అక్షరం మీద అవని!!

Publish Date:Nov 11, 2021

Advertisement

ప్రపంచ దేశాల మధ్య అన్ని రంగాలలో పోటా పోటీ కొనసాగుతూనే వుంటుంది. విద్య, వైద్యం, వ్యాపారం, పారిశ్రామికం ఇలా ఎన్నో….  ఒక్కొక్క రంగంలో నిపుణత సాధించడానికి ఎన్నో అవగాహనాలు, విశ్లేషణలు, పరిశీలనలు, ప్రయోగాలు చాలానే ఉంటాయి. అయితే రంగం ఏదైనా అందులో అన్ని తెలుసుకోవాలన్న దేశ కాలమాన పరిస్థితులను అంచనా వేయాలన్న ఆలోచనతో పాటు చదువు కూడా ఉండాలి. ఏదో దేశాలు ఉద్ధరించడానికి కాకపోయినా కనీసం ప్రతిమనిషి తన జీవితానికి ఆహారం, నీరు, అవసరాలు ఎలా ఉన్నాయో అలా చదువుకోవడం కూడా ముఖ్యమేనని, అది ప్రతి మనిషి హక్కు అని ప్రపంచ విద్యా దినోత్సవం నాడు గుర్తుచేసుకోవలసిన విషయం.

నవంబర్ 11 ప్రపంచ విద్యా దినోత్సవంగా యావత్ ప్రపంచ దేశాలు విద్య ఆవశ్యకతను గుర్తిస్తూ తమతమ దేశాలలో అక్షరాస్యతను పెంచుకునేందుకు కలిగించే అవగాహనా దినోత్సవంగా చెప్పుకోవచ్చు. ఇక మన దేశం గురించి చెప్పుకుంటే విద్యను సామాజిక హక్కుగా, అది అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఒకానొక వనరు స్థానం నుండి దాన్ని మళ్ళీ కేవలం డబ్బుతో కొనుక్కునే వస్తువుగా ఎన్నటి నుండో పరిగణిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం విద్య అందరి హక్కు అని, అందరికి అందుబాటులో ఉండాలని అది తమ లక్ష్యమని చెబుతున్నా ఆచరణలో మాత్రం విఫలం అవుతూ వస్తుంది. ప్రయివేటు విద్యాసంస్థలు అధికం కావడం, విద్య ఖరీదు రెక్కలు తొడగడమే దీనికి కారణం అని చెప్పవచ్చు. అయితే సాధారణ పౌరుల్లో సామాజిక విద్య పట్ల అవగాహన పెంపొందించడం సాటి పౌరులుగా అందరి బాధ్యత అనే విషయం మరచిపోకూడదు. 

ఇప్పట్లో ప్రభుత్వ బడులలో కూడా నాణ్యమైన విద్య అందించడానికి ప్రాణాళికలు బాగానే జరుగుతున్నాయి. కొన్నిచోట్ల స్వార్థం వల్ల వాటిని అమలుపరచడంలో సమస్యలు తలెత్తుతున్నాయేమో కానీ మండల, జిల్లా స్థాయి పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. బడి పిల్లలకు పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్ లు, రిజర్వేషన్ లు, ఇవి మాత్రమే కాకుండా ప్రయివేట్ పాఠశాలలు మరియు కాలేజి పిల్లలకు కూడా రీయింబర్స్మెంట్ రూపంలో పూర్థిస్తాయి నాణ్యమైన విద్య అందే మార్గాలు ఎన్నో ఉన్నాయి. 

అయితే దేనికైనా అవగాహన ముఖ్యం అన్నట్టు విద్య దాని ప్రయోజనాలను గురించి తెలుసుకోవాలి మరియు తెలియజెప్పాలి

వేగవంతమైన ఈ ప్రపంచంలో విద్య ద్వారా మనిషి స్థాయి ఎలా ఇనుమడిస్తుందో, ఎలా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందో కొండశ్రీ జీవితాలను చూస్తూ తెలుసుకోవాలి

పేదరికం విద్యకు ఎప్పుడు అడ్డంకి కాదని, దిగువ కులాలకు ఇచ్చిన ఎన్నో ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ చదువులో ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అని ఎందరో జీవితాలు ఉదాహరణగా ఉన్నాయి. వారి గురించి వివరించాలి. 

ప్రతి పిల్లవాడికి లింగ బేధం లేకుండా కనీస విద్యార్హత వరకు చదువు చెప్పించడం ద్వారా వారి జీవితం ఎంతో ఆశావాహంగా సాగుతుందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి.

విద్య ద్వారా ప్రపంచాన్ని, ప్రపంచ పరిస్థితులను, కాలాన్ని అంచనా వేస్తూ దానికి తగ్గట్టు తమ సామర్త్యాన్ని వినియోగించడం ద్వారా గొప్ప జీవితం సొంతమవుతుంది.

ఇలా అన్ని విధాలుగా అన్ని కోణాలలో ఆలోచించి విద్య పట్ల అవగాహన పెంపొందిస్తే మన భారతదేశంలో అక్షరాస్యత రేటు పెరిగి అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచ అభివృద్ధి  మొత్తం విజ్ఞానం పైననే ఆధారపడి ఉంది ఇప్పుడు.

◆ వెంకటేష్ పువ్వాడ

By
en-us Political News

  
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.