ఆ పాల‌న మాకొద్ద‌న్న ఏపీ ఓట‌ర్‌! అధికారం టీడీపీ కూట‌మిదే!

Publish Date:May 14, 2024

Advertisement

ఏపీలో జ‌రిగిన‌ పోలింగ్ పై రాజ‌కీయ పార్టీల్లో ఉత్కంఠ‌త పెరిగిపోతోంది.  2019లో  79.64 శాతం పోలింగ్ నమోదైంది. 2014వ సంవత్సరంతో పోల్చితే, 2019లో ఓటింగ్ 1.23 శాతం పెరిగింది. ఫ‌లితం ప్ర‌తిప‌క్ష పార్టీకి 151 సీట్లు వ‌చ్చాయి. అధికార పార్టీ 23 సీట్ల‌తో స‌ర్దు కోవాల్సి వ‌చ్చింది.

ఇక 2019తో 2024 పోలింగ్ ను పోల్చితే 2 శాతం తేడా క‌నిపిస్తోంది. 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో 78.41, రెండోసారి 2019లో 79.64 శాతం న‌మోదయితే ఈసారి 2024 లో పోలింగ్  81 శాతాన్ని దాటిపోయేలా వుంది. దీన్ని బ‌ట్టి ఫ‌లితం ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. తెలుగుదేశం కూటమికి 155 నుండి 160 సీట్లు, వైఎస్సార్సీకి 15 నుండి 21 అసెంబ్లీ సీట్లు, 2 లేదా 3 పార్లమెంటు సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైఎస్సార్సీపికి కనీసం ప్రతిపక్షహోదా కూడా రాకుండా ఓట్లతో అమోఘమైన ప్రజాస్వామిక తీర్పు ఇచ్చారనే టాక్ అయితే న‌డుస్తోంది.

పోలింగ్ జ‌రిగిన తీరు చూస్తే.... ఉప్పెనలా పోలింగ్ బూతులకు జనాలు తరలి వచ్చారు. ముఖ్యంగా  మహిళ ఓటర్లు, వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపితే వారిదే అధికారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళ ఓటర్లు ఎక్కువ. 154 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరే గెలుపోటములను నిర్ణయిస్తారు. ఇక్క‌డ ఓ విష‌యం మాట్లాడుకోవాలి.

2019 ఎన్నిక‌ల్లో మహిళలు పెద్దయెత్తున తరలి రావడంతో తమకు అనువుగా మారుతుందని అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ అంచనా వేసింది. అందుకు కార‌ణం ఏమిటంటే, పసుపు కుంకుమ పేరిట పది వేల రూపాయలు నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేయడంతో ఆ ఓట్లన్నీ తమకేనని అప్పట్లో టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఫ‌లితం మ‌నం చూశాం. టీడీపీ 23 స్థానాల‌తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

సీన్ క‌ట్ చేస్తే 2024 ఎన్నిక‌ల్లోనూ భారీ స్థాయిలో మ‌హిళా ఓట‌ర్లు ఓటు వేశారు. అంటే... ప్రభుత్వంపై వ్యతిరేకత మహిళల్లో ఉంది. 
1. అభివృద్ధి లేకపోవడంతో పాటు 
2. మద్యనిషేధం చేయకపోవడం
3. శాంతిభద్రతల సమస్య‌లు
4. కూట‌మి  మ్యానిఫేస్టోలో పెట్టిన అంశాలు 
5. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 
6. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, 
7. తల్లికి వందనం పేరిట ఎంత మంది కుటుంబంలో ఉన్నా వారందరికీ ఇస్తామని ప్రకటించడం 
8. 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు 1,500 ఇస్తామని చెప్పడం
టీడీపీ కూట‌మికి క‌ల‌సి వ‌చ్చే అంశాలు. అందుకే మ‌హిళ‌లు భారీ ఎత్తున ఓటు వేశారు.

ఏపీలో కుల రాజకీయాలకు ఎన్నికలు పరాకాష్ఠ. వారి కులం వారికే ఓటర్లు తమ ఓటును వేస్తారనేది కాదనలేని వాస్తవం. ఆ కులానికి చెందిన వ్య‌క్తి మంచి చేస్తున్నాడా చేయ‌డం లేదా అనేది ఎవ్వ‌రికీ అవ‌స‌రం లేదు. ఆ నేత తమ కులం వాడు,  అత‌నికే తమ ఓటు అనే ఆలోచనా ధోర‌ణి ఏపీలో చాలా మంది ఓటర్ల‌కు ఉంది. ఉద్యోగులు, కార్మికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కాపు, కమ్మ కులాల ఓటర్లు సాలిడ్ గా టీడీపీ కూటమికి ఓటేసినట్లు ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి ఓటర్లు, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెబుతోంది.  

59 నెలలుగా దాదాపు 2 ల‌క్ష‌ల 75 వేల కోట్ల రూపాయలు 65 లక్షల కుటుంబాలకు అనేక పధకాల ద్వారా చేరాయని జగన్ పదే పదే చెప్పడం, ' మీ కుటుంబానికి మంచి జరిగితే మీరు వోట్ వేయండి.. మీరే ఇతరులకు చెప్పండి !' అని  అన్ని చోట్లా జగనే  చెబుతూ ప్ర‌చారం చేసుకున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక  ఓటు చీలకూడదు అన్న లక్ష్యంతో చంద్ర‌బాబునాయుడు కూటమి ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డ్డారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, రాష్ట్రానికి రాజధాని లేదని,  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రజా వ్యతిరేక చట్టం గా ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లారు. 

వైఎస్ షర్మిల జగన్ చెల్లెలు గా జగన్ ని బాగా ఇరకాటంలో పడేసింది అని చెప్పాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు ను పట్టుకొని ఆయన కుమార్తె Dr సునీత కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారం చేయటం, చివరి రోజు వైఎస్ విజయమ్మ కూడా 'షర్మిల ను గెలిపించండి ' అని మేసేజ్ వదలటం వైఎస్సార్ పార్టీ కి నష్టం కలిగించే అంశాలు. 

ETV, TV5, ABN AndhraJyothi TV ఛానళ్ళు కూటమి వైపు, TV9, NTV, Sakshi TV ఛానళ్ళు వైయస్సార్ పార్టీ కి అనుకూలంగా కధనాలు ప్రసారం చేశాయి.

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.