించి ఆశపడటం అంటే ఇంకా విత్తని విత్తనాల క్రమం గురించి ఆలోచిస్తూ భూమిని సరిగా దున్నకపోవడమే. భూమి సరిగా దున్నలేదు అనుకోండి, విత్తనాలు సరిగా వేయలేరు, ఆ తరువాత వర్షం కురిసినా విత్తనాలు మొలకెత్తవు, పంట పండదు. ఇక్కడ జరిగింది ఏమిటి?? జరగని పనిని ఆలోచిస్తూ జరిగే పనిని నిర్లక్ష్యం చేయడం వల్ల తగిన పలితం రాకపోగా, సమయం మొత్తం వృథా చేసినట్టు. ఒక అవకాశాన్ని చేజార్చుకున్నట్టు. సరిగ్గా చాలామంది జీవితంలో ఇదే చేస్తున్నారు. ప్రస్థుతంలో రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజును నిర్లక్ష్యం చేస్తున్నారు.

దాని ఫలితం ఏమిటి??

ఎంతో ఆలోచన చేసిన రేపు కూడా ఆశించిన విధంగా లేకపోవడం. ఎన్నాళ్ళు గడిచినా ఇలా సరైన ప్రణాళిక సాగకుండా నిరాశలో మిగిలిపోవడం. ఇప్పుడు అర్థం అయ్యింది కదా మనిషి నిరాశకు కారణం ఏమిటి అనేది కూడా.

అయితే ఇప్పుడేం చేయాలి??

ప్రస్థుతాన్ని అంటే ఈరోజును ఎంత బాగా ఉపయోగించుకోగలిగితే రేపు అంతకంటే బాగా మీ ముందు ముస్తాబవుతుంది. రోజులో ఉన్న 24 గంటల్లో సూర్యోదయం నుండి, నిద్రపోయేవరకు మీకున్న సమయం ఎంత?? సాధారణంగా అందరూ నిద్రపోవడానికి ఉపయోగించే 6 లేదా 8 గంటలు మినహాయిస్తే రోజులో ఉండే18 లేదా 16 గంటలను ఏమి చేస్తున్నారు?? ప్రతి రోజు ఏ పని ఎంతసేపు చేస్తున్నారు?? మీ 18 లేదా 16 గంటల పలితం ఏమిటి?? దానికి మీరు సరైన న్యాయం చేసారా?? ఇక్కడ ఒక విషయం గమనిస్తే ర్యాంకులు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్ కు, ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ కు, అట్లాగే మంచి ఎంప్లాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉద్యోగస్తుడికి, సాధారణ ఉద్యోగస్తులకు.

ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ కాలమానం ఒకటే అందరికి 24 గంటలు ఉన్నాయి. దీనికి కులము, మతము, లింగ వివక్ష అంటూ ఏమీ తేడా లేదు. అలాంటప్పుడు అందరూ ఒకేలా ఎందుకు లేరు??  కొందరు ఏవో కారణాలు చెబుతారు. బహుశా వారు చెప్పినట్టే అందరికి అన్ని వనరులు, వసతులు, సౌకర్యాలు ముఖ్యంగా డబ్బును బట్టి చేకూరే ప్రయోజనాలు అందుబాటులో లేకపోవచ్చు.

కానీ అన్ని ఉండి కూడా పనికిరానట్టు ఉన్నవాళ్ల సంగతి ఏమిటి?? 

ఇట్లా ఆలోచిస్తే అందరికి వస్తాం ఏమిటి అనేది అర్థం అవుతుంది. లోపం ఎక్కడుందో క్షుణ్ణంగా తెలిసిపోతుంది. ఫలితంగా  తమని తాము సరిదిద్దుకునే మార్గం కనిపిస్తుంది, లేకపోతే వెతుక్కునే ఆలోచన కలుగుతుంది. ఇవన్నీ జరిగితే ప్రస్తుతం అంటే ఈరోజు ఎంత గొప్పదో… దాని విలువ ఏమిటో… దాని ప్రాధాన్యత ఎలాంటిదో చాలా బాగా తెలుస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని చెప్పింది. ఈరోజును ఎంత బాగా మలచుకుంటారో అంత గొప్ప ఫలితం మీ సొంతం. 

◆వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.