ఇద్దరూ ఇద్దరే.!

Publish Date:Nov 7, 2022

Advertisement

నటన సినీనటులకే పరిమితం కాదు. రాజకీయాల్లోనూ నటుటు, మహానటులు ఉన్నారు. తాజా ఉదా హరణతెలంగా ణా కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి.  తమ్ముడికోసం ఏదయినా చేస్తా అనే పాత సినిమా డైలాగే ఈయనకు సూట్ అవుతుంది. అవును. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటపడడంతో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. సోదరుడు రాజగోపాల్ కి కాంగ్రెస్ వ్యవహారాలు నచ్చక బీజేపీ లోకి మారారు. బీజేపీ సీనియర్లు ఈయన రాకతో ఘన విజయం సాధించ గలమనే అనుకున్నారు, తర్వాత సందేహించారు.. చివరగా ఓడిపోయారు.  సరిగ్గా ప్రచారం ఊపం దుకున్న సమయంలో తన పార్టీకి  కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రచారం చేయలేదు. ఎన్నికల ప్రచారం కంటే విదేశీ పర్యటన అత్యవసరమయింది. పైగా మునుగోడు ఎన్నిక ముందు వరకూ కనిపించననీ అన్నారు. అన్నట్టే చేశారు.  వెళ్లినాయన ఊరికినే తన స్నేహితు లతోనో, బంధువులతోనో తిరిగి సరదాగా గడపకుండా అక్కడి నుంచి గొప్ప వార్త ప్రచారం చేసేరు.. మునుగోడులో మా వాళ్ల రావడం కష్టం సుమా.. అంటూ.  ఇదే పార్టీ వర్గాలను మరింత కుంగదీసింది. అసలే పార్టీ ఎంపిక చేసిన అభ్యర్ధి గెలుపు కాస్తంత కష్టమేనన్నదీ లోలోపల పార్టీ నాయకునికీ ఉన్పప్పటికీ ఆమె తండ్రి పెద్ద నాయకుడు కనుక ఆయన ప్రభతో ప్రచారం సాగించి సాధించవచ్చని అనుకున్నారు. కానీ చతికిల పడ్డారు కాంగ్రెస్ వారు. 

టీఆర్ ఎస్ గెలిచింది. బీజేపీ ఓడింది. కానీ మెజారిటీ పరంగా టీఆర్ఎస్ కి పెద్దగా సంతృప్తి నివ్వలేదు, బీజేపీ వారికి రవ్వంత ఆనందాన్నిచ్చింది. కానీ బాగా నవ్వుకుంది మాత్రం కోమటి రెడ్డి బ్రదర్స్ అనాలి. చెరో పార్టీలో ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీ లూ ఓడినప్పటికీ  కేసీఆర్  కంటే ఎంతో ఆనందిస్తున్నారిద్దరూ.  అన్నగారికి తమ పార్టీ ఓడినందుకు కాదు, తమ్ముడు గెలవబోయి గెలుపు గేటు దగ్గర పడిపోయినందుకు ఆనందం.. కేసీఆర్ కి బీజేపీ మెరుగుపడిందని బాధ, కాంగ్రెస్ రేవంత్ కి పార్టీని మరీ దారుణ పరిస్థితికి దిగజార్చేనని బాధా ఉండవచ్చు.  అయితే వెంకట రెడ్డి ముందే ఇవన్నీ ఊహించే సమయానికి తగిన ప్రాంతం ఎంచుకుని పారిపోయారనాలి. దగ్గరుండి ఓటమి కి ప్రచారం చేసుకునే కంటే ఓటు వేయడం మంచిదనే అనుకున్నారనుకోవాలి. 

సోదరుడు గెలుస్తాడన్న నమ్మకం పెద్దాయనకు ఉండకపోలేదు. కానీ తమ్ముడు మారిన పార్టీ వారికే ఆయన మీద నమ్మకం సన్నగిల్లింది. అందుకే ప్రచారం పేరుతో బీజేపీ సీనియర్లంతా యాత్రలు చేశారు. ఇదంతా గమనిస్తూ సోదరుడు గెలుస్తాడన్న నమ్మకం వెంకటరెడ్డికీ వచ్చి ఉంటుంది. కానీ చివాఖర్న దెబ్బతీసింది. కానీ రేవంత్ ఏదో సాధిస్తాడని డబ్బాకొట్టుకున్న తన పార్టీవారికి డిపాజిట్ గల్లంతుకావడం విడ్డూరమే.  అంత భారీ ప్రచారాలు, భారీ ప్రసంగాలు ఓటరుని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. తనను స్టార్ కాంపెనీర్ గా పెట్టుకుని, ఆయనే ముందుండి గెలిపిస్తారని కాంగ్రెస్ అనుకున్నప్పటికీ, ఆయనకు అంత ప్రాధాన్యతను వాస్తవానికి ఇవ్వలేదన్న ప్రచారమూ ఉంది. పార్టీ, అందునా పురాతన పార్టీలో విభేదాలు ఉండకా పోవు. కానీ సమయం గాని సమయంలో అభిప్రాయభేదా లతోనే స్టార్ కాంపనర్ గారు ఆస్ట్రేలియా పర్యటించడమే పార్టీని నీరసపరిచింది. 

ఎవరో అన్నట్టు తమ్ముడు తమ్ముడే, అన్న మాత్రం అన్నకాదు తమ్ముడి వీరాభిమానే. అందుకే వీరాభి మానం ప్రదర్శించి తమ్ముడి విజయాన్ని ఆశించారు.. వెళుతూ వెళుతూ మావోడిని కాస్తం జూస్కోం డన్నా.. అని చిన్న సందేశం ఓటర్లకు చేరేలా చేసి మరీ పర్యటనకు వెళ్లారు. పార్టీలు వేరయినా సోదర ప్రేమ అంతకు మించి ఉంటుందన్నది కాంగ్రెస్ ఘోర పరాభవం తేటతెల్లం చేసింది.  కోమటిరెడ్డి బ్రదర్స్కి కొంత బాధ కంటే ఆనందమే ఎక్కువ మిగిలిం ది. పార్టీ మారి ఓడినా తన సత్తా ప్రదర్శించానని సోదరుడు తెలియజేశాడు. పెద్దాయన తమ్ముడి విజయాన్ని కాకున్నా విజేత సత్తాని గుర్తించానని ఆనందిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే.

By
en-us Political News

  
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.