టెక్స్ట్ నెక్ సిండ్రోమ్..వామ్మో యూత్ లో పెరిగిపోతున్న ఈ వ్యాధి గురించి తెలుసా?

Publish Date:Dec 13, 2024

Advertisement

 


ప్రపంచవ్యాప్తంగా యువతలో  టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే వ్యాధి పెరిగిపోతోందట. సోషల్ మీడియా మొత్తం ఈ వ్యాధి గురించి కోడై కూస్తోంది.  జీవనశైలి,  ఆహారం.. ఈ రెండూ  ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేశాయి. యువత  కూడా ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. యువతలో పెరుగుతున్న మధుమేహం,  రక్తపోటు సమస్య నిపుణులను ఆందోళనకు గురిచేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా యువతలో పెరుగుతున్న టెక్స్ట్ నెక్ వ్యాధి ఇప్పుడు అందరిని కలవర పెడుతోంది. ఈ సమస్య భరించలేని నొప్పిని కలిగించడమే కాకుండా అనేక  అసౌకర్యాలను కూడా పెంచుతుందని అంటున్నారు. అసలు టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే సమస్య ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? దీని నివారణకు ఏం చేయాలి? తెలుసుకుంటే..

 టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనేది కొత్త పదం. దీనిని టెక్ నెక్ లేదా స్మార్ట్‌ఫోన్ నెక్ అని కూడా అంటారు. ముందుకు వంగి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువసేపు చూడటం వలన మెడపై అదనపు ఒత్తిడి,  టెన్షన్ పెరుగుతుంది. దాని కారణంగా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ సమస్య వస్తుంది. సింపుల్ గా  అర్థం చేసుకుంటే స్క్రీన్ వైపు చూసేందుకు  తలను ముందుకు,  క్రిందికి వంచినప్పుడు టెక్స్ట్ నెక్ సమస్య ఏర్పడుతుంది.  దీని కారణంగా మెడ  వెన్నెముకపై ఒత్తిడి మళ్లీ మళ్లీ పెరుగుతుంది.

కదల్చకుండా ఉన్నప్పుడు  మనిషి తల 10-12 పౌండ్ల (నాలుగున్నర నుండి ఐదు కిలోల వరకు) మధ్య బరువు ఉంటుంది.  కానీ ముందుకు వంగినప్పుడు ఈ బరువు పెరుగుతుంది. ఇది మెడ కండరాలు,  వెన్నెముకపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.  35 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు టెక్స్ట్ నెక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని తేలింది. 15-18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ సమయం గడిపేవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ మెడ, ఎగువ వీపు,  భుజాలలో నొప్పిని కలిగిస్తుంది.

సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే మెడ నొప్పి చుట్టుపక్కల కండరాలను కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఎగువ వెనుక కండరాలలో అసమతుల్యత ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనితో పాటు  కొంత సమయం పాటు మెడను ఒకే భంగిమలో ఉంచడంలో ఇబ్బంది పడవచ్చు. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ సమస్య కాలక్రమేణా మీ 'జీవన నాణ్యత'పై కూడా ప్రభావం చూపుతుంది.

పరిష్కారాలు..

టెక్స్ట్ నెక్ సమస్య రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యువకులు తమ ఫోన్‌లతో ఎక్కువ నిమగ్నమై ఉంటారు కాబట్టి, వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు సరైన భంగిమలో ఉండటం ముఖ్యం.  మెడను చాలా ముందుకు వంచకూడదు.  ఏ వస్తువు వాడినా దాన్ని కంటి ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

మెడ మరియు భుజాలను సాగదీయడానికి,  విశ్రాంతి తీసుకోవడానికి తరచుగా విరామం తీసుకోవాలి.

ల్యాప్‌టాప్ స్టాండ్‌లు,  ఫోన్ హోల్డర్‌లను ఉపయోగించడం ద్వారా కూడా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్‌ను నివారించవచ్చు.

ముఖ్యమైన విషయం ఏమిటంటే కొంత సమయం వరకు మెడ లేదా వెన్నునొప్పి ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకూడు.  ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.


                                                              *రూపశ్రీ.
 

By
en-us Political News

  
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.