హైదరాబాద్‌లో ఎకరం రూ.177 కోట్లు

Publish Date:Oct 6, 2025

Advertisement

 

హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ  నిర్వ హించిన రాయదుర్గం భూవేలంలో ఎకరానికి రూ.177 కోట్లు పలకడంతో కొత్త రికార్డు నమోదైంది. మొత్తం 7.67 ఎకరాల భూమిరూ.1357.59 కోట్లకు అమ్ము డైంది.ఇది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రికార్డు స్థాయి ధర. గతంలో కోకాపేట నియో పోలిస్‌ ప్రాంతంలో హెచ్‌ఎండీఎ నిర్వహించిన వేలంలో ఎకరానికి రూ.100.75 కోట్లు పలికిన రికార్డును రాయదుర్గం భూ వేలం పాట బద్దలు కొట్టింది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసానికి ఇది నిదర్శనమని చెప్పవచ్చు..ఈ వేలంలో ప్రముఖ జాతీయ, ప్రాంతీయ డెవలపర్లు భారీగా పాల్గొన్నారు. ఇది హైదరాబాద్ స్థిరమైన వృద్ధి, ప్రభుత్వ పారదర్శక విధానాలు, నాలెడ్జ్ సిటీ మధ్యలో ఉన్న రాయదుర్గం వ్యూహాత్మక ప్రాధాన్యం — అన్నీ కలిపి పెట్టుబడి దారుల విశ్వాసాన్ని ప్రతిబింబించింది.ఈ సందర్భంగా TGIIC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక, IAS మాట్లాడుతూ...రాయదుర్గం వేలం విజయం తెలంగాణ కు గర్వకారణమని అన్నారు. ఎకరానికి రూ.177 కోట్ల రికార్డు ధర పలకడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

.. హైదరా బాద్ యొక్క దీర్ఘకా లిక సామర్థ్యాన్ని, తెలంగాణ రైజింగ్–2047 దిశగా రాష్ట్రం సాగుతున్న దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మద్దతుతో, పారదర్శకమైన, వ్యాపారానుకూల వాతావరణాన్ని సృష్టించాలనే ప్రభుత్వ దార్శనికత కు ఇది నిదర్శన మని పేర్కొన్నారు. భూమి విలువ పెరుగుదలలో ఇది ఒక కొత్త మైలు రాయి అని అన్నారు. 

2017లో రాయదుర్గం 2.84 ఎకరాలు ఎకరానికి రూ.42.59 కోట్లు పలికాయి. 2022లో కోకాపేట నియోపోలిస్‌లో ఎకరానికి రూ.100.75 కోట్లు పలికాయి.2025లో రాయదుర్గం ఎకరానికి రూ.177 కోట్లు పలకడం ద్వారా నాలుగు రెట్ల వృద్ధి సాధించింది. వేలం విజయ వంతం కావడంలో కీలక పాత్ర పోషించిన TGIIC బృందం, JLL మరియు MSTC సభ్యులకు శశాంక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సహకారం, బిడ్డర్లు చూపిన విశ్వాసమే ఈ చారిత్రాత్మక ఫలితానికి కారణమని ఆయన పేర్కొన్నారు.


 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.