కప్పు నీదే బిగిలూ..

Publish Date:May 4, 2026

Advertisement

 

విజయం నీదే..సరిలేరు నీకెవ్వరు..

అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు... పోలింగ్ రోజున  హీరో విజయ్ చెన్నైలోని తన ఇంటి నుంచి సైకిల్ తొక్కుకుంటూ బయటకు వచ్చారు... సైకిల్ తొక్కుతూ పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేసి వచ్చారు... తద్వారా తాను రాజకీయాల్లోకి వస్తానని తొలిసారి గా సంకేతం ఇచ్చారు.. అంతకు ముందు కొన్నేళ్ల నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తారు అనే ప్రచారం ఉన్నా పరోక్షంగా అయినా సరే ఓపెన్ గా ఆయన తన రాజకీయ ఉద్దేశాన్ని వెల్లడించారు.  

అప్పుడు  సైకిల్ తొక్కుతూ బయటకు వచ్చిన విజయ్ 

ఐదేళ్ల తర్వాత రాజకీయ తొలి ఇన్నింగ్స్ లోనే అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తొక్కేస్తారని ఎవరూ  ఊహించనే లేదు...50  ఏళ్లుగా తమిళనాడులో  రెండు  మర్రి చెట్లలా బలంగా పాతుకు పోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల కూకటి వెళ్ళ ను ఓ కుదుపు కుదుపుతాడని  అంచనా వేయనే లేదు..

ఎందుకంటే... తమిళుల తిరుగులేని తలైవా రజినీకాంత్ 20 ఏళ్లు రాజకీయాల్లోకి అదిగో వస్తాను... ఇదిగో వస్తాను అని ఊరించి... ఊరించి... ఎట్టకేలకు పార్టీ పెడుతున్నా అని 2020లో   ప్రకటించి... అంత లోనే తోకముడిచేసిన తీరు చూశారు. రాజకీయ పార్టీకి క్లాప్ కొట్టక ముందే ప్యాకప్ చెప్పి... మళ్ళీ సినిమా షూటింగ్ లకు ...షాట్ రెడీ... యాక్షన్...అని అన్నారు.. అభిమానులకు షాక్ ఇచ్చారు.  రజినీకాంత్ అసాధ్యం అనుకున్నది విజయ్ సుసాధ్యం చేసి చూపించారు.

అలాగనీ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీఎంకే)  గెలుపేమీ నల్లేరు మీద నడక ఏమీ కాలేదు. 
విజయ్ పార్టీ ప్రకటించినప్పటి నుంచీ... అటు రాష్ట్రం లో అధికారం లో ఉన్న డీఎంకే ఇటు కేంద్రం లో అధికారం లో ఉన్న  బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టాయి... విజయ్ మొదటి ఎన్నికల సభలో తొక్కిసలాటతో కొందరు చనిపోయారు..అదే అవకాశంగా చేసుకుని ఆయన పై కేసులు పెట్టారు.. తర్వాత పార్టీ  సభలకు అనుమతులు ఇవ్వ లేదు.. ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమి లో చేరాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారు.. అందుకు విజయ్ ఒప్పుకోలేదు.. తమ పార్టీ టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుంది అని తెగేసి చెప్పారు.

ఆ తరువాతే విజయ్  భార్య ( అప్పటికే ఎన్నో ఏళ్ళుగా విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు) ఆయన పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  ఆ ఆరోపణలు దేశం లో  సంచలనం సృష్టించాయి. కానీ తమిళనాడులో మాత్రం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు అన్నది వాస్తవం.. ఎందుకంటే విజయ్ తన భార్య తో ఎన్నో ఏళ్ల క్రితమే విడిపోయారన్నది ఆ రాష్ట్రం లో అందరికీ తెలిసిన విషయమే.. ఎన్నికల ముందు ఆయన భార్య ఆరోపణలు చేయడం వెనుక ఏ పార్టీ పాత్ర ఉందన్నది కూడా ఇట్టే ఊహించారు.. అందుకే ఆ ఆరోపణలు టీవీకే పార్టీ పై ఇటువంటి ప్రతికూల ప్రభావం చూపించ లేదు.

మరో వైపు విజయ్ తన ఎన్నికల ప్లానింగ్ తో చాప కింద నీరులా దూసుకు పోయారు.. ఇతర రాజకీయ పార్టీల అధినేతలకు భిన్నమైన శైలి లో ఆయన ఎన్నికల ప్రచారం సాగించారు.. మీడియాతో పెద్దగా మాట్లాడ లేదు. అసలు ప్రధాన మీడియా లో కవరేజీ గురించి పెద్దగా పట్టించు కోలేదు. తాను ఏం చెప్పాలి అనుకున్నారో తన పార్టీ ఎన్నికల సభల్లోనే  బహిరంగంగానే చెప్పారు. కానీ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలను టీవీకే పార్టీ చాలా ప్రభావవంతంగా సద్వినియోగం చేసుకుంది. పక్కా ప్లానింగ్ తో ప్రజల్లోకి ప్రధానంగా జెన్ జీ తరం లోకి దూసుకుపోయింది. 

 డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలపై మితిమీరిన విమర్శలు చేయ లేదు.. వివాదాస్పదంగా వ్యవహరించ లేదు.. విజయ్ తాను చెప్పాల్సింది సూటిగా చెప్పారు...తమిళ రాజకీయాలకు మూలమైన ద్రవిడ వాదానికి కట్టుబడి ఉంటాం..లౌకికవాద పార్టీగా నిలుస్తాం..డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీ లతో విసుగెత్తి పోయిన తమిళనాడు కు కొత్త తరహా రాజకీయాలు చేస్తాం ..మెరుగైన పరిపాలన అందిస్తాం..అనే స్పష్టం చేస్తూ ప్రచారం చేశారు.. తద్వారా తమిళనాట పాత, కొత్త తరాల మద్దతు సాధించేందుకు సరియైన ప్రణాళిక తో దూసుకు పోయారు..ఏ పార్టీ తో పొత్తు పెట్టుకోం అన్న స్పష్టమైన విధానం టీవీకే పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది.. పార్టీని గెలిపించుకోవాలి అనే కసి రగిలించింది..డీఎంకే, ఏఐఏడీఎంకే లకు ప్రత్యామ్నాయం అవసరం అని భావించిన వర్గాలకు విజయ్ ఒక్కరే సరైన చాయిస్ గా నిలిచారు. 

వెరసి...

రాజకీయ తెర మీద  నిబ్బరంగా... స్థిరంగా పోరాడినవాడే సూపర్ స్టార్ అని విజయ్ మరోసారి నిరూపించారు. 
విజయ్  పాపులారిటీని కొంత వరకు అయినా సరే చెక్ పెట్టేందుకు  ఆయన నటించిన "జన నాయగన్"  సినిమా రిలీజ్ ను  అధికార పార్టీ అడ్డుకుంది.  ఆ సినిమా ఓటీటి రైట్స్ కొనుగోలు చేసిన వాళ్లు కూడా ఒప్పందం రద్దు చేసుకునేలా చేశారు..కానీ ఆ సినిమా లోని కొన్ని సీన్లు లీక్ అయ్యాయి..సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి..వాటిలో ఒక సీను లో " ఉంగ విజయ్... నాను వారెరెన్ ( మీ విజయ్ ను... నేను వస్తున్నా) 

అనే డైలాగ్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. 

ఎన్నికల ప్రచారం లో విజయ్  ఆ డైలాగ్ నే తన పొలిటికల్ పంచ్ లైన్ గా చేసుకున్నారు. తన ఎన్నికల ప్రచార రథం మీద నుంచి మాట్లాడుతూ..." ఉంగ విజయ్.. నాను వారెరెన్... విజిల్ ఆడిక్కా ... రెడీ నా"( మీ విజయ్ ను... నేను వస్తున్నా... విజిల్ మోగించడానికి మీరు రెడీ నా)  అని తన క్యాడర్ ను ఉర్రూతలూగించారు... "ఉంగ విజయ్... ఉంగ విజయ్ " అనే టీవీకే పార్టీ ప్రచార గీతం తమిళనాట మార్మోగింది. ఆ విజిల్ మోత తమిళనాడు విజయ దుందుభి మోగించింది.

' నాను వారెరన్.. నాను వారెరన్ ( నేను వస్తున్నా... నేను వస్తున్నా) అన్న విజయ్... తన తొలి పొలిటికల్ ఇన్నింగ్స్ లోనే   సెంచరీ కొట్టి   తన టీవీకే పార్టీ కి తమిళనాట ఛాంపియన్ గా నిలిపారు..

2026 ఎన్నికల్లో తమిళనాడులో 

 Player Ot The Match గానే కాదు...మినీ జనరల్ ఎన్నికలు అన్నటుగా...2029 జనరల్ ఎన్నికలకు సెమీ ఫైనల్ అనిపించేట్టుగా అయిదు  రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో  The Most Emerging Player in  Indian Politics అవార్డు కూడా సాధించారు. ఇక జనరల్ ఎన్నికల ఐపీఎల్ -2029 కోసం అన్ని ప్రధాన పార్టీలు విజయ్ ను తమ జట్టు లో చేర్చుకోవడానికి ఇప్పటి నుంచే పావులు కదపడం ఖాయం..


వడ్డాది శ్రీనివాస్.. ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరణ.


 

By
en-us Political News

  
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.