అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలంటూ కడప జిల్లా సర్పంచ్ లు ధర్నాలు, ర్యాలీకి దిగారు. సర్పంచ్ల ఖాతాలోకే నిధులు పడతాయి, పనులు చేపట్టవచ్చని ముఖ్యమంత్రి జగన్ అన్న ప్పటికీ ఇంతవరకూ తమ ఖాతాలో నిధులు వేయలేదని సర్పంచ్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. కడప ఏడు రోడ్ల కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. నిధులు వెంటనే విడుదల చేయకుంటే తాము నిరసనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చ రించారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్‌లు, పంచాయతీలకు డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు. పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇప్పటికైన సీఎం జగన్ స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రకాశం జిల్లాలో వైసీపీ సర్పంచ్‌ల నిరసనలు చేపట్టా రు.అర్ధవీడు మండల సమావేశాన్ని బహిష్కరించి అధికార పార్టీ సర్పంచ్‌లు ఆందోళన చేపట్టగా.. కంభంమండలం సర్పంచులు కూడా అదే బాట పట్టారు. మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్క రించి, ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. సర్పంచులుగా గెలిచి ఏడాదిన్నర అయినా ప్రభుత్వం పంచాయతీకి నిధులు ఇవ్వలేదని.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ పంచా యతీ అకౌంట్లను జీరో చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయాలని వారు అప్పట్లో డిమాండ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు లేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని సర్పంచ్‌లు వినూత్నంగా నిరసన చేపట్టారు. నిధుల కోసం సర్పంచ్‌లు మూకుమ్మడిగా వారపు సంతలో బిక్షాటన చేపట్టారు. 14,15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయితీ ఖాతాలలో జమ చేయాలంటూ మండలంలోని సర్పంచ్‌లు నిరసనగళం విప్పారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కేంద్రంలో జరిగిన వారపు సంతలో మండలంలోని సర్పంచ్‌లందరూ బిక్షాటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు కేటా యించవలసిన నిధులను పక్కదారి పట్టించ వద్దంటూ సర్పంచ్‌లు ప్లకార్డులు చేత పట్టుకొని నినాదాలు చేస్తూ.. భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sarpanches-shock-to-jagan-25-146741.html
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.